బాలయ్య బాబు దసరా ధమాకా.. ప్లాన్ భలే ఉందే..! నందమూరి ఫాన్స్‌కి గ్రేట్ ఆఫర్
నందమూరి నటసింహం బాలకృష్ణ ఓ షాకింగ్ డిసీజన్ తీసుకున్నారని తెలుస్తోంది. ఈ దసరాకు నందమూరి అభిమానుల్లో సరికొత్త జోష్ నింపాలనే కోణంలో ఈ డిసీజన్ తీసుకున్నారని సమాచారం. ఇందుకు సంబంధించిన న్యూస్ బయటకు రావడంతో ప్రేక్షక లోకంలో ఓ రకమైన ఆతృత నెలకొంది. ఇంతకీ బాలయ్య తీసుకున్న ఆ డిసీజన్ ఏంటి? వివరాల్లోకి పోతే..

సెంచరీ కొట్టిన బాలయ్య.. ఆ తర్వాత
గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాతో సెంచరీ కొట్టిన బాలయ్య బాబు ఆ తర్వాత కూడా తన వెండితెర ప్రయాణాన్ని సక్సెస్‌ఫుల్‌గా కొనసాగిస్తున్నారు. ఓ వైపు రాజకీయాలతో బిజీగా ఉంటూనే వరుస సినిమాలకు కమిట్ అవుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఇటీవల ఎన్టీఆర్ బయోపిక్ ద్వారా ప్రేక్షకుల ముందుకొచ్చిన బాలయ్య.. తన తదుపరి సినిమాలకు కేఎస్ రవికుమార్, బోయపాటి శ్రీనులతో ఓకే చేశారు.

ప్లాన్ చేసిన బాలయ్య.. ఫిక్స్
కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా రూపొందుతున్న సినిమా ఇప్పటికే షూటింగ్ ప్రారంభమైంది. దీంతో ఈ సారి దసరాకు బాలకృష్ణ నగారా మోగించాలని ప్లాన్ చేశారట నందమూరి నటసింహం. ఈ మేరకు తన కొత్త సినిమాల తాలూకు విశేషాలతో నందమూరి ఫాన్స్‌కి స్పెషల్ ట్రీట్ ఇవ్వాలని ఫిక్స్ అయ్యారట బాలయ్య బాబు.

అవి మాత్రమే కాదు.. ఇది కూడా
కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న తన తాజా సినిమా టైటిల్, ఫస్ట్‌లుక్, టీజర్ అన్నీ ఒకేసారి దసరా కానుకగా విడుదల చేయాలనేది బాలయ్య అసలు స్కెచ్ అని తెలుస్తోంది. అంతేకాదు వీటితో పాటు బోయపాటి శ్రీను దర్శకత్వంలో రానున్న సినిమా ప్రీ లుక్ కూడా రిలీజ్ చేయాలని అంతా సిద్ధం చేస్తున్నారట.

బాలయ్య ప్యాక్.. నందమూరి అభిమానులు ఖుషీ ఖుషీ
ఈ లెక్కన చూస్తే దసరా ధమాకాగా బాలయ్య ప్యాక్ వచ్చేస్తున్నట్లే కదా. సో నందమూరి అభిమానుల జోష్ ఇక పీక్ స్టేజ్‌కి వెళ్లిపోవడం ఖాయమే. టాలీవుడ్ ఆడియన్స్ అందరికీ ఇది దసరా స్పెషల్ ట్రీట్ అన్నట్లే. చూడాలి మరి ఈ వార్తల్లో నిజమెంత వరకు ఉందో.

బాలకృష్ణ డిఫెరెంట్ లుక్
కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో రాబోతున్న సినిమాలో బాలకృష్ణ డిఫెరెంట్ లుక్‌లో దర్శనమీయనున్నారు. ఇప్పటికే ఇందుకు సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. యంగ్ లుక్‌లో బాలయ్యబాబును చూసి షాకయ్యారు ప్రేక్షకులు. చిత్రంలో బాలకృష్ణ సరసన సోనాల్ చౌహాన్, వేదిక హీరోయిన్లుగా నటిస్తున్నారు.

జైసింహా హిట్ కాబట్టి..
గతంలో బాలకృష్ణ- కెఎస్ రవికుమార్ కాంబినేషన్ లో వచ్చిన `జైసింహా` సూపర్ డూపర్ హిట్ కావడంతో ఈ సినిమాపై భారీగా అంచనాలు పెట్టుకున్నారు ప్రేక్షకులు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా బాలయ్య ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు దర్శకనిర్మాతలు.


Click it and Unblock the Notifications











