ఆ యువ దర్శకుడితో బాలయ్య బిగ్ ప్రాజెక్ట్.. ఈ కాంబో సెట్టయితే అద్బుతమే!
నందమూరి బాలకృష్ణ వీర సింహారెడ్డి సినిమాతో మాస్ ఫ్యాన్ ఫాలోవర్స్ ను మరోసారి ఎంతగానో ఆకట్టుకున్నారు. పండగ సీజన్లో బాక్స్ ఆఫీస్ వద్ద సాలిడ్ ఓపెనింగ్స్ అందుకున్న బాలయ్య మరోసారి తన సత్తా ఏమిటో నిరూపించారు. ఇక బాలయ్య బాబు నుంచి రాబోయే భవిష్యత్తు ప్రాజెక్టులు మరింత డిఫరెంట్ గా ఉండబోతున్నాయి. ఇక రీసెంట్ గా ఆయన ఒక యువ దర్శకుడితో చర్చలు కూడా జరిపినట్లు సమాచారం. అందుకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..

వెనక్కి తిరిగి చూడని బాలయ్య
గత కొంతకాలంగా నందమూరి బాలకృష్ణ క్రేజ్ ఊహించని స్థాయిలో పెరిగిపోతుంది. షో ముందు వరకు కూడా బాలయ్య బాబు ఒక విధంగా వరుస అపజయాలతో సతమతమయ్యారు. ఇక అన్ స్టాపబుల్ షో తర్వాత ఆయన మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఊహించిన విధంగా ఫాన్ ఫాలోవర్స్ ను పెంచుకోవడమే కాకుండా అఖండ సినిమాతో బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారు.

బాలయ్య రేంజ్
ఇటీవల వీర సింహారెడ్డి సినిమాకు సంబంధించిన ఓపెనింగ్స్ ఊహించని రికార్డ్ ను క్రియేట్ చేశాయి. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆయన కెరీర్ లోనే అత్యధిక స్థాయిలో ఓపెనింగ్స్ అందుకున్న సినిమాగా నిలిచింది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమాను గోపీచంద్ డైరెక్ట్ చేశాడు. కంటెంట్ పరంగా కాస్త నెగిటివ్ కామెంట్స్ అందుకున్నప్పటికీ కూడా బాలయ్య బాబు తన రేంజ్ తోనే ఈ సినిమాకు కలెక్షన్స్ పెంచుకుంటూ వెళ్తున్నాడు.

మరో పవర్ఫుల్ మూవీ
అయితే రాబోయే రోజుల్లో నందమూరి బాలకృష్ణ నుంచి మరిన్ని ఆసక్తికరమైన కాంబినేషన్స్ స్టార్ట్ కాబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇదివరకే అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నట్లు అధికారికంగా క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ సినిమాలో ఆయన పవర్ఫుల్ క్యారెక్టర్ లో కనిపించబోతున్నాడు. అంతేకాకుండా మంచి ఎంటర్టైన్మెంట్ కూడా అందించే పాత్ర కూడా చేయబోతున్నాడు.

అ! డైరెక్టర్ రంగంలోకి..
ఇక నందమూరి బాలకృష్ణతో గత ఏడాది నుంచి యువ దర్శకులు కూడా సినిమా చేసేందుకు ఆసక్తిని చూపిస్తున్నారు. ఇక ప్రశాంత్ వర్మ కూడా ఎప్పటినుంచో బాలయ్య బాబుతో సినిమా చేయాలని ఉంది అని చెబుతున్న విషయం తెలిసిందే. ఇక మొత్తానికి మరో యువ దర్శకుడు ఇటీవల ఒక కథతో ఆయనను మెప్పించినట్లు తెలుస్తోంది. అతను మరెవరో కాదు అ! డైరెక్టర్ ప్రశాంత్ వర్మ అని తెలుస్తోంది. ఈసారి ప్రశాంత్ కథతో మెప్పించానట్లుగా ఒక టాక్ అయితే వినిపిస్తోంది.

అలాంటి కాన్సెప్ట్ పై కథ
ప్రశాంత్ వర్మతో ఇదివరకే బాలయ్య బాబు అన్ స్టాపబుల్ కు సంబంధించిన ప్రోమోలలో వర్క్ చేయడం జరిగింది. ఆ పవర్ ఫుల్ ప్రోమోలకు ప్రశాంత్ డైరెక్షన్ చేశాడు. అప్పుడే అతని పనితనం ఆయనకు బాగా నచ్చింది. ఇక మంచి కథ ఉంటే కూడా ఫైనల్ చేయాలి అని చెప్పాడట. దీంతో బాలయ్య బాబు కోసం అతను డిఫరెంట్ సైన్స్ ఫిక్షన్ కదను రెడీ చేస్తున్నట్లుగా మరొక టాక్ వినిపిస్తోంది. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలి అంటే మరి కొంతకాలం ఆగాల్సిందే.


Click it and Unblock the Notifications











