మహేష్ బాబుకు బాలయ్య ఫోన్.. వదిలేలా లేడుగా!

Recommended Video

Nandamuri Balakrishna Asks Mahesh To NTR Biopic

ఎన్టీఆర్ బయోపిక్ లో సూపర్ స్టార్ మహేష్ ని నటింపజేసేందుకు చాలా రోజుల క్రితమే బాలయ్య ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు వార్తలు వచ్చాయి. ఆ ప్రయత్నంలో మరో ముందడుగు పడ్డట్లు తెలుస్తోంది. మహేష్ ని ఎలాగైనా ఒప్పించాలని బాలయ్య డిసైడ్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. ఎన్టీఆర్ బయోపిక్ చిత్రంలో మహేష్ నటిస్తే అంచనాలు మరో స్థాయికి చేరుతాయనేది వాస్తవం. అదే సమయంలో సూపర్ స్టార్ కృష్ణ పాత్ర కూడా కీలకం అని బాలయ్యతో పాటు దర్శకుడు క్రిష్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

మహేష్ బాబుకు ఫోన్

మహేష్ బాబుకు ఫోన్

తాజాగా చిత్ర వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం మహేష్ బాబుకు బాలయ్య ఫోన్ చేశారట. ఎన్టీఆర్ బయోపిక్ చిత్రంలో కృష్ణ పాత్రలో నటించాలాలని కోరినట్లు తెలుస్తోంది. దీనితో త్వరలోనే తన నిర్ణయాన్ని ప్రకటిస్తానని బాలయ్యకు మహేష్ చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ వార్తల్లో ఎంతవరకు వాస్తవం ఉందో తేలాల్సి ఉంది.

చిన్న అవకాశం కూడా

చిన్న అవకాశం కూడా

ఎన్టీఆర్ బయోపిక్ చిత్రం జనరంజకంగా ఉండేందుకు బాలయ్య చిన్న అవకాశాన్ని కూడా విడిచిపెట్టడం లేదు. ఎన్టీఆర్ జీవితంలో ముడిపడి ఉన్న పాత్రలన్నింటికీ ఈ చిత్రంలో చూపించబోతున్నారు. ప్రముఖ నటీనటులంతా ఈ చిత్రంలో కీలక పాత్రల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే.

కృష్ణ, ఎన్టీఆర్ మధ్య

కృష్ణ, ఎన్టీఆర్ మధ్య

కృష్ణ, ఎన్టీఆర్ స్నేహితులే అయినప్పటికీ వీరి మధ్య కొన్ని విభేదాలు ఉన్నట్లు చాలా మంది చెబుతుంటారు. సినిమాల పరంగా కూడా వీరి మధ్య పోటీ కొనసాగింది. అలాంటి పాత్ర ఎన్టీఆర్ బయోపిక్ చిత్రంలో తప్పనిసరిగా ఉండాలనేది బాలయ్య కోరిక.

 విడి విడిగా

విడి విడిగా

ఎన్టీఆర్ బయోపిక్ చిత్రాన్ని రెండు భాగాలుగా విడుదల చేయనున్నారు. ఎన్టీఆర్ సినీ జీవితాన్ని, రాజకీయ జీవితాన్ని వేరు చేసి ఎన్టీఆర్ కథానాయకుడు మొదటి భాగంగా. ఎన్టీఆర్ మహా నాయకుడు రెండవ భాగంగా రూపొందిస్తున్నారు. సంక్రాంతి కానుకగా తొలి భాగం ఎన్టీఆర్ కథానాయకుడు విడుదల కానుంది. దర్శకుడు క్రిష్ షూటింగ్ శరవేగంగా జరుపుతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X