Balakrishna: బాలయ్య ఫ్యాన్స్ చొక్కాలు చింపుకునే న్యూస్.. ఇక బాబు కేరాఫ్ పాన్ ఇండియా

తన తోటి సీనియర్ హీరోలతోనే కాదు... ఇప్పటి కుర్ర హీరోలతో కూడా పోటీపడుతూ దూసుకుపోతున్నారు నందమూరి బాలకృష్ణ. చివరిగా వీరసింహారెడ్డి అనే సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఆయన ప్రస్తుతం.. అనిల్ రావిపూడి దర్శకత్వంలోకి సినిమా చేస్తున్నాడు. అయితే ఆయన ఒక పాన్ ఇండియా మూవీ ఒప్పుకున్నట్లుగా టాలీవుడ్ వర్గాల ప్రచారం జరుగుతుంది. దానికి సంబంధించిన వివరాల్లోకి వెళ్లి పూర్తి సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

ప్రస్తుతానికి నందమూరి బాలకృష్ణ, అనిల్ రావు పూడి దర్శకత్వంలో భగవంత్ కేసరి అనే ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో నందమూరి బాలకృష్ణ సరసన హీరోయిన్ గా కాజల్ అగర్వాల్ నటిస్తోంది. పెళ్లి తర్వాత ఆమె చేస్తున్న పెద్ద ప్రాజెక్టు ఇదే కావడంతో ఆమె ఆశలన్నీ ఈ సినిమా మీదే ఉన్నాయి. దానికి తోడు ఇప్పటివరకు పరాజయమే తెలియని అనిల్ రావిపూడి డైరెక్టర్ గా వ్యవహరించడంతో పాటు చేసిన అన్ని సినిమాలతో హిట్టు అందుకున్న శ్రీలీల కూడా నటిస్తూ ఉండడంతో ఈ సినిమా హిట్ అవుతుందని నందమూరి బాలకృష్ణ అభిమానులైతే భావిస్తున్నారు.

 Nandamuri Balakrishna

ఈ సినిమా షూటింగ్ చివరి దశకు రావడంతో ఈ సినిమా పూర్తి అయిన వెంటనే నందమూరి బాలకృష్ణ.. బాబీ దర్శకత్వంలోకి సినిమా చేయబోతున్నాడు. నందమూరి బాలకృష్ణ కెరియర్ లో 105 వ సినిమాగా తెరకెక్కబోతున్న ఈ సినిమాలో నందమూరి బాలకృష్ణను అభిమానులు ఎలా చూడాలనుకుంటారో అలా చూపించేందుకు బాబీ సిద్ధమవుతున్నాడు. బాబీ కూడా వాల్తేరు వీరయ్యా లాంటి బ్లాక్ బాస్టర్ హిట్ అందుకుని ఉండడంతో ఆ సినిమాకి కూడా డోకా లేదని బాలయ్య అభిమానులు ఫిక్స్ అయ్యారు.

అయితే ఇప్పుడు టాలీవుడ్ వర్గాల్లో సరికొత్త ప్రచారం తెర మీదకు వచ్చింది. అదేమిటంటే బాబీతో సినిమా పూర్తి చేసిన తర్వాత నందమూరి బాలకృష్ణ ఒక పాన్ ఇండియా ప్రాజెక్ట్ చేయబోతున్నాడని టాక్ వినిపిస్తోంది. ఆ పాన్ ఇండియా ప్రాజెక్ట్ డైరెక్ట్ చేయబోయేది కూడా ఇప్పుడు ఒక పాన్ ఇండియా సినిమాతో లాంచ్ అవ్వబోతున్న డైరెక్టర్ అని తెలుస్తోంది. ఆ డైరెక్టర్ మరెవరో కాదు... ప్రశాంత్ వర్మ.

ప్రశాంత్ వర్మ చేసిన మొదటి సినిమాతోనే విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఆయన రెండో సినిమాగా రాజశేఖర్ హీరోగా కల్కీ సినిమా చేశాడు. కానీ ఆ సినిమా పెద్దగా వర్క్ అవుట్ అవ్వలేదు. ఇప్పుడు ఆయన తేజ హీరోగా ఒక పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు. హనుమాన్ పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమా ఇప్పటికే అందరికీ మోస్ట్ అవైటెడ్ మూవీ అయిపోయింది.

 Nandamuri Balakrishna

ఇక హనుమాన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన తర్వాత ప్రశాంత్ వర్మ.. బాలకృష్ణతో ఒక పాన్ ఇండియా మూవీ చేయాలని భావించారు. ఈ మేరకు ఆయనను సంప్రదించగా బాలకృష్ణ కూడా ఆయన చెప్పిన కథ నచ్చిందని తెలుస్తోంది. బాబీ సినిమా పూర్తి అయిన వెంటనే ప్రశాంత్ వర్మ నందమూరి బాలకృష్ణ సినిమా పట్టాలెక్కే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X