Balakrishna Gift for Ram Charan Twins: చిరంజీవి వారసులకి బాలయ్య స్పెషల్ గిఫ్ట్స్? రాంచరణ్ బిడ్డలకు ఏమిచ్చారంటే

మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ - ఉపాసన దంపతులకు ఇటీవల కవల పిల్లలు జన్మించిన సంగతి తెలిసిందే. జనవరి 31వ తేదీన అపోలో ఆసుపత్రిలో పండంటి కవలలకు ఉపాసన జన్మనిచ్చారు. కవలల్లో బాబు, పాప ఉండటంతో మెగా ఫ్యామిలీ సంబరాలు చేసుకుంటోంది. మెగా వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లేలా చరణ్‌కు వారసుడు రావడంతో చిరంజీవి ఫుల్ జోష్‌లో ఉన్నారు. సినీ ప్రముఖులు, అభిమానులు రామ్ చరణ్ - ఉపాసన దంపతులకు విషెస్ తెలియజేస్తున్నారు. తాజాగా టాలీవుడ్ అగ్రనటుడు నందమూరి బాలకృష్ణ కూడా చరణ్ దంపతులకు విషెస్ తెలియజేయడంతో పాటు చిరంజీవి వారసులకు స్పెషల్ గిఫ్ట్స్ పంపించినట్లుగా ఓ వార్త చక్కర్లు కొడుతోంది. ఈ వివరాల్లోకి వెళితే..

టాలీవుడ్‌లో మెగా vs నందమూరి
తెలుగు చిత్ర పరిశ్రమలో మెగా - నందమూరి కుటుంబాల మధ్య ఉన్న పోటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పెద్ద ఎన్టీఆర్‌ నుంచి నేడు జూనియర్ ఎన్టీఆర్ వరకు ఈ రెండు కుటుంబాలు సినిమాల విషయంలో ఢీ అంటే ఢీ అనుకుంటున్నాయి. అయితే ఇది కేవలం వృత్తిపరమైన పోటీ, సినిమాల వరకే పరిమితం మాత్రమే. స్వతహాగా రెండు కుటుంబాలు ఎంతో సన్నిహితంగా ఉంటాయి. ఎన్టీ రామారావుతో చిరంజీవి కలిసి సినిమాలు చేయడంతో పాటు ఎంతో గౌరవించి తన సినిమాల ప్రారంభోత్సవాలు, ఇతర కార్యక్రమాలకు ఎన్టీఆర్‌ను ఆహ్వానించేవారు చిరు.

Nandamuri Balakrishna Sends Special Gifts to Ram Charan Upasana s Newborn Twins

అన్నదమ్ముల్లా చిరు బాలయ్య
ఎన్టీఆర్ తర్వాత ఆయన కుమారులు బాలకృష్ణ, హరికృష్ణలతోనూ అన్నదమ్ముల మాదిరిగా కలిసిపోయారు చిరంజీవి. ఇరు కుటుంబాల్లో ఏ శుభకార్యం జరిగినా ఖచ్చితంగా అంతా హాజరవుతారు. ఇటీవల బాలకృష్ణ 50 ఏళ్ల వేడుకకు చిరంజీవి ముఖ్య అతిథిగా విచ్చేసి.. బాలయ్యతో ఓ సినిమా చేయాలని ఉందని తన మనసులోని మాటను తెలియజేశారు. చిరంజీవి మాత్రమే కాదు.. మెగా ఫ్యామిలీలోని నాగబాబు, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, రామ్ చరణ్‌లు కూడా నందమూరి కుటుంబంతో ఆత్మీయంగా మెలుగుతున్నారు. బాలకృష్ణ హోస్ట్‌గా ఆహాలో ప్రసారమవుతున్న అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే షోకు పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, రామ్ చరణ్‌లు హాజరై బాలయ్యతో తమ అనుబంధాన్ని చాటుకున్నారు. ఇక నందమూరి వారి అల్లుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ భాగస్వామి అన్న సంగతి తెలిసిందే.

బాలయ్యతో చరణ్‌కు అనుబంధం
ఇక రామ్ చరణ్‌ కూడా తన తండ్రిలాగే నందమూరి కుటుంబంతోనూ, బాలకృష్ణతోనూ ఎంతో సన్నిహితంగా మెలుగుతారు. చరణ్ దంపతులకు కవల పిల్లలు పుట్టినట్లు తెలుసుకున్న బాలకృష్ణ ఎంతో సంతోషించినట్లుగా ఫిలింనగర్‌లో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వెంటనే చరణ్‌కు ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలియజేయడంతో పాటు పిల్లలిద్దరికీ బాలకృష్ణ కానుకలు పంపించినట్లుగా వార్తలు వస్తున్నాయి. దాంతో బాలయ్య ఏం గిఫ్ట్స్ పంపించారు? అవి ఏంటి అంటూ సామాజిక మాధ్యమాల్లో చర్చ జరుగుతోంది.

చరణ్ పిల్లలకు బాలయ్య కానుకలు?
టాలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం.. రామ్ చరణ్ - ఉపాసనలకు బాలకృష్ణ పంపించిన కానుకల్లో పూల బొకేతో పాటు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి చిత్రపటం, తిరుమల శ్రీవారి ప్రసాదం, పిల్లలకు బొమ్మలు, మరికొన్ని గిఫ్ట్స్ ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే బాలకృష్ణ ఇలా మెగా కుటుంబానికి కానుకలు పంపడం ఇదే తొలిసారి కాదట. మెగా ఫ్యామిలీలో శుభకార్యాలు జరిగినప్పుడల్లా బాలకృష్ణ బహుమతులు పంపినట్లుగా సినీ జనాలు చెబుతున్నారు. అంతేకాదు.. బాలయ్య గురించి ఇండస్ట్రీలో ఒక సెంటిమెంట్ కూడా ఉంది. బాలయ్య ఆశీర్వాదాలు, ఏదైనా బహుమతులు వస్తే మంచి జరుగుతుందనే నమ్మకం ఉంది. బాలకృష్ణ కూడా తన సన్నిహితులు, మిత్రులకు ఇలాగే పంపిస్తారని చెబుతున్నారు. మరి నిజంగానే రామ్ చరణ్ - ఉపాసనల పిల్లలకు బాలకృష్ణ కానుకలు పంపారా? లేక ఇదంతా కేవలం ఊహాగానాలు మాత్రమేనా అన్నది తెలియాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X