NBK 107: బాలకృష్ణ సినిమాకు అదిరిపోయే టైటిల్ సెట్ చేసిన మాస్ దర్శకుడు.. ఆ పాత్రకు తగ్గట్టుగా..

నందమూరి బాలకృష్ణ తో పవర్ఫుల్ మాస్ సినిమాలు తెరపైకి తీసుకు వస్తే ఎలా ఉంటుందో అఖండ సినిమాతో మరోసారి రుజువైంది. దర్శకుడు బోయపాటి శ్రీను బాలకృష్ణ తో మూడో సారి చేసిన అఖండ సినిమా ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో విజయాన్ని అందుకుని తెలుగు చిత్ర పరిశ్రమకు కూడా ఒక మంచి గుర్తింపు అందించింది. ఆ సినిమా బాలయ్య కెరీర్ లోనే అత్యధిక వసూళ్లను అందుకున్న సినిమాగా కూడా రికార్డును క్రియేట్ చేయడం విశేషం. ఇక బాలకృష్ణ ప్రస్తుతం మరో మాస్ దర్శకుడితో మరొక పవర్ఫుల్ సినిమాను చేస్తున్న విషయం తెలిసిందే. కమర్షియల్ మాస్ ఎలిమెంట్స్ తో పర్ఫెక్ట్ సినిమాను చేయగల దర్శకుడు గోపీచంద్ మలినేని కూడా ఒకరు.

Recommended Video

NBK107 : Nandamuri Balakrishna's Next Grand Launch | Filmibeat Telugu

రవితేజ తో క్రాక్ సినిమాను తెరకెక్కించిన గోపీచంద్ మలినేని ఎలాంటి విజయాన్ని సొంతం చేసుకున్నాడో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక ఆ సినిమా బాక్సాఫీసు వద్ద నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది. అంతేకాకుండా రవితేజ వరుస అపజయాల అనంతరం ఆ సినిమాతోనే మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవ్వడం విశేషం. ఇక డైరెక్టర్ గోపీచంద్ మలినేని స్థాయి కూడా ఒక్కసారిగా ఆ సినిమాతోనే పెరిగిపోయింది. దీంతో ఎప్పటినుంచో బాలకృష్ణ తో సినిమా చేయాలనే అతని కోరిక కూడా ఆ సినిమాతోనే నెరవేరేలా జరిగింది.

nandamuri balakrishna gopichand malineni movie title fix

నందమూరి బాలకృష్ణ క్రాక్ సినిమా చూడగానే డైరెక్టర్ గోపీచంద్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. ఇక బాలకృష్ణ ఇమేజ్ కు తగ్గట్టుగా మాస్ యాక్షన్ ఎలిమెంట్స్ సమపాళ్లలో ఉండే విధంగా దర్శకుడు కథను రెడీ చేసుకున్నాడు. దాదాపు ఆరు నెలల కష్టపడే కొన్ని నిజ జీవితంలోని సంఘటనల ఆధారంగా బాలకృష్ణ సినిమాకు స్టోరీ రెడీ చేసినట్లు దర్శకుడు క్లారిటీ అయితే వచ్చాడు. అందుకోసం అతను అనంతపురం ఏరియాలలో రీసెర్చ్ కూడా చేయడం జరిగింది.

అయితే ఈ సినిమా కు ఎలాంటి టైటిల్ ను పెడుతున్నారు అనే విషయంలో అనేక రకాల కథనాలు వెలువడ్డాయి. ఇక ప్రస్తుతం వినిపిస్తున్న టాక్ ప్రకారం సినిమాకు 'అన్నగారు' అనే టైటిల్ ను ఖరారు చేసినట్లుగా తెలుస్తోంది. ఇది వరకే ఈ సినిమాకు టైటిల్ ను ఖరారు చేసినట్లుగా ఒక టాక్ వచ్చిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు ఆ టైటిల్ అన్నగారు అని దర్శకుడు బాలకృష్ణ క్యారెక్టర్ కు తగ్గట్టుగా ఫిక్స్ చేసినట్లు సమాచారం. బాలకృష్ణ ఈ సినిమాలో విభిన్నమైన పాత్రల్లో కనిపించబోతున్నాడు. ఒక పాత్రలో ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ మరొక పాత్రలో సాఫ్ట్ గా కనిపించ బిజినెస్మేన్ గా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. బాలకృష్ణ ఒక పాత్రలో నెగిటివ్ షేడ్స్ గట్టిగానే ఉంటాయని తెలుస్తోంది. ఇక ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే సగానికిపైగా పూర్తి అయినట్లుగా సమాచారం. దర్శకుడు గోపీచంద్ మలినేని మరికొన్ని రోజుల్లో ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసే ఫస్ట్ లుక్ టీజర్ ను కూడా విడుదల చేయాలని ప్రణాళికలు రచిస్తున్నట్లు టాక్ వస్తోంది. మరి ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X