బాలకృష్ణ బిగ్గెస్ట్ మల్టీస్టారర్ సినిమా కోసం దర్శకుడు ఫిక్స్.. ఎవరంటే?

కొంత కాలంగా వరుస విజయాలను అందుకుంటూ ఫుల్ ఫామ్‌లో దూసుకుపోతోన్న నటసింహా నందమూరి బాలకృష్ణ ఇప్పుడు సౌతిండియా మొత్తంలో హాట్ టాపిక్‌గా మారిపోయారు. దీనికి కారణం ఆయన ఇండియాలోనే బిగ్గెస్ట్ స్టార్లతో కలిసి మల్టీస్టారర్ మూవీ చేయబోతున్నారు అనే వార్తలు బయటకు రావడమే. ఇప్పటికే అనిల్ రావిపూడి మూవీతో పాటు చేతి నిండా ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా గడుపుతోన్న ఈ నందమూరి హీరో.. ఇప్పుడు ఏకంగా సూపర్ స్టార్ రజినీకాంత్, కన్నడ హీరో శివరాజ్‌కుమార్‌తో కలిసి భారీ ప్రాజెక్టులో భాగం కాబోతున్నారు.

తాజాగా బయటకు వచ్చిన సమాచారం ప్రకారం.. బాలయ్య - రజినీకాంత్ - శివరాజ్‌కుమార్ కాంబినేషన్‌లో రెండు భాగాల సినిమా రాబోతుందట. అత్యంత భారీ బడ్జెట్‌తో రాబోతున్న ఈ మూవీ ఫస్ట్ పార్టులో బాలయ్య, శివరాజ్‌కుమార్ కనిపిస్తారని తెలిసింది. రెండో దానిలో వీళ్లిద్దరితో పాటు రజినీకాంత్ కూడా కీలక పాత్రలో మెప్పిస్తారని అంటున్నారు. దీంతో ఈ వార్త తక్కువ సమయంలోనే సెన్సేషన్ అయింది. అదే సమయంలో ఈ ప్రాజెక్టును డీల్ చేయబోయే డైరెక్టర్ ఎవరా అని చాలా మంది గూగుల్‌లో వెతికేస్తున్నారు కూడా.

Nandamuri balakrishna multi starrer movie Director almost fix latest update

సెన్సేషనల్ స్టార్ల కాంబినేషన్‌లో రాబోతున్న ఈ భారీ చిత్రాన్ని కన్నడ డైరెక్టర్ హర్ష రూపొందించబోతున్నాడని తాజాగా తెలిసింది. ఈ మధ్య కాలంలో శివరాజ్‌కుమార్‌తో ఈ టాలెంటెడ్ దర్శకుడు 'భజరంగీ 2', 'వేద' వంటి భారీ బడ్జెట్ చిత్రాలను తెరకెక్కించాడు. ఆ సమయంలో ఈ ప్రాజెక్టుకు సంబంధించిన చర్చలు వాళ్లిద్దరి మధ్య జరిగాయని తెలిసింది. బాలయ్యతో ఉన్న చనువుతో శివన్న వెంటనే ఆయనను ఒప్పించారని తెలిసింది. ఆ తర్వాత రజినీకాంత్‌తో చర్చించి ఓకే చేయించారని తెలిసింది.

త్వరలోనే అధికారికంగా ప్రకటించబోతున్న ఈ ప్రాజెక్టును శివరాజ్‌కుమార్ తన సొంత బ్యానర్ మీద నిర్మించబోతున్నారట. ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా జరుగుతుందని తెలిసింది. అది పూర్తైన వెంటనే రెగ్యూలర్ షూట్‌ను మొదలు పెట్టే యోచనలో చిత్ర యూనిట్ ఉందని టాక్. అంతా అనుకున్నట్లు జరిగితే సౌతిండియాలోనే ఇది బిగ్గెస్ట్ మల్టీస్టారర్ అవుతుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం ఉండదు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X