For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘రూలర్’లో బాలయ్య లిప్‌లాక్.. వాళ్లిద్దరి మధ్య రొమాన్స్ మామూలుగా ఉండదట

    |

    నందమూరి తారక రామారావు కుమారుడిగా తెరంగేట్రం చేసినప్పటికీ తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు బాలకృష్ణ. ఈ క్రమంలోనే ఎంతో మంది అభిమానులను సైతం సంపాదించుకున్నారు. ముఖ్యంగా మాస్ హీరోగా పేరు తెచ్చుకున్న బాలయ్య.. ఎన్నో విజయవంతమైన చిత్రాలను అందించారు. అయితే, గతంలో వరుసగా సినిమాలు చేస్తూ వచ్చిన ఈయన.. కొద్దిరోజులుగా స్పీడును తగ్గించారు. రాజకీయాల్లోకి ఎంటరైన తర్వాత మరింత ఆచితూచి అడుగులు వేస్తున్నారు. దీంతో బాలయ్య ఫ్యాన్స్ నిరాశకు లోనవుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన 'రూలర్' అనే సినిమా షూటింగ్‌లో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త బయటకు వచ్చింది. ప్రస్తుతం ఇది హాట్ టాపిక్ అవుతోంది. ఇంతకీ ఏంటా వార్త..?

    మరో హిట్ కోసం జత కట్టారు

    మరో హిట్ కోసం జత కట్టారు

    గతంలో ‘జై సింహా' వంటి హిట్ సినిమాను అందించిన కేఎస్ రవికుమార్‌తో బాలయ్య మరోసారి జట్టుకట్టారు. ఈ సినిమాను ప్రముఖ నిర్మాత సీ కల్యాణ్ తెరకెక్కిస్తున్నారు. దీనికి ‘రూలర్' అనే టైటిల్ పెట్టారు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను డిసెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నారు. ఇందులో బాలయ్య సరసన సోనాల్ చౌహాన్, వేదిక నటిస్తుండగా, భూమిక, జయసుధ కీలక పాత్రలు చేస్తున్నారు.

     బాలకృష్ణ రెండు షేడ్స్‌లో...

    బాలకృష్ణ రెండు షేడ్స్‌లో...

    ఈ సినిమాలో బాలకృష్ణ రెండు షేడ్స్‌లో కనిపిస్తున్నారు. అందులో ఒకటి పోలీస్ ఆఫీసర్ పాత్ర కాగా, మరొకటి గ్యాంగ్‌స్టర్ క్యారెక్టర్. గ్యాంగ్‌స్టర్ పాత్ర బాలయ్య లుక్స్ ఎక్ట్రార్డినరీగా ఉన్నాయనే చెప్పాలి. ఇక, ఈ సినిమా కథ విషయానికొస్తే.. సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ గ్యాంగ్‌స్టర్‌గా ఎలా మారాడు అనేదే సినిమా కథ అని ఫిలింనగర్‌లో ఓ న్యూస్ హల్‌చల్ చేస్తోంది. అయితే, దీనిపై ఎటువంటి క్లారిటీ లేదు.

    సరికొత్త లుక్‌లో బాలయ్య

    సరికొత్త లుక్‌లో బాలయ్య

    ఈ సినిమాలో బాలయ్య క్యారెక్టర్లకు సంబంధించిన లుక్స్ కొన్ని చిత్ర యూనిట్ విడుదల చేసింది. వీటిలో బాలయ్య సన్నగా సరికొత్తగా కనిపిస్తున్నాడు. ఫ్రెంచ్ కట్ షేవ్‌తో హ్యాండ్సమ్‌గా దర్శనమిస్తున్నాడు. అంతేకాదు, ఈ పిక్స్‌లో బాలయ్య వయసు తగ్గిపోయిందన్నట్లుగా ఉంది. దీంతో ఆయన అభిమానులతో పాటు సినీ ప్రియులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

    ఆ లుక్కుల వెనుక రహస్యం ఇదే

    ఆ లుక్కుల వెనుక రహస్యం ఇదే

    బాలయ్య ఈ సినిమా కోసం ఎంతగానో కష్ట పడుతున్నారు. తన అభిమానులకు ఎలాగైనా మంచి సినిమాను అందించాలన్న కసితో పని చేస్తున్న బాలయ్య.. అదే సమయంలో తనలో తాను కొంత మార్పులు కూడా చేసుకుంటున్నారు. ఇందులో భాగంగానే సన్నగా అవడం కోసం ఆయన రోజుకు ఐదు గంటల పాటు జిమ్‌లో కసరత్తులు చేస్తున్నారు. ఈ కారణంగానే ఆయన లుక్‌లో వేరియేషన్ కనిపిస్తుంది.

    #CineBox : Balakrishna Suggestions To Boyapati Sreenu For Their Upcoming Film !
    వాళ్లిద్దరి కెమిస్టీ అదుర్స్

    వాళ్లిద్దరి కెమిస్టీ అదుర్స్

    ఈ సినిమా గురించి తాజాగా ఓ వార్త బయటకు వచ్చింది. ‘రూలర్'లో వచ్చే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్‌లో బాలయ్య.. హీరోయిన్ వేదికతో చేసే రొమాన్స్ అదిరిపోతోందట. వీళ్లిద్దరి మధ్య ఉన్న సీన్స్ మొత్తం ఆకట్టుకుంటాయని తెలుస్తోంది. అంతేకాదు, ఈ జంటకు ఉన్న ఓ సాంగ్ చూస్తే అదుర్స్ అనాల్సిందేనన్న టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే ఈ సాంగ్‌కు సంబంధించిన షూటింగ్ కూడా పూర్తయిపోయిందని తెలిసింది.

    English summary
    Nandamuri Balakrishna is looking lean. The 60-year-old actor has slimmed down. He lost nearly 8 kgs to look fit for a role in ‘Ruler’. The new still that was released today gives a glimpse of his slim avatar.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X