మళ్ళీ ప్లాన్ చేంజ్ చేసిన బాలకృష్ణ.. డిజాస్టర్ ఇచ్చిన దర్శకుడితో మరో సినిమా
నందమూరి సీనియర్ హీరో బాలకృష్ణ హిట్టు చూసి చాలా కాలమవుతోంది. ముఖ్యంగా ఎన్టీఆర్ బయోపిక్ తో చరిత్ర తిరగరాస్తాడు అనుకుంటే కనీసం ఉన్న కథను కూడా సరిగ్గా చపించలేదని బోనస్ గా విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. అందుకే నెక్స్ట్ సినిమాలతో కమర్షియల్ గా విజయాలను అందుకోవాలని చూస్తున్నాడు. నెక్స్ట్ బోయపాటి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే.
సింహా - లెజెండ్ వంటి బాక్సాఫీస్ హిట్స్ తరువాత వస్తున్న సినిమా కావడంతో ఆ కాంబినేషన్ పై అంచనాలు భారీగా నెలకొన్నాయి. అయితే ఆ సినిమా తరువాత బాలకృష్ణ ఎవరితో వర్క్ చేస్తాడు అన్నది ఇంకా అఫీషియల్ గా ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. సీనియర్ డైరెక్టర్ బి.గోపాల్ తో ఒక సినిమా ఉంటుందని టాక్ వచ్చిన విషయం తెలిసిందే. కానీ లేటెస్ట్ గా అందిన సమాచారం ప్రకారం బాలయ్య మళ్ళీ ప్లాన్ చేంజ్ చేసినట్లు తెలుస్తోంది.

బోయపాటితో షూటింగ్ అయిపోగానే పూరి జగన్నాథ్ తో ఒక సినిమా చేయాలని డిసైడ్ అయినట్లు సమాచారం. గతంలో వీరి కాంబినేషన్ లో వచ్చిన పైసా వసూల్ డిజాస్టర్ అయిన విషయం తెలిసిందే. అయినప్పటికీ బాలయ్య పూరితో మరోసారి వర్క్ చేయాలని అనుకుంటున్నాడు.
గత కొన్ని రోజులుగా వీరిద్దరి మధ్య ఒక కథపై చర్చలు నడుస్తున్నాయట. బి.గోపాల్ ఇంకా కథను పూర్తిగా సెట్ చేసుకోకపోవడంతో బాలకృష్ణ మనసు మార్చుకున్నట్లు తెలుస్తోంది. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలి అంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.


Click it and Unblock the Notifications











