అఖండ 2 తర్వాత బాలకృష్ణ నెక్ట్స్ మూవీ ఇదే.. ఇక రక్తపాతమే!
టాలీవుడ్ సీనియర్ నటుడు బాలకృష్ణ ప్రస్తుతం 'అఖండ 2' చిత్రంతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఇప్పటికే బాలకృష్ణ వరుస చిత్రాలతో బ్లాక్ బాస్టర్ హిట్స్ ను అందుకుంటున్న సంగతి తెలిసిందే. ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్స్ తో, యంగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్లతో వర్క్ చేస్తూ వస్తున్నారు. చివరిగా మాస్ డైరెక్టర్ గోపీ చంద్ మలినేని దర్శకత్వంలో 'డాకు మహారాజ్' చిత్రంతో అలరించిన సంగతి తెలిసిందే. ఇక నెక్ట్స్ చిత్రాల విషయానికొస్తే.. బాలయ్య ఒక మాస్ డైరెక్టర్ తో కొలాబరేట్ కాంబోతున్నట్టు తెలుస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే...
వరసగా హ్యాట్రిక్ హిట్స్..
బాలకృష్ణ తన కెరీయర్ లో 109 సినిమాలు చేశారు. అయితే 1974 నుంచి సినిమా పరిశ్రమలో యాక్టివ్ గా ఉంటున్నారు. ఆయన కెరీయర్ లో బయోగ్రాఫికల్, హిస్టారికల్, హజియోగ్రాఫికల్ చిత్రాల్లో నటించి మెప్పించారు. సాహసమే జీవితం, జనని జన్మభూమి, మంగమ్మగారి మనవడు, అపూర్వ సహోదరులు, ఆదిత్య 369, సమరసింహ రెడ్డి, నర్సింహా నాయుడు, అభిమన్యు, నాదర, కృష్ణ దేవరాయ, పాండు రంగడు వంటి చిత్రాల్లో నటించి తెలుగు చలన చిత్ర పరిశ్రమలో చెరగని ముద్ర వేశారు. ఇక ప్రస్తుతం కూడా యంగ్ హీరోలకు ధీటుగా సినిమాలు చేస్తూ వస్తున్నారు. చివరిగా అఖండ, వీర సింహా రెడ్డి, భగవంత్ కేసరి, డాకు మహారాజ్ వంటి చిత్రాలతో బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బాస్టర్ హిట్స్ ను అందుకొని సెన్సేషన్ క్రియేట్ చేశారు.

అఖండ 2 నుంచి సర్ ప్రైజ్..
బాలకృష్ణ చివరిగా గోపీచంద్ మాలినేని దర్శకత్వంలో డాకు మహారాజ్ చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంతో రీసెంట్ గా బ్లాక్ బాస్టర్ హిట్ ను సొంతం చేసుకున్నారు. 2025 దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి హిట్ ను సొంతం చేసుకుంది. బాక్సాఫీస్ వద్ద రూ.130 కోట్ల వరకు గ్రాస్ వసూల్ చేసింది. ఇక నెక్ట్స్ బాలకృష్ణ తన ఫేవరెట్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో 'అఖండ 2' చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ మూవీ షూట్ చివరి దశలో ఉంది. ఇక జూన్ 9న బాలకృష్ణ పుట్టిన రోజు సందర్భంగా ఈ మూవీ టీజర్ ను విడుదల చేయబోతున్నారు.
మార్కో దర్శకుడితో బాలకృష్ణ నెక్ట్స్..
బాలకృష్ణ అఖండ 2తో మళ్లీ హిట్ అందుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఓవైపు ఆ మూవీ షూటింగ్ ను కంప్లీట్ చేసుకుంటూనే మరోవైపు మరింత ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ ను లాక్ చేసే ప్రయత్నంలో ఉన్నారు. ఈ క్రమంలో బాలకృష్ణ ఓ సెన్సేషనల్ డైరెక్టర్ ను లాక్ చేసినట్టు తెలుస్తోంది. ఆయన మరెవరో కాదు మలయాళ బ్లాక్ బాస్టర్ చిత్రం 'మార్కో' దర్శకుడు హానీఫ్ అడెని కావడం విశేషం. వీరిద్దరి కాంబో ప్రస్తుతం చర్చలో ఉంది. ఒక బలమైన పోలీసు కథ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారని ఫిల్మ్ సర్కిల్ లో టాక్ వినిపిస్తోంది.
అఖండ 2 చిత్రం వివరాలు..
ప్రస్తుతం బాలయ్య అభిమానులు అఖండ 2 చిత్రం కోసం ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రాన్ని బోయపాటి శ్రీనివాస్ డైరెక్ట్ చేస్తున్నారు. 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై రామ్ అచంట, గోపీచంద్ అచంట లు నిర్మిస్తున్న ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో సెప్టెంబర్ 25, 2025 తేదీకి దసరా కానుగా ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం నుంచి యాక్షన్ ప్యాక్డ్ టీజర్ రాబోతుండటం ఆసక్తికంగా మారింది.


Click it and Unblock the Notifications











