Just In
Don't Miss!
- News
శివమొగ్గలో భారీ పేలుడు: 15 మంది మృతి?, భూమి కంపించడంతో భయంతో జనం పరుగులు
- Finance
తగ్గిన బంగారం ధర, పెరిగిన వెండి ధర: రూ.50,000 దిగువనే బంగారం
- Sports
సొంతగడ్డపై భారత్‌ను ఓడించడం కష్టమే: జోరూట్
- Automobiles
ఉత్పత్తిలో '100 మిలియన్' రికార్డ్ కైవసం : హీరోమోటోకార్ప్
- Lifestyle
Happy Republic Day 2021 :మనందరికీ ప్రేరణనిచ్చే ఈ మెసెజెస్ తో ‘రిపబ్లిక్ డే’ విషెస్ చెప్పండిలా...
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
నందమూరి అభిమానులకు గుడ్‌న్యూస్: ఇక అతన్ని రంగంలోకి దించనున్న బాలకృష్ణ!
అలవోకగా 100 సినిమాలు పూర్తిచేసి మంచి ఫామ్‌లో ఉన్నారు నందమూరి నటసింహం బాలకృష్ణ. రెండు తరాల ప్రేక్షకులను ఆకట్టుకుంటూ అశేష అభిమాన వర్గాన్ని కూడగట్టుకున్న ఆయన ఎన్నో హిట్ సినిమాలు తన ఖాతాలో వేసుకున్నారు. ఎందరో దర్శకులతో హిట్ పెయిర్ అనిపించుకున్నారు. అందులో ముఖ్యమైన దర్శకుడు బీ. గోపాల్. ఈ దర్శకుడి సినిమాలు వచ్చి చాలా రోజులయింది. దీంతో మరోసారి అతన్ని రంగంలోకి దించే ప్రయత్నం చేస్తున్నారట బాలకృష్ణ.

తేలిపోయిన రూలర్.. ఇక ఇప్పుడు
ఇటీవలే బాలకృష్ణ రూలర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఈ సినిమా అనుకున్న స్థాయిలో అలరించలేకపోయింది. దీంతో ఇప్పుడు ఆ లోటును పూడ్చేలా బోయపాటి సెట్స్ పైకి చేరుతున్నారు బాలయ్యబాబు. ఈ ఇద్దరిదీ హిట్ కాంబినేషన్ కావడంతో బాలయ్య- బోయపాటి మూవీపై ఆశలు పెట్టుకున్నారు నందమూరి అభిమానులు.

బీ. గోపాల్ చేతిలో.. బాలయ్య బాబు స్కెచ్
ఇదిలా ఉండగానే ఈ మధ్యనే మరో కథ విన్నారట బాలకృష్ణ. పవర్‌ఫుల్ మాస్ ఓరియెంటెడ్ మూవీగా ఈ కథను రూపొందించవచ్చు అని ఫిక్స్ అయ్యారట. ఈ మేరకు ఆ బాధ్యతలను డైరెక్టర్ బీ. గోపాల్ చేతిలో పెట్టాలని ఆయన ప్లాన్ చేస్తున్నట్లు టాక్ నడుస్తోంది. బోయపాటి సినిమా ఫినిష్ కాగానే.. తనకు బ్లాక్ బస్టర్స్ అందించిన ఈ దర్శకుడితో సినిమా చేయాలని బాలయ్య స్కెచ్ వేస్తున్నారట.

గ్రేట్ కాంబో.. ఇండస్ట్రీ ఎవర్‌గ్రీన్ హిట్స్
గతంలో బాలకృష్ణ హీరోగా బీ. గోపాల్ రూపొందించిన సినిమాలు ఇండస్ట్రీ ఎవర్ గ్రీన్ హిట్స్‌గా నిలిచాయి. అందులో ''లారీ డ్రైవర్, రౌడీ ఇన్‌స్పెక్టర్, సమర సింహారెడ్డి, నరసింహా నాయుడు'' సినిమాలు ముఖ్యమైనవి. ఈ సినిమాల్లో మాస్ ఆడియన్స్‌కి కావాల్సిన అన్ని అంశాలకు తనదైన రీతిలో తెరరూపమిచ్చారు డైరెక్టర్ బీ. గోపాల్.

చివరగా బాలకృష్ణ- బీ. గోపాల్ కాంబో
ఇక చివరగా బాలకృష్ణ- బీ. గోపాల్ కాంబోలో ‘పల్నాటి బ్రహ్మనాయుడు' సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చింది. కానీ ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర ఘోర పరాజయం పాలైంది. ఆ వెంటనే ఈ ఇద్దరి కాంబోలో ‘హర హర మహదేవ' సినిమాకు కొబ్బరికాయ కొట్టినా.. ఆ తర్వాత కథ సెట్ కాకపోవడంతో అర్దాంతరంగా ఆగిపోయింది.

మళ్ళీ ఇన్నేళ్లకు.. బాలయ్య ఫ్యాన్స్ ఆశ
తాజాగా బాలయ్య చెవిలో పడిన కథను బీ. గోపాల్ చేతిలో పెట్టేయబోతున్నాడు అనే వార్త నందమూరి అభిమానుల్లో జోష్ నింపుతోంది. సరైన హిట్ పడక సతమతమవుతున్న ఈ టైమ్‌లో బాలకృష్ణకు బీ. గోపాల్ రూపంలో అదృష్టం కలిసొస్తుందని ఆశ పడుతున్నారు బాలయ్య ఫ్యాన్స్.