Balakrishna: బాబీ సినిమాలో బాలయ్య పాత్ర లీక్.. నెవర్ బిఫోర్ భయ్యా!
నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. గతంలో ఆయన చేసిన అఖండ, వీర సింహారెడ్డి సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్లు కావడంతో ఇప్పుడు చేస్తున్న ఆయన సినిమాల మీద ప్రేక్షకులలో అంచనాలు ఏర్పడుతున్నాయి. అయితే ఆయన బాబితో కలిసి చేయబోతున్న ఒక సినిమాకి సంబంధించి ఒక ఆసక్తికర ప్రచారం అయితే టాలీవుడ్ వర్గాల్లో జరుగుతోంది. అసలా ప్రచారం ఏమిటి? అసలు సంగతి ఏమిటి? అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో 'భగవంతు కేసరి' అనే సినిమా చేస్తున్నాడు. పూర్తిస్థాయి తెలంగాణ యాస భాషతో ఈ సినిమాలో నందమూరి బాలకృష్ణ కనిపిస్తాడని ముందు నుంచి ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాలో బాలకృష్ణ సరసన హీరోయిన్ గా కాజల్ అగర్వాల్ నటిస్తుండగా వీరి కుమార్తెగా యంగ్ హీరోయిన్ శ్రీ లీల నటిస్తుందని ప్రచారం జరుగుతోంది. ఇక ఈ సినిమాకి సంబంధించి ఇప్పటికే షూటింగ్ దాదాపు పూర్తిగా వచ్చింది.

అక్టోబర్ నెలలో దసరా సందర్భంగా ప్రేక్షకులు ముందుకు తీసుకువచ్చేందుకు ప్రణాళికలు అయితే సిద్ధం చేస్తున్నారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్ మీద హరీష్ పెద్ది, సాహు గారపాటి నిర్మిస్తున్న ఈ సినిమా మీద కేవలం బాలకృష్ణ అభిమానులు మాత్రమే కాదు. తెలుగు సినీ అభిమానులందరూ చాలా అంచనాలు పెట్టుకున్నారు. ఇక ఆ సంగతి అలా ఉంచితే ఈ సినిమా పూర్తి అయిన వెంటనే నందమూరి బాలకృష్ణ డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో ఒక సినిమా చేయాల్సి ఉంది.
వాస్తవానికి ఇది పల్నాడు ప్రాంతంలో జరిగిన ఒక నిజ జీవిత ఘటనను ఆధారంగా చేసుకుని తెరకెక్కిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. కానీ ఇప్పుడు టాలీవుడ్ వర్గాల్లో మరో సరికొత్త ప్రచారం తెరమీదకు వచ్చింది. అదేమంటే ఈ సినిమాలో నందమూరి బాలకృష్ణకు ఒక జబ్బు ఉంటుందని అంటున్నారు. జబ్బు అంటే అదేంటో అనుకునేరు మతిమరుపు జబ్బు.
గతంలో మతిమరుపు కాన్సెప్ట్ మీద ఎన్నో సినిమాలు వచ్చాయి. కానీ ఈ సినిమాని మాత్రం యాక్షన్ కామెడీ ఎంటర్టైనర్ గా బాబీ డైరెక్ట్ చేస్తున్నాడని చెబుతున్నారు. నందమూరి బాలకృష్ణ మునుపెన్నడూ కనిపించని ఒక మాస్ అప్పీల్ తో ఈ సినిమాలో కనిపిస్తాడని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. అయితే ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుండగా హీరోయిన్ ఎవరు అలాగే ఇతర నటీనటులు ఎవరు అనే విషయం మాత్రం అధికారికంగా క్లారిటీ లేదు .
అయితే నిజానికి నందమూరి బాలకృష్ణ గతంలో కూడా ఒక సినిమాలో మతిమరుపు వ్యక్తిగా నటించాడు. కాకతీయ పూర్తిగా గతం మర్చిపోయి కొత్త జీవితాన్ని ప్రారంభించిన వ్యక్తిగా కనిపించాడు. అయితే మరి ఈ సినిమాలో నందమూరి బాలకృష్ణను ఎలాంటి పాత్రలో నటింప చేస్తాడు అనే విషయం మీద మాత్రం చర్చ జరుగుతోంది. అయితే ఈ సినిమా రిలీజ్ అయ్యే వరకు ఈ ప్రచారం నిజమా కాదా అనే విషయం మీద క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపించడం లేదు.


Click it and Unblock the Notifications











