ఎన్టీఆర్ రోల్ కోసం బాలయ్య.. నందమూరి నటసింహం ఏమన్నారంటే?
తండ్రి ఎన్టీఆర్ రోల్ కోసం బాలకృష్ణను సంప్రదించారట 'తలైవి' దర్శకనిర్మాతలు. అయితే ఈ సినిమాలో నటించేందుకు గాను ఆయన సుముఖత చూపలేదని తెలుస్తోంది. తనను సంప్రదించిన దర్శకనిర్మాతలకు కారణాలేవీ చెప్పకుండా సున్నితంగా నో చెప్పేశారని విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్న సమాచారం.
ఎ.ఎల్. విజయ్ దర్శకత్వంలో దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్ రూపొందుతోంది. 'తలైవి' పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కంగనా రనౌత్ కీలకపాత్ర పోషిస్తుండగా.. అరవింద్ స్వామి, ప్రకాశ్ రాజ్ ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. అయితే ఈ బయోపిక్ లో ఎన్టీఆర్‌కి సంబంధించి కొన్ని సన్నివేశాలు పెట్టారట.

అప్పట్లో జయలలితతో కలిసి ఎన్టీఆర్ కొన్ని సినిమాల్లో నటించారు. ఆ కారణంగా ఈ మూవీలో ఎన్టీఆర్ పాత్రను కూడా ఉంచారట. అయితే ఆ పాత్రకు బాలకృష్ణ అయితేనే కరెక్ట్ గా సూట్ అవుతారని భావించిన నిర్మాతలు ఆయన్ను సంప్రదిస్తే నో అనే సమాధానం వచ్చిందని తెలుస్తోంది. సో.. చూడాలి మరి 'తలైవి' సినిమాలో ఎన్టీఆర్ పాత్రను వేరేవారితోనైనా చేయిస్తారా? లేదంటే తొలగిస్తారా? అనేది.
మరోవైపు బాలకృష్ణ- బోయపాటి శ్రీను కాంబోలో కొత్త చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. కరోనా విజృంభణ నేపథ్యంలో ఈ సినిమా షూటింగ్ కొన్ని రోజులపాటు వాయిదా వేశారు.


Click it and Unblock the Notifications











