బాలకృష్ణతో దగ్గుబాటి వారసుడు.. భారీ స్కెచ్!!

నందమూరి నటసింహం బాలకృష్ణ, దగ్గుబాటి వారసుడు రానాతో భారీ మల్టీస్టారర్ ప్లాన్ చేసిందట సితార ఎంటర్‌టైన్మెంట్ సంస్థ. మలయాళ బ్లాక్ బస్టర్ 'అయ్యప్పనుమ్‌ కోసియుమ్' సినిమాను తెలుగు, తమిళ భాషల్లో రీమేక్ చేయబోతున్నారు. ఈ చిత్రం తెలుగు రీమేక్ హక్కులను దక్కించుకున్న సితార ఎంటర్‌టైన్మెంట్.. బాలకృష్ణ, రానా హీరోలుగా ఈ సినిమా రూపొందించాలని సన్నాహాలు చేస్తోందట.

అయప్పనుమ్ నాయర్ అనే పోలీసు అధికారి, రిటైర్డ్ హవల్దార్ కోషి కురియన్ మధ్య జరిగే ఈగో వార్ నేపథ్యంలో సాగే కథతో ఈ మూవీ ఒరిజినల్ వర్షన్ రూపొందించారు. ఇందులో బిజు మీనన్, పృథ్వీరాజ్ ప్రధాన పాత్రలు పోషించారు. అయితే ఇప్పుడు బిజు మీనన్ పాత్రను బాలయ్యతో చేయించాలని ప్లాన్ చేసి అందుకు ఆయన నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ తీసుకున్నారట.

Nandamuri Balakrishna and Rana Daggubati will shere screen again?

పృథ్వీరాజ్‌ పాత్ర కోసం దగ్గుబాటి రానాను సంప్రదించినట్లు తెలుస్తోంది. బాలకృష్ణ, రానా హీరోలుగా భారీ బడ్జెట్ కేటాయించి ఈ సినిమా రూపొందించాలని ప్లాన్ చేస్తున్నారట దర్శకనిర్మాతలు. దీనిపై అఫీషియల్ ప్రకటన కూడా త్వరలోనే వస్తుందని టాక్ వినిపిస్తోంది. గతంలో ఎన్టీఆర్ బయోపిక్‌లో రానా, బాలకృష్ణ కలిసి నటించారు కానీ పెద్దగా ఫలితం లేదు. సో.. చూడాలి మరి ఈ సారి మన హీరోలు ఎలా అలరిస్తారో!.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X