ఎమ్మెల్యేతో యంగ్ హీరోయిన్ రొమాన్స్.. హాట్ టాపిక్‌గా మారిన ఇష్యూ
సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ సినీ, రాజకీయ రంగాల్లో తన సత్తా చాటుతూ వస్తున్నారు. సినిమాల పరంగా ఇటీవలే తన తండ్రి బయోపిక్ రూపొందించిన బాలయ్య బాబు రాజకీయాల పరంగా మరోసారి ఎమ్మెల్యే అయ్యారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగు దేశం పార్టీ ఘోర పరాజయం సాధించినప్పటికీ బాలకృష్ణ మాత్రం బయటపడ్డాడు. హిందూపురం తనదే అని మరోసారి చాటిచెప్పారు. ఈ జోష్ లోనే బాలకృష్ణ ఇక సెట్స్ పై వాలి హీరోయిన్స్ తో సరసాలాడేందుకు రెడీ అవుతున్నారు. అయితే బాలకృష్ణ నటించబోతున్న కొత్త సినిమాలో ఆయనతో రొమాన్స్ చేయబోయే అమ్మడి గురించిన తాజా అప్‌డేట్ ప్రస్తుతం హాట్ టాపిక్ అవుతోంది.
ఎన్టీఆర్ బయోపిక్ లో వరుస పెట్టి హీరోయిన్లను గిలిగింతలు పెట్టిన బాలయ్య బాబు.. తన తర్వాతి సినిమాలో కుర్ర హీరోయిన్ మెహ్రీన్ తో రొమాన్స్ చేయనున్నారట. బాలయ్య బాబు తదుపరి చిత్రానికి కేఎస్ రవికుమార్ దర్శకత్వం వహించనున్న సంగతి తెలిసిందే. వచ్చే నెల మొదటి వారంలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ఇందులో బాలయ్య పక్కన మెహ్రీన్ దాదాపుగా కన్ఫర్మ్ అయిపోయిందని ఫిలిం నగర్ టాక్. ఇదే నిజమైతే మెహ్రీన్ కి ఇది బంపర్ ఆఫర్ అనే చెప్పుకోవచ్చు.

ఇటీవలే సీనియర్ హీరో వెంకటేష్‌తో ఎఫ్ 2 సినిమాలో తెర పంచుకున్న మెహ్రీన్ కాస్త మంచి పేరు తెచ్చుకుంది. పెద్ద హీరో సినిమాల్లో ఏ మాత్రం అందం, అభినయం చూపించినా అది సదరు హీరోయిన్ కి బాగా ప్లస్ అవుతుంది. ఎఫ్ 2 విషయంలో మెహ్రీన్‌కి అదే జరిగింది. ఇక ఇప్పుడు బాలయ్య సరసన అనే టాక్ వినిపిస్తోంది. ఇదే నిజమైతే మాత్రం మెహ్రీన్ స్టార్ హీరోయిన్‌గా అవతరించడం ఖాయమేనండోయ్! మరోవైపు మరికొద్ది రోజుల్లోనే కెఎస్ రవికుమార్ ఈ చిత్రానికి సంబందించిన నటీనటుల వివరాలు అఫీషియల్ గా ప్రకటించనున్నారని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











