బాబీ సినిమాలో బిగ్ ట్విస్ట్... ఇదెక్కడి మాస్ కాంబోరా బాబు... బాలయ్యతో పాటు మరో స్టార్ హీరో!
ఈ మధ్యకాలంలో అపజయమే లేకుండా దూసుకుపోతున్నాడు నందమూరి బాలకృష్ణ. చివరిగా వీరసింహారెడ్డి అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు ఆయన. ఇక ఇప్పుడు మరో హీరోతో కలిసి మల్టీస్టారర్ చేస్తున్నాడు అనే వార్తలు టాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారుతున్నాయి. ఆయన ఏ హీరోతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నాడు? ఎవరు ఆ సినిమా డైరెక్ట్ చేయబోతున్నారు? అనే వివరాల్లోకి వెళ్లే ప్రయత్నం చేద్దాం
భగవంత్ కేసరి సిద్ధం : నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. భగవంత్ కేసరి పేరుతో తెరకెక్కుతున్న ఒక సినిమాలో కాజల్ అగర్వాల్ ఆయన సరసన హీరోయిన్ గా నటిస్తుండగా శ్రీలీల ఒక కీలకపాత్రలో కనిపించబోతోంది. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చేసింది. అక్టోబర్ నెలలో దసరా సందర్భంగా ఈ సినిమాని రిలీజ్ చేసేందుకు కూడా ప్రణాళికల సిద్ధం చేస్తున్నారు.



మల్టీస్టారర్ మూవీ : అయితే ఇప్పుడు తాజాగా అందుతున్న సమాచారం వరకు ఈ సినిమాలో మరో టాలీవుడ్ హీరో కూడా భాగం కాబోతున్నాడని అయితే ఆయన నెగిటివ్ షెడ్స్ లో ఉన్న పాత్ర పోషించబోతున్నాడని ప్రచారం జరుగుతోంది. ఇక ఆ హీరో మరెవరో కాదు... రవితేజ అని అంటున్నారు. నిజానికి రవితేజ, బాలకృష్ణ మధ్య ఆ మధ్య గొడవలు జరిగాయని కూడా ప్రచారం జరిగింది. కానీ అన్ స్టాపబుల్ వేదికగా అవేవీ నిజం కాదు అనే విషయం మీద క్లారిటీ వచ్చేసింది.



Click it and Unblock the Notifications











