NBK 109: మొదటిసారి ఆ గ్లామరస్ బ్యూటీతో జత కట్టబోతున్న బాలయ్య.. బెస్ట్ కాంబో!
ఆరు పదుల వయసులోనూ పదహారేళ్ల కుర్రాడిలా ఉత్సాహంగా సినిమాల మీద సినిమాలు చేస్తూ దూసుకుపోతోన్నారు నటసింహా నందమూరి బాలకృష్ణ. కొంత కాలంగా ఫుల్ ఫామ్‌లో ఉన్న ఈ సీనియర్ హీరో.. వరుసగా 'అఖండ', 'వీర సింహా రెడ్డి' వంటి హిట్ చిత్రాలతో సత్తా చాటారు. ఈ క్రమంలోనే ఇప్పుడు ఆయన సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో కలిసి 'భగవంత్ కేసరి' అనే సినిమా చేస్తున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన చాలా వరకూ షూటింగ్ కంప్లీట్ అయింది. దీన్ని దసరా కానుకగా విడుదల చేయబోతున్నారు.
'భగవంత్ కేసరి' సినిమా పట్టాలపై ఉండగానే నటసింహా నందమూరి బాలకృష్ణ తన 109వ చిత్రాన్ని కూడా లైన్‌లో పెట్టుకున్నారు. దీన్ని 'వాల్తేరు వీరయ్య'తో బిగ్గెస్ట్ హిట్‌ను ఖాతాలో వేసుకున్న బాబీ అలియాస్ కేఎస్ రవీంద్ర తెరకెక్కించబోతున్నాడు. బాలయ్య పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాపై అధికారిక ప్రకటన వెలువడింది. అలాగే, ఓ పోస్టర్‌ను కూడా చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఇందులో ఓ ట్రంక్ పెట్టె.. దానిలో కొన్ని పాత కాలం ఆయుధాలు, వస్తువులు కనిపించాయి. ఫలితంగా ఆరంభంలోనే ఈ చిత్రంపై అంచనాలు ఏర్పడ్డాయి.

నందమూరి బాలకృష్ణ - బాబీ కాంబినేషన్‌లో రాబోతున్న చిత్రంలో నటించే ఆర్టిస్టు గురించి ఎలాంటి ప్రకటనా చేయలేదు. కానీ, ఇందులో నటించే హీరోయిన్ ఎవరన్న దానిపై తాజాగా ఓ న్యూస్ బయటకు వచ్చేసింది. సినీ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ మూవీలో బాలయ్యకు జోడీగా మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా నటిస్తుందని తెలిసింది. ఓకే అయితే తమన్నాకు బాలయ్యతో ఇదే ఫస్ట్ సినిమా అవుతుంది. ఇప్పటికే ఆమెకు బాబీ స్టోరీ లైన్‌ను వినిపించాడట. ఇది ఆమెకు బాగా నచ్చడంతో వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలిసింది. ఇక, ఈమెకు సంబంధించిన ప్రకటన అతి త్వరలోనే రాబోతుందని అంటున్నారు.
బాలయ్య హీరోగా బాబీ తెరకెక్కించబోయే ఈ సినిమాను సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్, శ్రీకర స్టూడియోస్ బ్యానర్లపై నాగ వంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ మూవీ రెగ్యూలర్ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కాబోతుంది. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సమ్మర్‌లో విడుదల చేసే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











