బోయపాటి భలే స్కెచ్ వేశాడే! బాలకృష్ణ అభిమానులను సర్‌ప్రైజ్ చేస్తూ.. షాకింగ్ డిసీజన్
బోయపాటి శ్రీను సినిమాలంటేనే మాస్ ఆడియన్స్‌లో అదో కిక్కు. ఆయన కెమెరా ఆన్ చేశారంటే చాలు సంచలనాలే. అందుకే మాస్ ఆడియన్స్ పల్స్ తెలిసిన టాలీవుడ్ డైరెక్టర్‌గా ఫేమస్ అయ్యారాయన. ఇక ఆయనతో నందమూరి బాలకృష్ణ సినిమా అంటే ఆ హంగామా ఊహించగలమా చెప్పండి. ప్రస్తుతం అందుకు తగిన ఏర్పాట్లన్నీ చక చకా జరుగుతున్నాయి. తాజాగా బోయపాటి- బాలకృష్ణ సినిమాకు సంబంధించిన కీలక అప్‌డేట్ బయటకొచ్చింది. ఆ వివరాలేంటో చూద్దామా..

కేఎస్ రవికుమార్‌తో బాలయ్య బిజీ.. ఆ వెంటనే
ఓ వైపు రాజకీయాలతో మరోవైపు సినిమాలతో బిజీగా ఉంటున్న బాలకృష్ణ ప్రస్తుతం కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇది పూర్తికాగానే బోయపాటి శ్రీను దర్శకత్వంలో మరో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నారు బాలయ్య బాబు.

బోయపాటి ప్లాన్స్.. బాలయ్య సై
ఈ సినిమా కోసం బోయపాటి శ్రీను సరికొత్తగా ఆలోచిస్తున్నారని తెలుస్తోంది. ఈ సారి మాస్ ఆడియన్స్‌తో పాటు క్లాస్ ఆడియన్స్‌ని కూడా బుట్టలో వేసుకునేలా స్క్రిప్ట్ రెడీ చేస్తున్నారట ఆయన. ఈ మేరకు బాలయ్య బాబును 25 కిలోల బరువు తగ్గమని కూడా బోయపాటి సలహా ఇచ్చినట్లుగా సమాచారం. ఇందుకు బాలయ్య కూడా సై అన్నారని తెలుస్తోంది.

బోయపాటి సెన్సేషనల్ డిసీజన్
ఇదిలా ఉండగానే తన సినిమాకు మరింత హైప్ క్రియేట్ అయ్యేలా ఓ సెన్సేషనల్ డిసీజన్ తీసుకున్నారట బోయపాటి. ఈ సినిమాలో విలన్‌గా బాలీవుడ్ హీరోని తీసుకోవాలని స్కెచ్ వేశారట. ఈ మేరకు బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్‌ను సంప్రదించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారట బోయపాటి.

ఆయన ఓకే చెప్పాలే గానీ.. కన్నుల పండగే
సంజయ్ దత్ ఓకే చెప్పాలే గానీ ఆ పాత్రను మరింత పవర్‌ఫుల్‌గా డిజైన్ చేయనున్నారట బోయపాటి శ్రీను. తనదైన స్టైల్ పంచులతో సంజయ్ దత్, నందమూరి బాలకృష్ణలతో ఫైట్స్ రూపొందించి బాలకృష్ణ అభిమానులను సర్‌ప్రైజ్ చేయాలనేది బోయపాటి ఫైనల్ స్కెచ్ అని టాక్ నడుస్తోంది. ఇదే నిజమైతే బాలయ్య అభిమానులకు కన్నుల పండగే మరి.

బాలయ్య రొమాన్స్.. నందమూరి అభిమానుల్లో అదో కిక్కు
ఇప్పటికే బాలయ్య, బోయపాటి కాంబినేషన్‌లో వచ్చిన ‘సింహా, ‘లెజెండ్' సినిమాలు ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. దీంతో బాలయ్య, బోయపాటి హ్యాట్రిక్ హిట్ చూడాలని కుతూహలంగా ఉన్నారు నందమూరి ఫ్యాన్స్. ఇక ఈ చిత్రంలో బాలయ్య సరసన శ్రద్ద శ్రీనాథ్ పేరును పరిశీలనలో పెట్టడం మరో ఆసక్తికర అంశం.


Click it and Unblock the Notifications











