Bhagavanth Kesari: బాలయ్య కుమ్మేశాడుగా... 'భగవంత్ కేసరి' లీక్ డైలాగ్ విన్నారా?

గీ సారి దసరా జోర్దారుంటది అంటూ నందమూరి బాలకృష్ణ.. భగవంత్ కేసరిగా ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా.. ఈ దసరా కానుకగా విడుదల కానుంది. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, పోస్టర్స్ కు మంచి ఆదరణ వస్తోంది. ఇక ఈ సినిమాలో కాజల్ ఆగర్వాల్ తో పాటు.. యంగ్ టాలీవుడ్ హీరోయిన్ శ్రీలీల కూడా నటిస్తోంది. ఇక ఇదిలా ఉండగా ఈ సినిమా నుంచి ఓ సెన్సేషన్ డైలాగ్ లీక్ అయింది. ఆ వివరాల్లోకి వెళితే....

ఎవరూ చేయని రిస్క్...: నందమూరి బాలకృష్ణ.. మంచి జోష్ మీద ఉన్నాడనే చెప్పాలి. కరోనా సమయంలోనే థియేటర్లకు ప్రేక్షకులు రారు అని నిర్మాతలు భయపడుతున్న వేళ బాలయ్య అఖండగా వచ్చి.. దుమ్ములేపాడు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. ఈ సినిమా తర్వత బాలయ్య అన్ స్టాపబుల్ షో ద్వారా ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు. ఈ సీజన్ సూపర్ హిట్ కావడం.. బాలయ్య మనసు మరింత అందరికి అర్థం కావడంతో సెకండ్ సీజన్ కూడా తీశారు. అది కూడా సూపర్ హిట్ షోగా నిలిచింది.

Bhagavanthkesari

భగవంత్ కేసరిగా..: ఇక ఈ ఏడాది ప్రారంభంలో బాలయ్య... వీరసింహారెడ్డిగా వచ్చాడు. ఇక ఈ సినిమా అయితే బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. గోపిచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో శృతిహాసన్, హానీరోజ్ హీరోయిన్లుగా నటించారు. ఇక బాలయ్య.. డ్యూయల్ రోల్ కనిపించి.. ఫ్యాన్స్ ను అలరించాడు. ఇక ఈ సినిమా తర్వాత సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో భగవంత్ కేసరి సినిమా చేస్తున్నాడు. ఇక ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, పోస్టర్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి.

Nandamuri Balakrishna Bhagavanthkesari movie dialogue leaked in social media

తెలంగాణ యాసలో ...: ఇక ఈ సినిమాలో బాలయ్యకు జోడీగా కాజల్ ఆగర్వాల్ నటిస్తోంది. ఆయన కూతురి పాత్రలో టాలీవుడ్ సెన్సేషన్ హీరోయిన్ శ్రీలీల నటిస్తోందని ప్రచారం జరుగుతోంది. మునుపెన్నడూ చూడని పాత్రలో బాలయ్యను ఈ సినిమాలో చూడబోతున్నట్లు ఇప్పటికే చిత్ర బృందం చెప్పుకొచ్చింది. మొదటి సారిగా బాలయ్య బాబు తెలంగాణ యాసలో మాట్లాడబోతున్నారు. ఇప్పటికే ట్రైలర్ లో బాలయ్య డైలాగ్స్ ఓ రేంజులో ఆకట్టుకుంటున్నాయి.

Bhagavanthkesari

దసరా జోర్దార్...:ఇక ఇటీవల ఈ సినిమా రిలీజ్ డేట్ ను కూడా ప్రకటించారు మేకర్స్. 'భగవంత్ కేసరి ఆయుధ పూజతో గీ సారి దసరా జోర్దారుంటది' అంటూ ఓ పోస్టర్ రిలజ్ చేశారు. ఆ పోస్టర్ పై అక్టోబర్ 19న ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కాబోతున్నట్లు ప్రకటించారు మేకర్స్. ఇక ఆ పోస్టర్ కూడా ఆకట్టుకుంటోంది. షైన్ స్క్రీన్స్ బ్యానర్ మీద సాహూ గారపాటి - హరీష్ పెద్ది నిర్మిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ అర్జున్ రాంపాల్ బాలయ్యకు పోటీగా విలన్ గా నటిస్తున్నారు.

Bhagavanthkesari

డైలాగ్ లీక్...:ప్రస్తుతం ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జరుపుకుటోంది. రీసెంట్‌గా 'భగవంత్ కేసరి' నుంచి ఓ డైలాగ్ లీక్ అయ్యింది అంటూ బాలయ్య ఫ్యాన్స్ వాట్సాప్ గ్రూపుల్లో తెగ చక్కర్లు కొడుతోంది. సాధారణంగా బాలయ్య సినిమా అంటేనే పవర్ ఫుల్ డైలాగ్స్ ఉంటాయి. ఇప్పుడు లీక్ అయిన ఆ డైలాగ్ ఏంటంటే... ''ఊర్లో ఉన్న కుక్కలు ఊర్లోనే మొరగాలి.. అడవిలో మొరిగితే సింహం ఊరుకుంటుందా?.. గర్జిస్తుంది.. అడవి బిడ్డ, 'భగవంత్ కేసరి'..'' అనే సాలిడ్ డైలాగ్ బాలయ్య చెప్పాడని అంటున్నారు. ఇదే కనుక సినిమాలో ఉంటే నందమూరి ఫ్యాన్స్‌ కు గూస్ బంప్స్ అని చెప్పవచ్చు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X