బయ్యర్లకు బాలయ్య బంపర్ ఆఫర్.. తన ప్రతాపాన్ని చూపించేందుకే ఇలా డిసైడయ్యారా?
నందమూరి నటసింహం బాలకృష్ణ కొత్త సినిమా 'రూలర్'. కెఎస్ రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను భారీ హంగులతో సి.కల్యాణ్ నిర్మిస్తున్నారు. చిత్రంలో బాలకృష్ణ సరసన సోనాల్ చౌహాన్, వేదిక హీరోయిన్లుగా నటిస్తున్నారు. డిసెంబర్ 20న ఈ సినిమా విడుదల కానున్న నేపథ్యంలో బయ్యర్లకు బాలయ్య బంపర్ ఆఫర్ ఇచ్చినట్లుగా సమాచారం. మరి ఆ ఆఫర్ తాలూకు వివరాలేంటో చూద్దామా..

మొదటి నుంచే డిమాండ్ తక్కువ.. అందుకే!
సాధారణంగా బాలకృష్ణ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో కనిపించిన డిమాండ్ మరెక్కడా కనిపించదు. ముఖ్యంగా ఓవెర్సిస్ లో అయితే ఆయన సినిమాల ప్రభావమే ఉండదు. మొదటి నుంచి ఓవర్సీస్ బిజినెస్ పరంగా చాలా వీక్ ట్రాక్ రికార్డు నమోదు చేస్తూ వస్తున్నాయి బాలయ్య సినిమాలు. ఇప్పుడు ఆ ఎఫెక్ట్ రూలర్ సినిమాపై పడిందట.

'రూలర్' ప్రతాపాన్ని ఎలాగైనా దేశం హద్దులు దాటించాలని
తెలుగు రాష్ట్రాల్లో భారీ డిమాండ్ ఉన్నప్పటికీ ఓవర్సీస్ మార్కెట్‌లో 'రూలర్' సినిమా కొనే నాథుడే లేదని టాక్. దీంతో తమ 'రూలర్' ప్రతాపాన్ని ఎలాగైనా దేశం హద్దులు దాటించాలని సరికొత్త ప్లాన్ చేశారట మేకర్స్. ఈ మేరకు బయ్యర్లకు బాలయ్య బంపర్ ఆఫర్ అన్నట్లుగా ఓ ప్లాన్ చేశారట.

విదేశీ బయ్యర్లకు ఫ్రీగా హక్కులు
తమ 'రూలర్' సినిమా హక్కులను విదేశీ బయ్యర్లకు ఫ్రీగా ఇచ్చేందుకు రెడీ అయిందట. ఈ మేరకు వారి వద్ద ఒక్క రూపాయి కూడా తీసుకోవద్దని డిసైడ్ అయ్యారట. ఒకవేళ సినిమా బాగా కలెక్షన్స్ రాబట్టి లాభాల బాట పడితే ఆ లాభాల్లో వాటా పంచుకునేలా రూలర్ టీం ప్రణాళిక రచించిందట. చూడాలి మరి ఈ ప్లాన్ ఏ మేర వర్కవుట్ అవుతుందో!.
Recommended Video

రూలర్ హంగామా.. అడుగడుగో యాక్షన్ హీరో
ఇకపోతే ఇటీవలే రూలర్ సినిమా నుంచి ''అడుగడుగో యాక్షన్ హీరో'' అంటూ సాగిపోతున్నఫస్ట్ లిరికల్ సాంగ్ విడుదలై నందమూరి అభిమానుల్లో నూతనోత్సాహం నింపింది. కింగ్ ఆఫ్ జంగిల్‌లా వచ్చాడంటూ బాలకృష్ణను ఆకాశానికెత్తుతూ ఈ సాంగ్ సాగిపోతోంది. ఇక ఇందులో లుక్స్ పరంగా బాలకృష్ణ అదరగొట్టేశారు. ప్రస్తుతం ఈ సాంగ్ నెట్టింట హల్చల్ చేస్తోంది.


Click it and Unblock the Notifications











