twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఎన్టీఆర్‌ను మోసం చేశారు.. వాళ్లంతా కలిసి చాలా కుట్రలు చేశారు: బాలయ్య షాకింగ్ కామెంట్స్

    By Manoj
    |

    తెలుగు రాష్ట్రాల్లో నందమూరి ఫ్యామిలీకి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. దీనికి కారణం నందమూరి తారక రామారావు అన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సినిమా హీరోగా.. రాజకీయ నాయకుడిగా ఆయన అందించిన సేవలు మరువలేనివి. ఇక, ఎన్టీఆర్ తర్వాత సినిమాల్లోకి ఎంతో మంది వచ్చారు. అదే సమయంలో కొందరు రాజకీయాల్లోనూ కాలు మోపారు. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ వెనుక కొందరు కుట్రలు చేశారని, అందుకే రాజకీయాలపై అలా నిర్ణయం తీసుకున్నాడని తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో బాలకృష్ణ వెల్లడించాడు. ఆ విశేషాలు మీరూ చూడండి!

    బాలకృష్ణ సెన్సేషనల్ ఇంటర్వ్యూ.. రికార్డులు బద్దలు

    బాలకృష్ణ సెన్సేషనల్ ఇంటర్వ్యూ.. రికార్డులు బద్దలు


    లాక్‌డౌన్ కారణంగా ఖాళీగానే ఉంటున్నారు నటసింహా నందమూరి బాలకృష్ణ. ఈ నేపథ్యంలో ఆయన ఓ యూట్యూబ్ చానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. తొలిసారి ఆయన పూర్తి స్థాయి ఇంటర్వ్యూ ఇవ్వడంతో దీనికి భారీ స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. అలాగే, ఇందులో కుటుంబ, రాజకీయ, సినీ సంబంధిత అంశాలు చాలా ప్రస్తావించడంతో రికార్డు స్థాయిలో వ్యూస్ లభించాయి.

    మాకు అది సెంటిమెంట్.. అందుకే అలా మొదలెట్టాం

    మాకు అది సెంటిమెంట్.. అందుకే అలా మొదలెట్టాం

    ప్రస్తుతం బాలయ్య.. బోయపాటి శ్రీనుతో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ ఇంటర్వ్యూలో ముందుగా తన కొత్త సినిమా గురించి మాట్లాడాడాయన. ‘బోయపాటితో సినిమా అంటే ముందుగా ఫైట్‌తోనే మొదలు పెడతాం. గతంలో చేసిన రెండు సినిమాలకూ అలానే చేశాం. సెంటిమెంట్ కావడంతో దీనికి అదే కంటిన్యూ చేశాం. ఐదు రోజులు మాత్రమే షూటింగ్ జరిగింది' అని చెప్పారు.

    నన్ను వాళ్లే నిద్ర లేపుతారు.. అప్పుడే ఖాళీగా ఉంటా

    నన్ను వాళ్లే నిద్ర లేపుతారు.. అప్పుడే ఖాళీగా ఉంటా

    బాలయ్య.. తన అభిమానులను కొడుతుంటాడు అన్న దానిపై అప్పట్లో పెద్ద ఎత్తున చర్చలు జరిగాయి. దాని గురించి తాజాగా స్పందిస్తూ.. ‘నాకు ఎంతో మంది ఫ్యాన్స్ ఉన్నారు. నేనంటే పడి చస్తుంటారు. నన్ను ఉదయం 3.30 గంటల సమయంలో వాళ్లే నిద్ర లేపుతుంటారు. అప్పుడైతేనే ఖాళీగా ఉంటానని నా ఫ్యాన్స్‌కు బాగా తెలుసు' అని బాలకృష్ణ వివరించారు.

    ఎవడైనా రెస్పెక్ట్ ఇవ్వాల్సిందే.. అది మాకే సొంతం

    ఎవడైనా రెస్పెక్ట్ ఇవ్వాల్సిందే.. అది మాకే సొంతం


    ఈ మధ్య తెలుగు సినీ ఇండస్ట్రీలో జరుగుతున్న గొడవలపైనా ఆయన స్పందించారు. ‘నాకు ఎవడైనా గౌరవం ఇవ్వాల్సిందే. అలా ఇచ్చిన వాళ్లనే నేను గౌరవిస్తా. అనవసరమైన విషయాల్లో కలుగుజేసుకోను. అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోను. చరిత్ర సృష్టించాలన్నా మేమే.. దాన్ని తిరగ రాయాలన్న మేమే' అంటూ గర్వంగా చెప్పుకొచ్చారు నందమూరి బాలకృష్ణ.

    జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీపై స్పందన

    జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీపై స్పందన

    తెలుగుదేశం పార్టీలోకి జూనియర్ ఎన్టీఆర్ వస్తే భవిష్యత్ బాగుంటుందన్న కామెంట్లు వినిపిస్తున్న నేపథ్యంలో బాలయ్య దీనిపై స్పందించారు. ‘తారక్‌కు హీరోగా చాలా భవిష్యత్ ఉంది. కెరీర్ సాఫీగా సాగుతున్న సమయంలో వాడు ఎలా నిర్ణయించుకుంటాడో.. వాడిష్టం. నేను, నాన్న గారు మాత్రం రాజకీయాల్లో ఉంటూనే సినిమాల్లోనూ నటించాం.. నటిస్తున్నాం' అని వెల్లడించారు.

    Recommended Video

    Sri Reddy On Balakrishna-Nagababu Issue || ఆయన కింగే మీరే బొంగు... నగ్న సత్యం చెప్పిన శ్రీ రెడ్డి
    చాలా కుట్రలు చేశారు.. అందుకే పాలిటిక్స్‌పై నిర్ణయం

    చాలా కుట్రలు చేశారు.. అందుకే పాలిటిక్స్‌పై నిర్ణయం

    ఇదే ఇంటర్వ్యూలో సీనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ గురించి కీలక విషయాలు వెల్లడించారు బాలయ్య. ‘నాన్న గారికి రాజ్యసభ సీటు ఇస్తామని అంటే కొందరు అడ్డుకున్నారు. అలాగే, చాలా మంది ఆయన వెనుక కుట్రలు చేశారు. వీటికి తోడు అప్పటి పరిస్థితులు ఆయన రాజకీయాల్లోకి వచ్చేలా చేశాయి. అందుకే పార్టీని స్థాపించారు' అని నటసింహా తెలిపారు.

    English summary
    Nandamuri Balakrishna is an Indian politician and film actor known for his works in Telugu cinema. He is the sixth son of Telugu film actor and former Chief Minister of Andhra Pradesh N. T. Rama Rao.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X