For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బాలయ్య-బోయపాటి చిత్రానికి ముహుర్తం ఖరారు.. మ్యూజిక్ డైరెక్టర్ కూడా ఫిక్స్

    |

    నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ అంటూ బాలయ్య అభిమానులకే కాదు.. సగటు సినీ ప్రేక్షకుడికి ఆసక్తే. బోయపాటి యాక్షన్, బాలయ్య మ్యానరిజం డైలాగ్‌లతో థియేటర్లలో టాప్ లేచిపోవాల్సిందే. ఇప్పటికే వీరి కాంబినేషన్‌లో సింహా, లెజెండ్ లాంటి సినిమాలు రాగా.. అవి ఎంతటి సెన్సేషన్‌ను స‌ృష్టించాయో అందరికీ తెలిసిందే. తాజాగా వీరిద్దరు హ్యాట్రిక్ కొట్టేందుకు సిద్దమయ్యారు.

     ప్రస్తుతం రూలర్ అంటూ రోరింగ్..

    ప్రస్తుతం రూలర్ అంటూ రోరింగ్..

    జై సింహా లాంటి మాస్ ఎంటర్‌టైనర్‌ను తెరకెక్కించిన కెఎస్ రవికుమార్.. రూలర్ అంటూ మరోసారి నందమూరి అభిమానులను మెస్మరైజ్ చేసేందుకు వస్తున్నాడు. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్, పోస్టర్స్, సాంగ్స్‌తో ఓ రేంజ్ హైప్ క్రియేట్ చేసిన చిత్రబృందం.. డిసెంబర్ 20న రూలర్‌ను విడుదల చేసేందుకు సిద్దమవుతోంది.

    #CineBox : RGV's #KRKR In Trouble? | Pawan Kalyan Voice Over For #AlaVaikunthapuramuloTeaser ?
    గ్రాండ్‌గా ఈవెంట్..

    గ్రాండ్‌గా ఈవెంట్..

    ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను అత్యంత భారీ ఎత్తున నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది చిత్రయూనిట్. డిసెంబర్ 15న వైజాగ్‌లో ఈ ఈవెంట్‌ను గ్రాండ్‌గా నిర్వహించబోతోన్నట్లు ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ వేడుకకు భారీ ఎత్తున అభిమానులు హాజరు కాబోతోన్నట్లు టాక్.

    బాలయ్య బోయపాటి మూవీ..

    బాలయ్య బోయపాటి మూవీ..

    రూలర్ చిత్రం ఎలాగూ పూర్తి కావడంతో.. తన తదుపరి చిత్రంపై కన్నేశాడు బాలయ్య. ముందుగా అనుకున్నట్లే.. బోయపాటితో సినిమా చేసేందుకు సిద్దమయ్యాడు. రేపు ఈ మూవీకి సంబంధించి పూజా కార్యక్రమాలు జరగనున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీని రేపు లాంఛనంగా ప్రారంభించి వచ్చే ఏడాదిలో రెగ్యులర్ షూటింగ్ ప్లాన్ చేసినట్లు సమాచారం.

    సంగీత దర్శకుడిగా తమన్..

    సంగీత దర్శకుడిగా తమన్..

    ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో తమన్ హవా నడుస్తోంది. ఎటు చూసినా.. ఏ పాట విన్నా తమన్ సంగీతం నుంచి జాలువారినవే. వరుస హిట్ ఆల్బమ్స్‌తో దూసుకుపోతోన్న తమన్.. బాలయ్య సినిమాకు కూడా సంగీతాన్ని అందించబోతోన్నాడని తెలుస్తోంది.

    ఇద్దరు హీరోయిన్లతో రచ్చ..

    ఇద్దరు హీరోయిన్లతో రచ్చ..

    కాగా ఈ చిత్రంలో ఇద్దరు హీరోయిన్స్ ఉంటారని తెలుస్తోంది. వారిలో ఒక హీరోయిన్‌గా కన్నడ బ్యూటీ శ్రద్ధ శ్రీనాథ్‌ను తీసుకోవాలని దర్శక నిర్మతలు అనుకుంటున్నారని టాక్. అయితే ఈ సినిమాలో బాలయ్య రెండు పాత్రల్లో కనిపించనున్నారని సమాచారం. ఈ సినిమా ఎమోషనల్ బ్యాక్ డ్రాప్ లో సాగే పక్కా యాక్షన్ ఎంటర్ టైనర్ అని టాక్ నడుస్తోంది.

    English summary
    Nandamuri Balakrishna And Boyapati srinu Movie Starts On 6th December. Buzz Is That Thaman Is Going To Compose Music For This Movie.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X