RRR pre release eventకి భారీ ప్లానింగ్..ముఖ్య అతిథులుగా మెగాస్టార్, బాలకృష్ణ సహా మరో స్టార్?

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన 'బాహుబలి' తర్వాత తెలుగు సినిమా ఖ్యాతి కేవలం భారత దేశం వరకే కాకుండా విశ్వవ్యాప్తం అయిపోయింది. దీంతో అప్పటి నుంచి టాలీవుడ్‌లో పాన్ ఇండియా చిత్రాలకు మార్గం సుగమం అయింది. ఆయన ఇప్పుడు పాన్ వరల్డ్ మూవీతో రాబోతున్నాడు. ఆ సినిమా పేరే RRR (రౌద్రం రణం రుధిరం). ఈ మూవీలో టాలీవుడ్ స్టార్ హీరోలు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటిస్తున్నక్రమంలో సినిమా రేంజ్ భారీ స్థాయిలో పెరిగిపోయింది. భారత దేశ సినీ లవర్స్ సహా ప్రపంచ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ చిత్రం మరికొద్ది రోజుల్లోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా RRR మూవీ ప్రమోషన్స్ మళ్ళీ మొదలు పెట్టనున్నారు. అయితే ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ కు మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ హాజరు కానున్నారని తెలుస్తోంది. ఆ వివరాలు మీకోసం

భారీ బడ్జెట్ సినిమాకు

భారీ బడ్జెట్ సినిమాకు

తెలుగు రాష్ట్రాలకు చెందిన తొలి తరం స్వతంత్ర సమర యోధులు అల్లూరి సీతారామరాజు, కొమురం భీం జీవిత కథలకు కల్పిత కధ జోడించి రాజమౌళి తెరకెక్కించిన మూవీనే RRR (రౌద్రం రణం రుధిరం). భారీ బడ్జెట్‌తో డీవీవీ దానయ్య నిర్మిస్తోన్న ఈ భారీ బడ్జెట్ సినిమాకు కీరవాణి సంగీతం ఇస్తున్నారు. ఆలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాలో కొమరం భీంగా ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజుగా చరణ్ నటిస్తున్నారు.

మార్చి 25న

మార్చి 25న

ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన RRR మూవీని 2020 లో విడుదల చేయాలని అనుకున్నారు. కానీ, కరోనా పలు విడతల కారణంగా వాయిదా పడింది. ఆ తర్వాత కూడా పలు డేట్లను ప్రకటించినా అప్పుడు కూడా విడుదల కాలేదు. చివరికి సంక్రాంతికి తీసుకు రావాలని అనుకున్నాథర్డ్ వేవ్ కారణంగా అప్పుడు కూడా అది సాధ్య పడలేదు. దీంతో ఈ సినిమాను మార్చి 25న విడుదల చేస్తామని చిత్ర యూనిట్ ఇటీవలే ప్రకటించిన సంగతి తెలిసిందే.

స్పీడ్ పెంచే ఉద్దేశ్యంతో

స్పీడ్ పెంచే ఉద్దేశ్యంతో

ఇక RRR మూవీపై దేశ వ్యాప్తంగా భారీ స్థాయిలో బజ్ ఉంది. దీంతో ఈ సినిమా మీద ప్రమోషన్స్ కూడా భారీ స్థాయిలో చేయడానికి సిద్ధం అవుతున్నారు. అయితే వచ్చే వారంలో రాధేశ్యామ్ సినిమా విడుదల కాబోతుంది. రెండు సినిమాలకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలు క్లాష్ అవుతాయనే ఉద్దేశ్యంతో జక్కన్న టీమ్ కాస్త సైలెంట్ గా ఉన్నట్లు చెబుతున్నారు. ఆ సినిమా విడుదల అయిన తర్వాత స్పీడ్ పెంచే ఉద్దేశ్యంతో ఉన్నారని అంటున్నారు.

శివ రాజ్ కుమార్

శివ రాజ్ కుమార్

ఇప్పటికే ముంబై, చెన్నై, తిరువనంతపురంలో హిందీ, తమిళం, మలయాళం బాషల ప్రీ రిలీజ్ ఈవెంట్లు జరిపారు. ఇక ఈసారి హైదరాబాద్ మరియు బెంగళూరు లో భారీ ఈవెంట్ ను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారట. బెంగళూరు విషయానికి వస్తే రాజమౌళి, రామ్ చరణ్, ఎన్టీఆర్ లు పాల్గొనబోతున్న ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు తెలుగు నుంచి బాలకృష్ణ, కన్నడ నుంచి శివ రాజ్ కుమార్ పాల్గొనబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.

Recommended Video

RRR టీం కీలక ప్రకటన.. మీరు అనుకున్నట్టు చేయడం లేదంటూ క్లారిటీ! || Filmibeat Telugu
హైదరాబాద్ ఈవెంట్ కు

హైదరాబాద్ ఈవెంట్ కు

హైదరాబాద్ ఈవెంట్ కు రాజమౌళి, రామ్ చరణ్, ఎన్టీఆర్ లతో పాటు చిరంజీవి హాజరు అవుతారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఆ విషయమై క్లారిటీ రావాల్సి ఉంది. బెంగళూరు ప్రీ రిలీజ్ ఈవెంట్ కు కూడా ఒక కన్నడ సూపర్ స్టార్ గెస్ట్ గా హాజరు అవుతాడని అంటున్నారు. అందుకు వీటికి సంబంధించిన అధికారిక ప్రకటన కోసం అభిమానులు వెయిట్ చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X