Nandamuri Balakrishna: టాలీవుడ్‌లోకి బాలకృష్ణ చిన్న కూతురు.. మోక్షజ్ఞ కంటే ముందుగానే ఎంట్రీ
నందమూరి బాలకృష్ణ ఒకవైపు సినిమాలు చేసుకుంటూనే మరొకవైపు ఓటీటీ ప్లాట్ ఫామ్ లో అన్ స్టాపబుల్ టాక్ షోను కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. అయితే చాలా కాలంగా బాలకృష్ణ వారసుడు మోక్షజ్ఞ టాలీవుడ్ ఎంట్రీ కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అయితే ఇంతవరకు ఆ విషయంపై పెద్దగా క్లారిటీ అయితే ఇచ్చింది లేదు. ఇక ఇప్పుడు బాలకృష్ణ చిన్న కూతురు టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టబోతున్నట్లు సమాచారం. ఆమె ఒక సరికొత్త బాధ్యత కూడా తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే...

సినిమాలతో బిజీగా
నందమూరి బాలకృష్ణ చివరగా అఖండ సినిమాతో బాక్సాఫీస్ వద్ద సరికొత్త సెన్సేషన్ క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. ఆ సినిమా బాలయ్య బాబు కెరీర్ లోనే అత్యధిక కలెక్షన్స్ అందుకున్న సినిమాగా నిలిచింది. ఇక ఇప్పుడు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తన 107వ సినిమాలు పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నాడు. అలాగే అనిల్ రావిపూడి దర్శకత్వంలో కూడా మరొక సినిమాను పూర్తి చేయబోతున్నాడు.

సెకండ్ సీజన్ స్టార్ట్
ఇక వరుసగా సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ కూడా బాలయ్య బాబు సరికొత్తగా మొదలుపెట్టిన టాక్ షో అన్ స్టాపబుల్ గ్రాండ్ గా కొనసాగుతోంది. మొదటి సీజన్ తర్వాత చాలా వేగంగా సెకండ్ సీజన్ స్టార్ట్ చేసిన బాలయ్య బాబు ఈసారి మరింత ఎనర్జీతో ఆకట్టుకుబోతున్నారు. మొదటి ఎపిసోడ్లో ఆయన బావగారు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రత్యేక అతిథిగా వచ్చిన విషయం తెలిసిందే.

అన్‌స్టాపబుల్ వెనుక కూతురు
అయితే రీసెంట్ గా అన్ స్టాపబుల్ షో గురించి మరొక ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. బాలకృష్ణ చిన్న కూతురు తేజస్విని అన్‌స్టాపబుల్ షోకి క్రియేటివ్ కన్సల్టెంట్ గా పనిచేస్తున్నారట. బాలకృష్ణ డేట్స్ అలాగే వర్క్ కి సంబంధించిన కార్యకలాపాలను ఆమె వ్యక్తిగతంగా చూసుకుంటుందట. అతని తండ్రి ఇమేజ్‌ను పెంచడానికి కీలకమైన నిర్ణయాలు తీసుకుంటున్నట్లు టాక్.

త్వరలోనే కొత్త బాధ్యత
అయితే బాలయ్య కూతురు తేజస్విని కేవలం ఆ టాక్ షో వరకే పరిమితం కాకుండా త్వరలోనే కొత్త బాధ్యతలను తీసుకుబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే బాలయ్య కు సంబంధించిన ప్రతి స్క్రిప్ట్ విషయంలో కూడా ఆమె చర్చలు జరుపుతోందట. ఇక త్వరలోనే నిర్మాతగా కూడా ఆమె కెరీర్ ను స్టార్ట్ చేయబోతున్నట్లుగా తెలుస్తోంది.

బాలయ్యతో సినిమాలు
ఒక విధంగా బాలయ్య బాబు కుమారుడు మోక్షజ్ఞ తేజ త్వరలోనే హీరోగా ఎంట్రీ ఇస్తాడు అని టాక్ అయితే వచ్చింది. కానీ ఇప్పుడు అతని కంటే ముందే కూతురు టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఒక నిర్మాతగా తన ప్రయాణాన్ని మొదలు పెట్టబోతున్నట్లు సమాచారం. ఆమె ప్రత్యేకంగా బాలయ్య బాబుతో కూడా కొన్ని సినిమాలు నిర్మించనుందట. ఇదివరకే బాలకృష్ణ ఎన్.బి.కె ఫిలిమ్స్ బ్యానర్లో పలు సినిమాలను నిర్మించిన విషయం తెలిసిందే. మరి ఆయన కూతురు తేజస్విని ఎలాంటి సినిమాలను నిర్మిస్తారో చూడాలి.


Click it and Unblock the Notifications











