Balakrishna మల్టీస్టారర్​కు బాలయ్య జై... ప్రభాస్​తో కలిసి స్క్రీన్ షేర్!

నందమూరి నటసింహం బాలకృష్ణ స్క్రీన్ మీద కనిపిస్తే చాలు.. జనం ఊగిపోతారు. ఫ్యాన్స్ చొక్కాలు చింపుకుంటారు. జై బాలయ్య అంటూ నినాదాలు చేస్తుంటారు. అయితే బాలయ్య అభిమానులకు కిక్కిచ్చే ఓ న్యూస్ బయటకు వచ్చింది. ఓ భారీ మల్టీస్టారర్ మూవీలో కీలక పాత్రలో బాలయ్య నటించనున్నారని తెలుస్తోంది. అది కూడా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో స్క్రీన్ పంచుకోనున్నారని సమాచారం. అసలు బాలయ్య ఏ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.. ఎలాంటి పాత్రలో నటిస్తున్నారు అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.

వరుస సినిమాలతో బిజీగా...:బాలకృష్ణ ప్రస్తుతం వరుస సినిమాలతో జోష్ మీదున్న సంగతి తెలిసిందే. గత ఏడాది వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి సినిమాలతో సక్సెస్ కొట్టాడు. అంతకు ముందు అఖండతో భారీ విజయం సాధించాడు. అలా బాలకృష్ణ వరుసగా మూడు సినిమాలు బాక్సాఫీస్ వద్ద హిట్ కొట్టి హ్యాట్రిక్ హిట్ సాధించాడు. ఇక ఈ సినిమాల తర్వాత బాబీ దర్శకత్వంలో తన 109వ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. వరుస షూటింగ్ షెడ్యూల్స్ బిజీగా ఉన్నాడు బాలయ్య.

Nandamuri Balakrishna Crucial Role in Manchu Manoj Kannappa Full Details Here

ప్రభాస్ తో స్క్రీన్ షేర్... :ఇదిలా ఉంటే.. బాలయ్య ఓ బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ సినిమాలో నటిస్తున్నట్లు టాక్ వినిపిస్తుంది. అదేదో కాదు... మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్టు కన్నప్పు. ఈ సినిమాలో మంచు విష్ణు టైటిల్‌ రోల్‌ పోషిస్తున్న సంగతి తెలిసిందే. మహాకవి ధూర్జటి రాసిన శ్రీకాళహస్తీశ్వర శతకంలోని భక్త కన్నప్ప చరిత్రను స్ఫూర్తిగా తీసుకుని సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో ఇప్పటికే మోహన్‌లాల్‌, మోహన్‌బాబు, ప్రభాస్‌, శివరాజ్ కుమార్ తదితరులు నటిస్తున్నారని ప్రకటించారు.

బాలయ్య చేరితే మరింత హైప్...:అయితే ఈ బిగ్గెస్ట్ ప్రాజెక్టులోకి బాలయ్య రానున్నారని తెలుస్తోంది. ఈ చిత్రంలో ఓ క్రూషియల్ పాత్రకు బాలయ్యను సంప్రదించారట మేకర్స్. మరి ఈ పాత్రకు బాలయ్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చారో లేదో క్లారిటీ లేదు కానీ... అభిమానులు మాత్రం బాలయ్య చేస్తే బాగుండని అంటున్నారు. ఎందుకంటే ఇప్పటికే ఈ ప్రాజెక్టులో బిగ్ స్టార్ ఉన్నారు. అందులో బాలయ్య కూడా చేరితే.. ఈ సినిమాకు మరింత హైప్ ఖాయం.

Nandamuri Balakrishna Crucial Role in Manchu Manoj Kannappa Full Details Here

నయన్ ప్లేస్ లోకి కంగనా..:శివపార్వతుల్లో ప్రభాస్, నయనతార పేర్లు మొదట వినిపించాయి. అయితే నయనతార డేట్స్ అందుబాటులో లేకపోవడంతో.. ఆ పాత్ర కోసం బాలీవుడ్ బ్యూటీ కంగన రనౌత్ ను సంప్రదించారట మేకర్స్. దానికి కంగనా కూడా యస్ చెప్పిందని అంటున్నారు. ఇక ఈ విషయాన్ని మేకర్స్ త్వరలో అధికారికంగా ప్రకటించనున్నారు. ఇక ఇప్పుడు ఈ వందకోట్ల క్రేజీ ప్రాజెక్టులోకి బాలయ్య చేరడం ఈ సినిమాపై మరింత ఆసక్తి నెలకోల్పింది.

అవ్రామ్ ఎంట్రీ...:ఇక కన్నప్ప చిత్రం విషయానికి వస్తే.. ఈ సినిమాలో మంచు విష్ణు కొడుకు అవ్రామ్ కూడా నటించనున్నారని ప్రకటించారు. ఈ సినిమాతో అవ్రామ్ సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టనున్నారు. కన్నప్ప చిత్రాన్ని ఏవీఏ ఎంటర్టైన్మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ సంస్థలు 100 కోట్ల రూపాయలతో భారీ స్థాయిలో నిర్మిస్తున్నాయి. ఈ ఏడాది చివరలో ఈ సినిమా రిలీజ్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X