బాలకృష్ణ కూతురు టాలీవుడ్ ఎంట్రీ.. మోక్షజ్ఞ‌ సినీ ప్రవేశంతోపాటు ఫ్యాన్స్‌కు డబుల్ ధమాకా!

తెలుగు చిత్ర పరిశ్రమలో అందరూ హీరోలు, దర్శకులు, నిర్మాతలు, ఇతర టెక్నీషియన్స్ తమ కొడుకులు, కూతుళ్లు, అల్లుళ్లను ఇండస్ట్రీలోకి తీసుకొస్తున్నారు. వీరిలో కొందరు నిలదొక్కుకుని టాలీవుడ్‌లో తమకంటూ కొన్ని పేజీలు ఉంచుకున్నారు. దశాబ్ధాలుగా చిత్ర పరిశ్రమకు నాలుగు స్తంభాలుగా ఉన్న చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్‌లలో చిరంజీవి కుటుంబం నుంచి దాదాపు డజను మంది హీరోలు ఉన్నారు. తన కుమారుడు రామ్ చరణ్‌ను వారసుడిగా పరిచయం చేశారు. ఆయన ఇప్పుడు గ్లోబల్ స్టార్ ఇమేజ్‌తో దూసుకెళ్తున్నారు.

నాగార్జున విషయానికి వస్తే .. తన వారసులు నాగచైతన్య, అఖిల్‌లను గ్రాండ్‌గా లాంచ్ చేశారు. వెంకటేష్ తన కుమార్తెలను ఇండస్ట్రీ వైపు రానివ్వలేదు..భవిష్యత్తులో చెప్పలేం. కానీ నటసింహం నందమూరి బాలకృష్ణే తన వారసుడు మోక్షజ్ఞ సినీరంగ ప్రవేశం గురించి ఎలాంటి క్లారిటీ ఇవ్వడం లేదు. అన్న నందమూరి తారక రామారావు వంశంలో రెండో తరంలో నటులుగా ఎంట్రీ ఇచ్చారు ఆయన తనయుడు హరికృష్ణ, బాలకృష్ణ. వీరిలో బాలయ్య అగ్ర కథానాయకుడిగా కొనసాగుతున్నారు.

nandamuri balakrishna daughter tejaswini as the producer of mokshagna debut movie

పౌరాణిక, జానపద, చారిత్రక, సాంఘిక చిత్రాల్లో తండ్రికి తగ్గ తనయుడిగా నిరూపించుకున్నారు. వారి తర్వాత నందమూరి మూడో తరంలో జూనియర్ ఎన్టీఆర్, చైతన్య కృష్ణ, తారకరత్న, కళ్యాణ్ రామ్‌లు‌ చిత్ర సీమలో అడుగుపెట్టారు. వీరిలో ఎన్టీఆర్ స్టార్ హీరోగా నందమూరి వారసత్వాన్ని నిలబెడుతున్నారు. మోక్షజ్ఞ కూడా తాత, తండ్రి, అన్నయ్యల బాటలోనే స్టార్ హీరోగా వెలుగొందాలని ఫ్యాన్స్ కోరుతున్నారు. మోక్షజ్ఞ నటనలో శిక్షణ తీసుకుంటున్నాడని, ఫలానా డైరెక్టర్‌తో కాంబినేషన్ సెట్ అయ్యిందని ఏళ్లుగా మీడియాలో ప్రచారం జరిగింది.

ఇలా ఊరించి ఊసూరుమనిపిస్తూ ఉండటంతో నందమూరి ఫ్యాన్స్ డీలా పడిపోతున్నారు. బయట పెద్దగా కనిపించకపోవడంతో మోక్షజ్ఞ పాత ఫోటోలే చక్కర్లు కొట్టేవి. కొన్నేళ్ల క్రితం మోక్షజ్ఞ తన కుటుంబంతో కలిసి ఓ ఆలయంలో పూజలు చేయించుకున్న సమయంలో తీసిన ఫోటోల్లో ఈ కుర్రాడు బాగా లావుగా కనిపించడంతో ఫ్యాన్స్ షాకయ్యారు. దీంతో కొడుకు లుక్‌ను మార్చాలని బాలయ్య గట్టిగా ఫిక్స్‌య్యారట. అందుకు తగ్గట్లుగానే పర్సనల్ ట్రైనర్లతో పాటు నటన, ఇతర విభాగాల్లో పిల్లాడిని రాటు తేల్చేందుకు టీమ్‌ను సెట్ చేశారట. ఈ ప్రయత్నాలన్నీ ఫలించి మోడ్రన్ లుక్‌లో , స్టైలిష్‌గా ఉన్న మోక్షజ్ఞ లుక్ ఒకటి ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

nandamuri balakrishna daughter tejaswini as the producer of mokshagna debut movie

అయితే మోక్షజ్ఞను హీరోగా పరిచయం చేసే పనులను బాలయ్య ఎప్పుడో మొదలుపెట్టారు. కథల ఎంపిక, దర్శకులతో సంప్రదింపులు కూడా జరుపుతున్నారు. ఈ క్రమంలో సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. హనుమాన్‌తో ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేసిన యువ దర్శకుడు ప్రశాంత్ వర్మ చేతుల మీదుగా మోక్షజ్ఞ తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం కానున్నారట. ఇందుకోసం బాలయ్య- ప్రశాంత్ వర్మ కలిసి ఓ స్టోరీని కూడా సిద్ధం చేశారట. దీనిపై అధికారిక ప్రకటన జరగాల్సి ఉంది. ప్రస్తుతం మంచిరోజులు లేకపోవడంతో అనౌన్స్‌మెంట్ ఆలస్యమవుతోందని ఫిలింనగర్ టాక్.

ఇక్కడ మరో ట్విస్ట్ ఏంటంటే.. బాలకృష్ణ రెండో కుమార్తె తేజస్విని కూడా టాలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వనున్నారట. అయితే నటిగా కాదు.. నిర్మాతగా. ఆమెకు తొలి నుంచి చిత్ర పరిశ్రమ పట్ల ఆసక్తి ఉంది. అన్‌స్టాపబుల్ , ఇతర షోల విషయంలో తేజస్విని తన తండ్రికి చేదోడు వాదోడుగా నిలిచారు. ఈ క్రమంలోనే తమ్ముడిని లాంచ్ చేసే బాధ్యతను తేజస్వినికే అప్పగించారట బాలకృష్ణ. మరి ఈ వార్తల్లో ఎంత మేరకు నిజముందో తెలియాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే. మోక్షజ్ఞ ఎంట్రీపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ జరిగే వరకు నందమూరి ఫ్యాన్స్‌కు నిరాశ తప్పదు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X