నందమూరి ఫ్యాన్స్‌కు షాకింగ్ న్యూస్.. పోటీ నుంచి తప్పుకుంటున్న బాలయ్య.. ఇదే మొదటిసారి
నటసింహా నందమూరి బాలకృష్ణ.. తెలుగు సినీ చరిత్రలో చెప్పుకోదగ్గ హీరోలలో ఒకరు. భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న నటుడు. ఈయన పేరుపై రిజిష్టర్ అయి ఉన్నన్ని ఫ్యాన్ గ్రూపులు మరే హీరోకూ లేవంటారు. గతంలో వరుసగా సినిమాలు చేస్తూ వచ్చిన ఈయన.. కొద్దిరోజులుగా స్పీడును తగ్గించారు. రాజకీయాల్లోకి ఎంటరైన తర్వాత మరింత ఆచితూచి అడుగులు వేస్తున్నారు. దీంతో బాలయ్య ఫ్యాన్స్ నిరాశకు లోనవుతున్నారు. తాజాగా వారిని మరింత నిరుత్సాహానికి గురి చేసే వార్త ఒకటి బయటకు వచ్చింది. వివరాల్లోకి వెళితే...
Recommended Video

కేఎస్ రవికుమార్‌తో రెండోసారి
గతంలో ‘జై సింహా' వంటి సినిమాను అందించిన కేఎస్ రవికుమార్‌తో బాలయ్య మరోసారి జట్టుకట్టారు. ఈ సినిమాను ప్రముఖ నిర్మాత సీ కల్యాణ్ తెరకెక్కిస్తున్నారు. దీనికి సంబంధించిన పూజా కార్యక్రమాలు కూడా ఎప్పుడో పూర్తయ్యాయి. కానీ, షూటింగ్ మాత్రం ప్రారంభం కాలేదు. అయితే, ఇటీవల థాయ్‌లాండ్‌లో ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. భారీ షెడ్యూల్‌లో కీలక నటీనటులపై సన్నివేశాలు చిత్రీకరించనున్నారు.

డిఫరెంట్ షేడ్స్‌లో బాలయ్య
ఈ సినిమాలో బాలకృష్ణ రెండు షేడ్స్‌లో కనిపించబోతున్నాడని వార్తలు వస్తున్నాయి. అందులో ఒకటి పోలీస్ ఆఫీసర్ పాత్ర కాగా, మరొకటి గ్యాంగ్‌స్టర్ క్యారెక్టర్. సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ గ్యాంగ్‌స్టర్‌గా ఎలా మారాడు అనేదే సినిమా కథ అని ఫిలింనగర్‌లో ఓ న్యూస్ హల్‌చల్ చేస్తోంది. అయితే, దీనిపై ఎటువంటి క్లారిటీ లేదు. ఇందులో బాలయ్య సరసన సోనాల్ చౌహాన్, వేదిక నటిస్తుండగా, భూమిక, జయసుధ కీలక పాత్రలు చేస్తున్నారు. దీనికి ‘రూలర్' టైటిల్ పెడుతున్నారని మొదట ప్రచారం జరిగినప్పటికీ, ఈ మధ్య మరో పేరు బయటకు వచ్చింది. దీని ప్రకారం ఈ సినిమాకు ‘క్రాంతి' అనే టైటిల్ పెట్టబోతునట్లు తెలుస్తోంది.

సరికొత్త లుక్‌తో దర్శనమిచ్చాడు
ఈ సినిమా బాలకృష్ణ ఏ పాత్రలో కనిపిస్తారన్న దానిపై ఎటువంటి క్లారిటీ లేకపోయినా.. తాజాగా ఆయనకు సంబంధించిన లుక్ ఒకటి బయటకు వచ్చింది. నందమూరి బాలకృష్ణే స్వయంగా విడుదల చేశారు. తన ఫేస్‌బుక్ ఖాతాలో ఈ పిక్‌ను షేర్ చేసిన బాలయ్య.. ‘కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న నా 105వ సినిమాలోని లుక్ ఇది' అని పేర్కొన్నాడు. ఇందులో బాలయ్య సన్నగా సరికొత్తగా కనిపిస్తున్నాడు. ఫ్రెంచ్ కట్ షేవ్‌తో హ్యాండ్సమ్‌గా దర్శనమిస్తున్నాడు. దీంతో ఈ పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

పోటీ నుంచి తప్పుకుంటున్నాడట
కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో చేస్తున్న సినిమాను సంక్రాంతికి విడుదల చేస్తామని చిత్ర యూనిట్ గతంలో చెప్పింది. అయితే, ఇప్పుడు ఈ నిర్ణయాన్ని మార్చుకున్నారట. వీలైనంత త్వరగా పూర్తి చేసి ఈ సినిమాను డిసెంబర్ నెలాఖరున విడుదల చేయడానికి దర్శక నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారని తాజాగా ఓ వార్త బయటకు వచ్చింది. అంటే బాలయ్య సంక్రాంతి పోటీ నుంచి తప్పుకుంటున్నాడన్న మాట.

సంక్రాంతి హీరోగా పేరు
బాలయ్యకు సంక్రాంతి హీరోగా పేరుంది. ఎందుకంటే ఆయన ఇప్పటి వరకు 17 సినిమాలను సంక్రాంతి కానుకగానే విడుదల చేశారు. 1985లో వచ్చిన ఆత్మబలం నుంచి 2019లో వచ్చిన యన్.టి.ఆర్ కథానాయకుడు వరకు ఎన్నో సినిమాలు హిట్లుగా నిలిచాయి. వీటిలో పెద్దన్నయ్య (1997), నరసింహనాయుడు (2001), లక్ష్మీ నరసింహా (2004), సహా 2016లో డిక్టేటర్, 2017లో గౌతమిపుత్ర శాతకర్ణి, 2018లో జై సింహా సినిమాలు హిట్లుగా నిలిచిన విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications











