Bhagavanth Kesari: బాలయ్య 'భగవంత్ కేసరి' స్టోరీ లీక్.. కాజల్ సెంటిమెంట్ వర్కౌటయితే బ్లాక్ బస్టర్

నందమూరి అభిమానులు అందరూ బాలకృష్ణ హీరోగా నటిస్తున్న భగవంత్ కేసరి సినిమా గురించి చాలా ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే నందమూరి బాలకృష్ణతో ఆయన అభిమానిగా చెప్పుకునే అనిల్ రావుపూడి సినిమా చేయడం... అఖండ, వీర సింహారెడ్డి లాంటి సినిమాలు తర్వాత స్వయంగా నందమూరి బాలకృష్ణ ఈ సినిమా చేస్తూ ఉండడంతో ఈ సినిమా మీద ఒక్కసారిగా అంచనాలైతే పెరుగుతున్నాయి. అయితే ఈ సినిమాకి సంబంధించిన కథ ఇదే అంటూ ఇప్పటికే చాలా రకాల ప్రచారాలు జరిగాయి. కానీ ఇప్పుడు మరొక ప్రచారం అయితే తెరమీదకు వస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే...

నిజానికి భగవంత్ కేసరి సినిమాలో నందమూరి బాలకృష్ణ సరసన హీరోయిన్ గా కాజల్ అగర్వాల్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక వీరిద్దరి కుమార్తెగా శ్రీలీల కూడా ఒక కీలకపాత్రలో నటిస్తోంది. అయితే తాజాగా అందుతున్న సమాచారం మేరకు ఈ సినిమా కథ అయితే లీక్ అయినట్లుగా చెబుతున్నారు. లీకైన కథ ప్రకారం కాజల్ అగర్వాల్ పాత్ర ఫ్లాష్ బ్యాక్ లో ఉంటుందని అంటున్నారు.

Nandamuri Balakrishna Bhagavanth Kesari Story Leak And Kajal Role and Details Here

నందమూరి బాలకృష్ణ కాజల్ అగర్వాల్ యుక్త వయసులో ఉన్నప్పుడు వివాహం చేసుకుంటారని... వీరిద్దరి ప్రేమకు గుర్తుగా శ్రీ లీల జన్మిస్తుందని అంటున్నారు. అయితే ఒక ప్రమాదంలో కాజల్ అగర్వాల్ చనిపోతుందని ఆ తర్వాత నందమూరి బాలకృష్ణ స్వయంగా శ్రీ లీలను పెంచుకుంటాడని అంటున్నారు. నిజానికి కాజల్ అగర్వాల్ అలా మద్యంతరంగా చనిపోయే పాత్రలు చేయడం ఇదేమి కొత్త కాదు.

Nandamuri Balakrishna Bhagavanth Kesari Story Leak And Kajal Role and Details Here

గతంలో నేనే రాజు నేనే మంత్రి, ఎవడు వంటి సినిమాల్లో కూడా కాజల్ అగర్వాల్ చనిపోయినట్లుగా చూపిస్తారు. ఇప్పుడు అదే తరహాలో ఆమె ఈ పాత్ర చేస్తుందని అంటున్నారు. అనిల్ రావిపూడి డైరెక్షన్ లో నందమూరి బాలకృష్ణ హీరోగా ఈ సినిమాని షైన్ స్క్రీన్స్ అనే బ్యానర్ నిర్మిస్తుంది. గతంలో మజిలీ, నిన్ను కోరి వంటి సినిమాలను నిర్మించిన షైన్ స్క్రీన్స్ బ్యానర్ మీద హరీష్ పెద్ది, సాహు గారపాటి ఈ సినిమాను గ్రాండ్ గా నిర్మిస్తున్నారు.

Nandamuri Balakrishna Bhagavanth Kesari Story Leak And Kajal Role and Details Here

భగవంత్ కేసరి సినిమా షూటింగ్ పూర్తి అయిన వెంటనే బాలకృష్ణ బాబీ డైరెక్షన్లో సినిమా చేయబోతున్నాడు. ఆ సినిమా మీద కూడా భారీ అంచనాలు ఉన్నాయి. అయితే ఆ సినిమా ఒక పీరియాడిక్ మూవీ అని ఇప్పటికే కథ లాక్ అయిందని ఒక ప్రచారం జరుగుతుండగా ఆ కథకు బాలకృష్ణ బ్రేకులు వేశారని కథ మళ్ళీ మరొకటి తీసుకు రమ్మని చెప్పారని కూడా ప్రచారం జరిగింది.

Nandamuri Balakrishna Bhagavanth Kesari Story Leak And Kajal Role and Details Here

అయితే బాబీ సన్నిహిత వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు అలాంటి ఇబ్బందులు ఏవి లేవని నందమూరి బాలకృష్ణ మొదటిసారి కథ విని ఓకే చేసిన తర్వాత మళ్ళీ ఆ విషయంలో వేలు పెట్టరని బాబీ విషయంలో కూడా ఎలాంటి ఇబ్బందులు లేవని వారు చెబుతున్నారు. మొత్తం మీద అనిల్ రావిపూడి సినిమాలో కాజల్ అగర్వాల్ పాత్ర గురించి మాత్రం ఇప్పుడు హాట్ టాపిక్ గా పెద్ద ఎత్తున టాలీవుడ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X