Balakrishna: ఫ్యాన్స్‌కు పండగే.. పక్క పక్కన ఇళ్లలోనే చిరంజీవి, బాలయ్య.. అసలు రీజన్ ఇదే!

బాలయ్య గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఆయన నందమూరి ఎన్టీ రామారావు వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తండ్రికి తగ్గ తనయుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే బాలయ్య గురించి ఓ వార్త నెట్టింట వైరల్ గా మారింది. ఆయన త్వరలో కొత్తింటికి మారబోతున్నట్లు న్యూస్ నెట్టింట హల్ చల్ చేస్తుంది. అది కూడా చిరంజీవి ఇంటి పక్కన బాలయ్య కొత్త ఇంటిని తీసుకుంటున్నారని తెలుస్తోంది. ఇక దీనితో బాలయ్య, చిరు మ్యూచువల్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. అసలు బాలయ్య ఇల్లు మారడానికి కారణం ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

తెలుగు ఇండస్ట్రీలో నటసింహ బాలకృష్ణ.. తనదైన శైలిలో సినిమాలు చేస్తూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక ఇటీవల ఆయన భగవంత్ కేసరి విజయాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. అంతే కాదు ప్రస్తుతం బాలయ్య నెక్ట్స్ మూవీ బాబీ దర్శకత్వంలో చేస్తున్నాడు. ఆ సినిమా షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. దాని కోసం ఆయన లుక్ కూడా మార్చేశాడు.

Nandamuri Balakrishna Move to New House Near Megastar Chiranjeevi House News Goes Viral

ఇక ఆ విషయం పక్కన పెడితే... బాలయ్య పలు నమ్మకాలను నమ్ముతూ ఉంటారనే విషయం తెలిసిందే. ఉదయం లేచినప్పటి నుంచి ఆయన తిథి,నక్షత్రం చూసుకుంటారు. ఆయన పూజలు కూడా ఎక్కువగానే చేస్తూ ఉంటారు. ఇక భగవంత్ కేసరి ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో కూడా ఆయన నమ్మకాలను మరోసారి గుర్తు చేసిన సంగతి తెలిసిందే. అయితే మరో విషయం ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారింది. ఆయన తాజాగా కొత్తింట్లోకి మారబోతున్నట్లు ఓ వార్త నెట్టింట్లో హల్ చల్ చేస్తుంది. ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ.. బాలయ్య కొత్త ఇంటికి మారబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

ఇక అది కూడా చిరంజీవి ఉంటున్న జూబ్లిహీల్స్ లోనే ఆయన ఇంటి సమీపంలోనే బాలయ్య కొత్త ఇంటిని తీసుకుంటున్నట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రస్తుతం ఇంటి పనులు చాలా శరవేగంగా జరుగుతున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఈ కొత్త ఇంటి గృహప్రవేశం జరగబోతోందని టాలీవుడ్ వర్గాల సమాచారం. అయితే బాలయ్య ఇలా హఠాత్తుగా ఇల్లు మారడం వెనుక వాస్తు దోషం ఉందని అంటున్నారు.

Nandamuri Balakrishna Move to New House Near Megastar Chiranjeevi House News Goes Viral

ముఖ్యంగా బాలయ్య ఇలాంటివి చాలా నమ్ముతారని.. అందరికీ తెలిసిందే. గతంలో వేణు స్వామితో పూజలు కూడా చేయించుకున్నారు. ఇక ఆయన ఉంటున్న ఇంటి దోషం కారణంగా ఇల్లు మారుతున్నట్లు తెలుస్తోంది. ఇక వచ్చే ఏడాది కొత్త ఇంట్లోకి బాలయ్య వెళ్లనున్నాడు. ఇక ప్రస్తుతం బాలయ్య మూడు సినిమాలు వరుసగా 100 కోట్ల క్లబ్ లోకి చేరిన సంగతి తెలిసిందే. ఈ వయసులో కూడా ఒకేసారి హ్యాట్రిక్ విజయాలను అందుకుని బాలయ్య రికార్డులు సృష్టిస్తున్నాడు.

మరోవైపు ఆయన కొడుకు మోక్షజ్ఞ ఎంట్రీ పైన పలు రకాలుగా వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. గతంలో డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఒక సినిమాని చేయబోతున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ తన కుమారుడిని తానే లాంచ్ చేస్తానని గతంలో బాలయ్య అన్నాడు. ఇక వచ్చే ఎన్నికల తర్వాతే మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుందని అంటున్నారు. చూడాలి మరి ఏం జరగనుందో.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X