బాలయ్య కోసం ఆమెకు కబురు.. భలే సెట్ చేశారే! ఇంట్రెస్టింగ్ అప్‌డేట్
సీనియర్ హీరో, నందమూరి నటసింహం బాలకృష్ణ సినిమా జర్నీ సక్సెస్‌ఫుల్‌గా సాగుతోంది. దశాబ్దాల కాలంగా తెలుగు సినీ పరిశ్రమను ఉర్రూతలూగిస్తున్న బాలయ్య బాబు.. ప్రస్తుతం తన 105 సినిమా రూలర్ షూటింగ్‌లో పాల్గొంటున్నారు. అతిత్వరలో ఈ సినిమా షూటింగ్ పూర్తికానుంది.
రూలర్ సినిమా పూర్తికాగానే బాలకృష్ణ తన తదుపరి సినిమాను బోయపాటి శ్రీను దర్శకత్వంలో చేయనున్నాడని గత కొంతకాలంగా వార్తలు షికారు చేస్తున్నాయి. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికర అప్‌డేట్ బయటకు వచ్చింది. ఈ అప్‌డేట్ చూసి నందమూరి ఫ్యాన్స్ ఖుషీ ఖుషీ అవుతున్నారు. ఇంతకీ అసలు విషయం ఏమిటంటారా? అదేనండీ బాలకృష్ణ సరసన నటించబోయే హీరోయిన్ ఎవరనేది తెలిసింది.

బాలకృష్ణ- బోయపాటి క్రేజీ కాంబోలో రాబోతున్న ఈ సినిమాలో బాలయ్య సరసన శ్రద్ద శ్రీనాథ్‌ని తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నారట. ఇటీవలే జెర్సీ సినిమాలో నాని సరసన నటించి తెలుగు ప్రేక్షకుల మన్ననలు పొందిన ఈ భామనే బాలయ్యకు సరైన జోడీ బి భావిస్తున్నారట. ఈ మేరకు ఆమెతో సంప్రదింపులకు ప్లాన్ చేస్తున్నారని సమాచారం. ఒకవేళ శ్రద్ద ఒప్పుకుందంటే బాలకృష్ణతో ఆమె సందడి మామూలుగా ఉండదని తెలుస్తోంది.
హీరోతో పాటు హీరోయిన్‌కి సమాన ప్రాధానత్య ఉండేలా బోయపాటి ఈ సినిమా స్క్రిప్ట్ రెడీ చేస్తున్నారట. బాగా వెయిటేజ్ ఉన్న పాత్ర కాబట్టి శ్రద్ద శ్రీనాథ్ బాగా సూట్ అవుతుందని ఫైనల్ అయ్యారట. ఎమోషనల్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమా రూపొందనుందని అంటున్నారు. ఇక బాలకృష్ణ తాజా సినిమా 'రూలర్' డిసెంబర్ 20 వ తేదీన విడుదలకు ముస్తాబవుతోంది. ఈ సినిమాపై నందమూరి అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.


Click it and Unblock the Notifications











