కొత్త సినిమాకు బాలయ్య డైరెక్షన్.. కోట్ల రూపాయలతో షూట్ చేసిన సీన్లు తీసేసి!
ఆరు పదుల వయసు వచ్చినా ఏమాత్రం అలసిపోకుండా సినిమాలు మీద సినిమాలు చేసుకుంటూ వెళ్లే హీరోలు అతి తక్కువ మంది మాత్రమే ఉన్నారు. అలాంటి వారిలో టాలీవుడ్‌లోనే నలుగురైదుగురు ఉన్నారు. అందులో నందమూరి బాలకృష్ణ ఒకరు. గతంలో కంటే ఇప్పుడు యమా హిట్లు కొడుతూ ఫుల్ ఫామ్‌లో ఉన్న ఆయన వరుసగా ప్రాజెక్టులను పట్టాలెక్కిస్తున్నారు.
సీనియర్ స్టార్ హీరో నటసింహా నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం బాబీ అలియాస్ కేఎస్ రవీంద్ర దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నారు. ఇది 1980 దశకంతో పాటు ప్రస్తుతానికి సంబంధించిన స్టోరీతో తెరకెక్కుతోంది. యాక్షన్ అండ్ ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కుతోంది. దీంతో ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్లే దీన్ని రూపొందిస్తున్నారు.

బాలయ్య రేంజ్‌కు తగ్గ స్టోరీలైన్‌తో రాబోతున్న ఈ సినిమాకు సంబంధించిన రెగ్యూలర్ షూటింగ్‌ను చాలా రోజుల క్రితమే ప్రారంభించేశారు. ఇందులో యాక్షన్ సీక్వెన్స్‌తో పాటు మామూలు సన్నివేశాలను షూట్ చేశారు. ఆ తర్వాత మూవీ యూనిట్ రాజస్థాన్, వైజాగ్, హైదరాబాద్‌తో పాటు చాలా ప్రాంతాలకు వెళ్లి మరీ ఇప్పటికే 80 శాతం టాకీ పార్టును కంప్లీట్ చేసుకుంది.
హై ఓల్టేజ్ యాక్షన్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ వేగంగా జరుగుతుండడంతో దీన్ని వీలైనంత త్వరగానే ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది. కానీ, ఈ సినిమా రిలీజ్‌పై ఎలాంటి క్లారిటీ రావడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ చిత్రం రీషూట్ జరుపుకుంటుందని తాజాగా ఓ వార్త బయటకు వచ్చింది.

ఫిలిం నగర్ ఏరియాలో వైరల్ అవుతోన్న సమాచారం ప్రకారం.. బాబీ తెరకెక్కిస్తోన్న ఈ సినిమాకు సంబంధించి కొన్ని సీన్స్, యాక్షన్ సీక్వెన్స్‌లను రీషూట్ చేయాలని బాలయ్య సూచించినట్లు తెలిసింది. దీంతో చిత్ర యూనిట్ మళ్లీ షూటింగ్‌కు ప్లాన్ చేసిందట. వీటికి బాలయ్య స్వయంగా దర్శకత్వం వహిస్తున్నారని తెలిసింది. దీంతో ఇప్పుడీ న్యూస్ హాట్ టాపిక్‌గా మారిపోయింది.
ఇదిలా ఉండగా.. బాలయ్య - బాబీ కాంబినేషన్‌లో రాబోతున్న ఈ సినిమాను సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడియోస్ బ్యానర్లపై సాయి సౌజన్య, నాగ వంశీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇందులో బాబీ డియోల్, ఊర్వశీ రౌటేలా నటిస్తున్నారు. ఈ మూవీకి థమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు.


Click it and Unblock the Notifications











