బాలయ్య 102 సినిమా స్టోరీ లీక్.. నెట్‌లో హల్‌చల్ చేస్తున్న కథ ఇదే..
ప్రస్తుతం నయనతారతో కలసి బాలయ్య బాబు 102వ చిత్రం చేస్తున్నాడు. అయితే ఈ చిత్ర షూటింగ్ కూడా ప్రారంభమై... శరవేగంతో చిత్ర నిర్మాణం జరుగుతోంది. అయితే అంతా సజావుగానే సాగుతోంది కదా... ఇంకా ట్విస్ట్ ఏంటీ అని
Recommended Video

నందమూరి బాలకృష్ణ వందో చిత్రం గౌతమీ పుత్ర శతకర్ణి ఘన విజయం సాధించింది. అలాగే అదే ఊపు అదే ఉత్సాహంతో 101 సినిమా పైసా వసూల్ చిత్రంలో కూడా బాలకృష్ణ నటన పరంగా ఇరగదీశాడు. ప్రస్తుతం నయనతారతో కలసి బాలయ్య బాబు 102వ చిత్రం చేస్తున్నాడు. అయితే ఈ చిత్ర షూటింగ్ కూడా ప్రారంభమై... శరవేగంతో చిత్ర నిర్మాణం జరుగుతోంది. అయితే అంతా సజావుగానే సాగుతోంది కదా... ఇంకా ట్విస్ట్ ఏంటీ అని అనుకుంటున్నారా? ఈ చిత్రానికి సంబంధించిన కథ ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అది ఏమీటంటే..

బాలయ్య, నయనతార లవ్
లీకైన కథనం ప్రకారం... 102వ సినిమాలో బాలకృష్ణ, నయనతార ఒకరినొకరు గాఢంగా ప్రేమించుకొంటారు. పెళ్లి కూడా చేసుకోవాలని అనుకుంటారట. కానీ ఇంతలో అనుకోని కొన్ని సంఘటనలు చోటు చేసుకుంటాయి. దాంతో వారిద్దరు విడిపోతారట. తన ప్రేమికురాలి కోసం వెతికేందుకు బాలయ్య ఎంతగానో ప్రయత్నిస్తాడు. కానీ చివరికి ఆమె దక్కదు.

నయనతారకు మరో వ్యక్తితో వివాహం..
కట్ చేస్తే.. నయనతారకి మరొకరితో వివాహం జరిగిపోతుంది. ఆమెకు ఓ కూతురు పుడుతోంది. అలా 20 ఏళ్లు గడిచిపోతాయి. అయితే నయనతార కూతురి వెంట కొందరు విలన్లు పడతారు. ఆమె వారి నుంచి తప్పించుకుంటుంది. ఆ క్రమంలో ఆమె... బాలయ్య చెంతకు చేరుతుంది. విలన్ల బారి నుంచి ఆమెను ఆయన రక్షిస్తాడు. తనకు ఎవరూ లేరని ఆ అమ్మాయి చెప్పడంతో తానే తండ్రిగా చూసుకుంటానని ఆమెకు బాలయ్య హామీ ఇస్తాడు.

ఎందుకు విడిపోయినట్లు...
ఇంతకీ నయన్, బాలయ్యలు ఎందుకు విడిపోయారు? నయన్ ని పెళ్లాడిన మరో వ్యక్తి ఎవరు? అసలు కూతురు వెంటపడుతున్న ఆ విలన్లు ఎవరు? ఆమె బాలయ్య వద్దకు ఎలా చేరింది? నయన్ బతికే ఉందా? లేక చనిపోయిందా? తదితర అంశాలతో ఈ కథ సాగుతుందని తెలుస్తుంది.

బాలయ్య సరసన నటాషా...
గతంలో వినిపించిన స్టోరీ ప్రకారం.. బాలయ్యకు తల్లిగా నయనతార నటిస్తోందని.. మలయాళ నటి నటాషా ఆయన సరసన కథానాయికగా కనిపించనుందని ప్రచారం జరిగింది. కానీ తాజాగా వినిపిస్తున్న కథనం ప్రకారం అందులో వాస్తవం లేదని తెలుస్తోంది. నయనతార అతని భార్య కాగా.. నటాషా వారి కూతురని టాక్. కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నటాషా పాత్రే చాలా కీలకమని అంటున్నారు.

మునుపెన్నడూ కనిపించని పాత్రలో
ఇక బాలయ్య గతంలో మునుపెన్నడూ కనిపించని పాత్రలో నటిస్తున్నట్లు చెప్తున్నారు. మరి కానీ అంతర్జాలంలో ఈ కథనమే సినిమా స్టోరీనా? లేక మరో రకంగా కథ ఉంటుందా? అనేది తెలియాలంటే మాత్రం సదరు చిత్రం విడుదల వరకు వేచి ఉండాల్సిందే. కాగా మరో వైపు ఈ చిత్రానికి జయసింహ అనే టైటిల్ పెట్టనున్నట్లు ఫిల్మ్ నగర్ లో వైరల్ అవుతుంది.

లీకువీరులు...
‘లీకు‘ వీరుల పుణ్యమా అని ఈ మధ్య సినిమా కథలు సెట్స్ మీదకి వెళ్లిన కొద్దిరోజుల్లోనే లీకైపోతున్నాయి. చిత్ర యూనిట్ లు ఎంత పకడ్బందీగా జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ... ఎలాగోలా గుట్టుచప్పుడు కాకుండా స్టోరీ బయటకు వెళ్లిపోతున్నాయి. యూనిట్ కి చెందిన వ్యక్తుల్లోనే తమ సన్నిహితులో సినిమా విశేషాలు పంచుకోవడం... అవి ఆ నోటా ఈ నోటా పాకి పోవడంతో చివరికీ ప్రపంచవ్యాప్తంగా తెలుగు ప్రేక్షకులకు చేరిపోవడం జరుగుతోంది.

రిలీజ్ ముందే..
ఏకంగా సినిమాలే రిలీజ్ కు ముందు లీకైపోతుంటే... ఇక కథల సంగతి ఎంతా? ఇలా లీకేజ్ బారినపడిన చిత్రాల జాబితాలో తాజాగా బాలయ్య 102 చిత్రం కూడా చేరిపోయింది. ఈ చిత్ర షూటింగ్ మొదలై కొద్ది రోజులే అయింది. ఇంతలో స్టోరీ మొత్తం లీకైపోయిందని పుకార్లు షికార్లు చేస్తున్నాయి.


Click it and Unblock the Notifications











