'భగవంత్ కేసరి' కోసం బాలయ్య భారీ రిస్క్.. తెలిస్తే మైండ్ బ్లాకే.. ఈసారి ఏకంగా!
నందమూరి నటసింహం బాలకృష్ణ.. ఈ పేరు ఓ స్లోగన్. అది వింటేనే అటు అభిమానుల్లో ఇటు సినీ ప్రియుల్లో ఊపు ఉప్పొంగివస్తుంది. ఆరు పదుల వయసులోనూ మూడు పదుల ఉత్సాహంతో ఉరకలేస్తూ అన్ స్టాపబుల్ గా కెరీర్ లో దూసుకెళ్తున్నారు. అయితే ప్రస్తుతం ఆయన నటిస్తున్న 'భగవంత్ కేసరి' సినిమా కోసం ఎవరూ ఉహించని రేంజ్ లో ఓ రిస్క్ చేయబోతున్నారట. వివరాళ్లోకి వెళితే...
బాలయ్య.. సినిమాలు, రాజకీయాలు, సామాజిక సేవా కార్యక్రమాలు, క్యాన్సర్ హాస్పిటల్ వ్యవహారాలు, ఓటీటీ టాక్ షో, అడ్వటైజ్ మెంట్స్.. ఇలా కెరీర్ లో ఫుల్ బిజీ బిజీగా ఉంటున్నారన్న సంగతి తెలిసిందే. 60ఏళ్ల వయసులోనూ ఎంతో ఉత్సాహంగా పనిచేస్తున్నారు. ప్రస్తుతం ఆయన క్రేజ్ భారీ స్థాయిలో పెరిగిపోయింది. దీంతో అభిమానులను ఉర్రూతలూగించేందుకు ఆయన ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నారు.

సినిమాల విషయానికొస్తే: 'అఖండ', 'వీరసింహారెడ్డి'తో బ్యాక్ టు బ్యాక్ సూపర్ హిట్లను అందుకున్నారు బాలయ్య. ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో 'భగవంత్ కేసరి' అనే ఫన్ అండ్ యాక్షన్ సినిమాలో నటిస్తున్నారు. I Don't Care ట్యాగ్ లైన్ తో దీన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో బాలయ్య సరసన తొలిసారి కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. టాలీవుడ్ యంగ్ సెన్సేషన్ శ్రీలీల.. మరో కీలక పాత్రలో కనిపించనుంది. బాలీవుడ్ స్టార్ యాక్టర్ అర్జున్ రాంపాల్ ప్రతినాయకుడిగా చేస్తున్నారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహూ గారపాటి - హరీష్ పెద్ది చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

బాలయ్య విశ్వరూపం: రీసెంట్ గా బాలయ్య పుట్టినరోజు సందర్భంగా.. విడుదల చేసిన టీజర్ సినిమాపై భారీ అంచనాలను పెంచింది. ఇందులో బాలయ్య.. తెలంగాణ యాసలో డైలాగ్స్ చెబుతూ ఆకట్టుకున్నారు. అలాగే తన మార్క్ సీరియస్ యాక్షన్‌తో పాటు చివర్లో కాస్త కామెడీని కూడా పండించారు.
"రాజు ఆని ఎనకున్న వందల మంది మందను చూయిస్తడు. మొండోడు ఆనికున్న ఒకే ఒక్క గుండెను చూయిస్తడు అంటూ పవర్ ఫుల్ డైలాగ్ తో బాలయ్య విశ్వరూపాన్ని చూపించారు. అడవి బిడ్డ.. నేలకొండ భగవంత్ కేసరి. ఈపేరు శానా యేండ్లు యాదుంటది" అంటూ అభిమానులకు గూస్ బంప్స్ తెప్పించారు.

ఏకంగా ఫ్లోర్ స్టెప్: తాజాగా అందిన సమాచారం ప్రకారం ఈ సినిమాలో పాటలకు తక్కువ స్కోప్ ఉంటుందని తెలిసింది. అందుకని ఆ తక్కువ సాంగ్స్ నే భారీగా డిజైన్ చేస్తున్నారని సమాచారం అందింది. బాలయ్యకు అదిరిపోయే స్టెప్పులు పెట్టారట. ఇప్పటికే ఆయన 'లెజెండ్', 'అఖండ', 'వీర సింహా రెడ్డి' చిత్రాల్లోని పాటల్లో తన స్టెప్పులతో ఓ ఊపు ఉపేశారు.
ఇప్పుడు 'భగవంత్ కేసరి'లోనూ ఓ పాటలో బాలయ్య కళ్లు చెదిరే డ్యాన్స్ లు వేయనున్నారట. ఏకంగా ఫ్లోర్ స్టెప్ వేయబోతున్నారని అంటున్నారు. పది రోజుల పాటు ప్రాక్టీస్ చేయడం కూడా జరిగిందని తెలిసింది. ఇక ఇది తెలిసిన అభిమానులు తెగ సంతోషపడిపోతున్నారు. మరికొంతమంది అభిమానుల కోసం బాలయ్య అరవై ఏళ్ల వయసులోనూ పెద్ద రిస్కే చేయబోతున్నారని అంటున్నారు.

సరికొత్త కథతో: ఈ సినిమా తర్వాత బాలయ్య.. బాబీ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. అనిల్ రావిపూడి సినిమా పూర్తవ్వగానే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్తుంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి ఓ కాన్సెప్ట్‌పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఇందులో ఇనుప పెట్టెలో కత్తులు, గొడ్డలి, సుత్తి, సిగరెట్ పెట్టె, మందు బాటిల్, తుపాకీ గుళ్లు వంటి కనిపించడం ఆసక్తికరంగా మారింది. అలాగే పోస్టర్‌పై 1982 అని కూడా రాసి ఉండటం మరింత ఉత్కంఠకు దారి తీసింది. దీన్ని చూస్తుంటే.. సినిమా ఓ సరికొత్త కథతో రాబోతుందని అర్థమవుతోంది.


Click it and Unblock the Notifications











