ఇంట్రెస్టింగ్ అప్‌డేట్.. ఇద్దరు భామలతో బ్యాంకాక్‌లో బాలయ్య
యంగ్ హీరోలతో పోటీ పడుతూ నందమూరి బాలకృష్ణ వరుస సినిమాలు చేస్తున్నాడు. గౌతమి పుత్ర శాతకర్ణి సినిమాతో సెంచరీ కొట్టేసిన ఈ వెటరన్ హీరో ఇటీవలే ఎన్టీఆర్ బయోపిక్ తో ప్రేక్షకుల ముందుకొచ్చారు. అయితే ఈ సినిమా తర్వాత ఎన్నికలు రావడం.. ఆ ఎన్నికల్లో బాలయ్య బాబు క్రియాశీలంగా పాల్గొనడం కారణంగా కొన్ని రోజులు సినిమాలకు దూరంగా ఉన్నారు.
ఇక ఈ మధ్యే తన తదుపరి సినిమాపై దృష్టి సారించిన బాలకృష్ణ.. కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో సినిమా చేసేందుకు సిద్దమయ్యాడు. బాలయ్య బాబు కెరీర్ లో 105 వ సినిమాగా రాబోతున్న ఈ చిత్రానికి సి.కల్యాణ్ నిర్మాతగా వ్యవహరించనున్నారు. ఎప్పటి నుంచో ఈ సినిమాకు సంబందించిన వార్తలు వస్తునప్పటికీ ఇంకా ఈ సినిమా మాత్రం సెట్స్ పైకి రాలేదు. అయితే తాజాగా ఈ సినిమా గురించిన ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ బయటకు వచ్చింది.

ఇటీవలే లాంఛనంగా ప్రారంభమైన ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఆగస్టు 9 వ తేదీన ప్రారంభం కానుందని తెలుస్తోంది. అది కూడా బ్యాంకాక్‌లో. ముందుగా చిత్రంలోని పాటల చిత్రీకరణ జరపాలని ప్లాన్ చేసిన చిత్రయూనిట్.. అందుకోసం బ్యాంకాక్ లోని అందమైన లొకేషన్స్‌కి బయల్దేరనున్నారట. అక్కడ ముందుగా బాలకృష్ణ, వేదిక, సోనాల్ చౌహన్‌లపై పాటలను చిత్రీకరిస్తారని టాక్.
ఇక 'రూలర్' టైటిల్ పరిశీలనలో ఉన్న ఈ చిత్రంలో బాలకృష్ణ రెండు డిఫెరెంట్ షేడ్స్ ఉన్న పాత్ర పోషించనున్నాడని సమాచారం. గతంలో బాలకృష్ణ- కెఎస్ రవికుమార్ కాంబినేషన్ లో వచ్చిన జైసింహా సూపర్ డూపర్ హిట్ కావడంతో ఈ సినిమాపై భారీగా అంచనాలు పెట్టుకున్నారు ప్రేక్షకులు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా బాలయ్య 105 విడుదల కానుందని అంటున్నారు.


Click it and Unblock the Notifications











