మెగా బ్యానర్ లో బాలయ్య బిగ్ బడ్జెట్ మూవీ.. చర్చల్లోకి ఎన్టీఆర్ డైరెక్టర్?
నందమూరి బాలకృష్ణ కూడా వరుసగా సినిమాలను లైన్లో పెడుతున్న విషయం తెలిసిందే. అఖండ సినిమాతో బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్న బాలయ్య బాబు ఆ తర్వాత కూడా అంతకుమించి అనేలా సక్సెస్ అందుకోవాలి అని రెడీ అవుతున్నాడు. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో 107వ సినిమాను చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ టీజర్ కూడా అభిమానుల్లో మంచి అంచనాలను క్రియేట్ చేసింది. ఇక ఆ సినిమా తర్వాత అనిల్ రావిపూడి దర్శకత్వంలో మరొక బిగ్ బడ్జెట్ సినిమాను స్టార్ట్ చేయబోతున్నాడు.
ఆ సినిమాలో బాలయ్య నెవర్ బిఫోర్ అనే విధంగా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఇక బాలకృష్ణ మరో రెండు మూడు ప్రాజెక్టులు కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. మరి కొంతమంది మాస్ దర్శకులు కూడా బాలయ్యతో సినిమా చేసేందుకు గత కొన్ని నెలలుగా చర్చలు జరుపుతూనే ఉన్నారు. అయితే పూర్తిస్థాయిలో స్క్రిప్ట్ నచ్చే వరకు కూడా బాలయ్య ఎవరికీ గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం లేదు.

ఇక త్వరలోనే ఆయన ఒక దర్శకుడికి ఓకే చెప్పే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఆ దర్శకుడు మరెవరు కాదు జూనియర్ ఎన్టీఆర్ తో ప్రస్తుతం బిగ్ బడ్జెట్ పాన్ ఇండియా సినిమాను తెరపైకి తీసుకురాబోతున్న కొరటాల శివ అని తెలుస్తోంది. ఇదివరకే ఎన్టీఆర్ తో జనతా గ్యారేజ్ సినిమాను డైరెక్ట్ చేసిన కొరటాల శివ మరోసారి నందమూరి హీరోతో వర్క్ చేయబోతున్నాడు. అలాగే నందమూరి బాలయ్య తో కూడా చాలా రోజులుగా ఒక ప్రాజెక్ట్ చేయాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం.
ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ ప్రాజెక్టు ఓకే అయితే మాత్రం ఆ సినిమాను మెగా బ్యానర్ గీతా ఆర్ట్స్ లో నిర్మించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. అల్లు అరవింద్ తో ఇప్పటికే అన్ స్టాపబుల్ షోను చేసిన బాలయ్య బాబు ఇప్పుడు సినిమా కూడా చేసేందుకు సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. గతంలోనే కొన్ని కథలపై కూడా చర్చలు జరిగాయి కానీ ఏది ఫైనల్ కాలేదు. కానీ కొరటాల శివ మంచి స్టోరీ లైన్ చెప్పడంతో బాలయ్య బాబు ఒప్పుకున్నట్లుగా తెలుస్తోంది. ఇక కొరటాల శివ జూనియర్ ఎన్టీఆర్ తో సినిమా చేసిన తర్వాత బాలయ్య బాబుతో వర్క్ చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











