ముసలి గెటప్‌లో నందమూరి బాలకృష్ణ: సాహసాలు చేయడానికి సిద్ధమైన నటసింహం
టాలీవుడ్ మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో నటసింహా నందమూరి బాలకృష్ణ ఓ సినిమాను చేస్తున్న విషయం తెలిసిందే. 'సింహా', 'లెజెండ్' వంటి సూపర్ డూపర్ హిట్ల తర్వాత వస్తోన్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. అందుకు అనుగుణంగానే ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. మరీ ముఖ్యంగా బోయపాటి తన గత చిత్రాల మాదిరిగానే ఉన్నా.. ఇప్పటి వరకూ రాని సరికొత్త పాయింట్‌తో ఈ సినిమా రూపొందుతోందని తెలుస్తోంది. ఇక, ఇందులో బాలయ్య చేస్తున్న పాత్రలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది.
BB3 పేరిట తెరకెక్కుతోన్న ఈ సినిమాలో నందమూరి బాలకృష్ణ అఘోరా పాత్రలో నటిస్తున్నాడని జోరుగా ప్రచారం జరుగుతోంది. అలాగే, పవర్‌ఫుల్ రైతు పాత్రలోనూ ఆయన కనిపించనున్నారు. తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమాలో ఆయన మరో పాత్రను కూడా పోషిస్తున్నారట. అదే డెబ్బై ఏళ్ల ముసలి వ్యక్తి రోల్ అని ఓ న్యూస్ ఫిలిం నగర్ ఏరియాలో చక్కర్లు కొడుతోంది. అంతేకాదు, వృద్ధ పాత్రలోనూ ఆయన కొన్ని యాక్షన్ సీక్వెన్స్ చేయబోతున్నాడని అంటున్నారు. ఇందుకోసం పాత్రకు సరిపోయేలా ప్రత్యేకంగా ఫైట్స్‌ను డిజైన్ చేయిస్తున్నాడట డైరెక్టర్ బోయపాటి శ్రీను.

పవర్‌ఫుల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ చిత్రాన్ని మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు. బాలయ్య కెరీర్‌లో భారీ బడ్జెట్‌తో ఇది తెరకెక్కుతోంది. ఇక, ఇందులో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా చేస్తుండగా.. సామ్నా ఖాసీం అలియాస్ పూర్ణ మరో లీడ్‌గా చేస్తోంది. ఫ్యామిలీ హీరో శ్రీకాంత్ కీలక పాత్రను పోషిస్తుండగా.. బాలీవుడ్ హీరో సునీల్ శెట్టి విలన్‌గా నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. థమన్ సంగీతం సమకూర్చుతోన్న ఈ చిత్రం నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా మే 28న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు చిత్ర యూనిట్ ఇప్పటికే ప్రకటించింది.


Click it and Unblock the Notifications











