Akhanda 2: 'అఖండ 2'లో విలన్గా అధీరా... బాలయ్య దెబ్బను తట్టుకోగలడా?
కరోనా సమయంలో సినిమా పరిశ్రమ అంతా భయపడుతోంది. సినిమా రిలీజ్ చేయాలంటే... అసలు థియేటర్లకు జనాలు వస్తారా రారా అనే ఆలోచనలో పడిపోయారు మేకర్స్. అప్పుడు నందమూరి నటసింహం అఖండ అంటూ థియేటర్లోకి వచ్చాడు. ఇక జనాలు అంతా థియేటర్లకు పరుగులుపెట్టి మరీ చూశారు. ఇక ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్ తెరకెక్కించేందుకు మేకర్స్ రెడీ అయిపోయారు. ఇక ఈ సీక్వెల్ అఖండ 2లో విలన్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. ఆ వివరాలు ఈ స్టోరీలో చూద్దాం.
మాస్ డైరెక్టర్ బోయపాటి నందమూరి నటసింహం కాంబోలో బ్లాక్ బస్టర్ మూవీస్ వచ్చాయి. సింహా, లెజెండ్, అఖండ వంటి చిత్రాలతో వీరు బాక్సాఫీస్ వద్ద దండ యాత్ర చేశారు. ఇక అఖండ సినిమాతో వంద కోట్లు కలెక్ట్ చేసి... బాలయ్య కెరియర్లో మైలురాయిగా నిలిచింది అఖండ. ఇక ఈ చిత్రానికి సీక్వెల్ ఉంటుందని అప్పట్లో ప్రచారం బాగానే సాగింది. ఇక ఆ మధ్య స్కంధ ప్రీ రిలీజ్ ఈవెంట్లో దర్శకుడు బోయపాటి శ్రీను ప్రకటించాడు కూడా.

ఇక దర్శకుడు బోయపాటి శ్రీను చివరి చిత్రం స్కంధ. భారీ అంచనాలతో రిలీజ్ అవ్వగా.. బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది. ఇక ఆయన ఇప్పుడు నెక్ట్స్ ఫోకస్ అఖండ 2 మీద పెట్టినట్లు తెలుస్తోంది. ఇప్పటికే స్క్రిప్టు వర్క్ కూడా పూర్తి అయిందని టాలీవుడ్ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. అఖండ సూపర్ హిట్టుగా నిలివడంతో.. అఖండ 2పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ సీక్వెల్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది... ఎప్పుడు విడుదల అవుతుంది... లాంటి విషయాల పై బాలయ్య అభిమానులు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.
ఇక అఖండ 2 స్క్రీప్టు కంప్లీ కాడవంతో... ఈ ఏడాది జూన్ నుంచి ఈ సినిమా స్టార్ట్ కాబోతుందని టాలీవుడ్ వర్గాల సమాచారం. అయితే అఖండ 2 గురించి ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది. ఈ సినిమాలో బాలయ్యకు సరిపడా ఉజ్జిని దించుతున్నారట మేకర్స్. ఈ సినిమాలో విలన్ గా అధిరా నటించబోతున్నాడు. అదేనండి కేజీఎఫ్ విలన్ అధిరా... బాలయ్యను ఢీ కొట్టేందుకు రెడీ అవుతున్నాడు.

అఖండ 2 లో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ కూడా ఓ కీలక పాత్రలో నటించబోతునట్లు సమాచారం. అందుకే, 'అఖండ 2' సినిమా పై నార్త్ లో కూడా బజ్ ఉంటుందని తెలుస్తోంది. ఇక ఈ కథలో సోషియో ఫాంటసీ ఎలిమెంట్స్ ఉంటాయని సమాచారం. మెయిన్ కథాంశమే చాలా కొత్తగా ఉంటుందని టాక్ వినిపిస్తుంది. బాలయ్య నుంచి మరో వినూత్న సినిమా రాబోతుందని చెబుతున్నారు మేకర్స్. అలాగే, బోయపాటి మార్క్ యాక్షన్ సీన్స్ అండ్ పొలిటికల్ పంచ్ లు మాత్రం సినిమాలో ఫుల్ గా ఉంటాయని టాక్.
అయితే సంజయ్ దత్ ఇప్పటికే లియో చిత్రంలో కూడా మెరిసాఢు. ఇప్పుడు బాలయ్య దెబ్బను ఈ విలన్ తట్టుకుంటాడా అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇక ప్రస్తుతం బాలయ్య.. డైరెక్టర్ బాబీ తో ఓ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో కూడా బాలీవుడ్ నటుడే విలన్ గా నటిస్తున్నాడు. యానిమల్ విలన్ బాబీ డియోల్ ఇందులో కూడా విలన్ గా నటిస్తున్నారట.


Click it and Unblock the Notifications











