చిన్న సినిమా దర్శకుడితో నందమూరి బాలకృష్ణ ప్రయోగం.. త్వరలోనే మరో బిగ్ అప్డేట్!

నందమూరి బాలకృష్ణ ఇటీవల కాలంలో విభిన్నమైన స్థాయిలో కొనసాగుతూ ఉండడం హాట్ టాపిక్ గా మారుతుంది. ముఖ్యంగా ఆయన ఓటీటీ ప్లాట్ఫామ్ లో అన్ స్టాపబుల్ షోఘో రావడం అభిమానులను ఎంతగానో కట్టుకుంటుంది. ఇక రాబోయే సినిమాలు మరింత హై వోల్టేజ్ యాక్షన్ ఎలివేషన్స్ తో రాబోతున్నాయి. అయితే మధ్యలో మరి కొన్ని ప్రయోగాలు కూడా చేయాలి అని బాలయ్య చిన్నదర్శకులతో కూడా చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. రీసెంట్ గా ఒక చిన్న సినిమాతో మంచి గుర్తింపు అందుకున్న యువ దర్శకుడితో కొత్త కథపై చర్చలు జరిపినట్లు సమాచారం. ఆ వివరాలలోకి వెళితే..

నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తన 107వ సినిమాను ఫినిష్ చేసే పనిలో బిజీగా ఉన్నాడు. వీర సింహారెడ్డి టైటిల్ తో తెరపైకి రాబోతున్న ఈ సినిమాపై అంచనాలైతే మామూలుగా లేవు. ఎందుకంటే దర్శకుడు గోపీచంద్ మలినేని ఇంతకుముందు క్రాక్ సినిమాతో మంచి సక్సెస్ అందుకున్నాడు. బాలయ్య అఖండ సినిమాతో మరో విజయాన్ని అందుకొని ఫామ్ లోకి వచ్చేసాడు. ఇక నందమూరి బాలకృష్ణ తన 108వ సినిమాను అనిల్ రావిపూడి దర్శకత్వంలో చేయబోతున్న విషయం తెలిసిందే.

Nandamuri balakrishna another new project discussion started with venkatesh maha

అయితే ఈ రెండు ప్రాజెక్టుల్లో మాత్రమే కాకుండా మరో రెండు ప్రాజెక్టులపై కూడా బాలయ్య బాబు చర్చలు జరుపుతున్నాడు. పరుశురామ్ దర్శకత్వంలో కూడా ఒక సినిమా చేసే ఆలోచనలో ఉన్నట్లు ఇటీవల క్లారిటీ అయితే వచ్చేసింది. అలాగే మరొక చిన్న దర్శకుడు వెంకటేష్ మహాతో కూడా సినిమా చేసే ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. కేరాఫ్ కంచరపాలెం సినిమాతో మంచి గుర్తింపు అందుకున్న ఈ యువ దర్శకుడు ఆ తర్వాత ఉమామహేశ్వర ఉగ్రరూపస్య అనే సినిమాతో కూడా విమర్శకుల ప్రశంసలను అందుకున్నాడు. అయితే ఇటీవల బాలయ్యతో సినిమా చేసేందుకు ఒక కథ గురించి చర్చలు జరపగా అందుకు ఆయన పాజిటివ్ గా స్పందించినట్లుగా తెలుస్తోంది. అయితే పూర్తిస్థాయిలో బౌండెడ్ స్క్రిప్ట్ సిద్ధం చేసుకుని మరోసారి రావాలి అని బాలయ్య సూచనలు ఇచ్చినట్లు సమాచారం. మరి వీరి కలయికలో ఎలాంటి ప్రయోగాత్మకమైన చిత్రం వస్తుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X