Balakrishna: భగవంత్ కేసరి హిట్‌తో బాలకృష్ణ జోరు.. ఆ ముగ్గురిని లైన్‌లో పెట్టిన నటసింహం!

గాడ్ ఆఫ్ మాసెస్, నటసింహం నందమూరి బాలకృష్ణ గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగు రాష్ట్రాల్లో ఆయనకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఆయన పేరు విన్నా, సినిమాలు చూసిన బాలయ్య బాబు ఫ్యాన్స్ అంతా పూనకాలతో ఊగిపోతుంటారు. 62 ఏళ్ల వయసులోనూ ఆయన అనేక చిత్రాల్లో నటిస్తూ.. ముందుకు వెళ్తున్నారు. ముఖ్యంగా మాస్ గా కనిపిస్తూ.. మస్తు మస్తు స్టెప్పులు వేస్తూ అందరినీ అలరిస్తున్నారు. తాజగా భగవంత్ కేసరి చిత్రంతో మన ముందుకు వచ్చిన బాలయ్య బాబు.. అద్భుతమైన టాక్ తో దూసుకెళ్తున్నారు. భగవంత్ కేసరి చిత్రం ఇప్పటికే బ్లాక్ బస్టర్ హిట్టుగా దూసుకెళ్తోంది.

ఈ ఊపులోనే నందమూరి బాలకృష్ణ మరో మూడు చిత్రాల్లో నటించేందుకు ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా స్టార్ డైరెక్టర్ బాబీతో కలిసి బాలయ్య బాబు NBK 109 చిత్రం చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఇందుకు సంబంధించిన కథ, నటీనటులు ఎంపిక కూడా పూర్తయినట్లు సమాచారం. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ను వచ్చే నెల రెండో వారం నుంచే ప్రారంభించబోతున్నారట. అయితే ఈ సినిమా ఇప్పటికే లాక్ అవ్వగా.. ఆ తర్వాతి చిత్రం ఎవరితో చేస్తారనే దానిపై మాత్రం ఇంకా క్లారిటీ లేదు. ఎవరితో చేస్తారో కన్ఫార్మ్ గా తెలియకపోయినా మరో ఇద్దరు డైరెక్టర్లను మాత్రం లైన్ లో పెట్టారు నటసింహం.

Nandamuri Balakrishna Next Three Movies Locked With Star Directors

మరో మూడేళ్ల వరకూ నందమూరి బాలకృష్ణ ఫుల్ బిజీగా ఉండేలా ప్లాన్ చేసుకున్నారట. ముఖ్యంగా NBK 110, NBK 111 సినిమాలను కూడా లాక్ చేసినట్లు సమాచారం. ఈ రెండు చిత్రాలను స్టార్ డైరెక్టర్లతోనే చేయబోతున్నారు. 110వ చిత్రం అఖండ 2 అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉందని అంతా భావిస్తున్నారు. అఘోర పాత్రలోనే మళ్లీ బాలయ్య బాబు దర్శనం ఇస్తారని.. అలాగే పొలిటికలక్ టచ్ కూడా ఉంటుందని తెలుస్తోంది. మరి ఇంకా ఏమైనా పెద్ద పెద్ద మార్పులు చేస్తారా, లేక ఇలాగే తీస్తారో తెలియాలంటే ఇంకా కొంత కాలం ఆగాల్సిందే.

ఇక NBK 111వ చిత్రానికి వీరసింహారెడ్డి కాంబో రిపీట్ కాబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. గోపీచంద్ మలినేని ప్రస్తుతం మాస్ మహారాజా రవితేజతో ఓ సినిమా చేయబోతున్నారు. అది పూర్తి కాగానే బాలకృష్ణకు కథ వినిపిస్తారట. అది గనుక ఓకే అయితే NBK 111 లాక్ అయిపోయినట్లే. ఇలా ఒకేసారి మూడు చిత్రాలను లైన్ లో పెట్టిన బాలయ్య బాబు నెక్స్ట్ చిత్రం గురించి కూడా ఆలోచిస్తున్నారట. ముఖ్యంగా సుకుమార్ డైరెక్షన్ లో ఓ సినిమా చేయాలని ప్లాన్ చేస్తున్నారట. కానీ దీనికి చాలానే సమయం పట్టబోతున్నట్లు తెలుస్తోంది.

Nandamuri Balakrishna Next Three Movies Locked With Star Directors

ఇప్పటికే నందమూరి బాలకృష్ణ తన వద్ద చాలా కథలు ఉన్నాయని చెప్పారు. మోక్షజ్ఞ సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తానన్న చాలా కథలు తన కోసం... స్వయంగా తానే సిద్ధం చేసినట్లు వెల్లడించారు. సమయం ఎక్కువ లేక కానీ.. లేదంటే బాలయ్య బాబు చాలానే సినిమాల్లో చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. ఆరు పదుల వయసులోనూ బాలయ్య బాబు ఈ రేంజ్ లో సినిమాలు తీస్తుంటేనే ఆయన స్టామినా ఏంటో అర్థం అయిపోతుంది. చూడాలి మరి ఎంత త్వరగా ఈ చిత్రాలు పూర్తి చేస్తారనేది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X