Balakrishna: సినిమాల్లోకి మోక్షజ్ఞ ఎంట్రీ.. నందమూరి బాలయ్య సంచలన నిర్ణయం

ఐదారు సంవత్సరాల నుంచి తెలుగు సినీ పరిశ్రమలో పెండింగ్ వార్త ఏదన్నా ఉందా? అంటే అది నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ సిల్వర్ స్క్రీన్ ఎంట్రీనే. ఆయన తెరంగేట్రం గురించి ఇప్పుటికే చిత్రసీమలో జోరుగా ఊహాగానాలు నడుస్తునే ఉన్నాయి. అయితే తాజాగా మోక్షజ్ఞ అరంగేట్రం గురించి మరో వార్త బయటకు వచ్చింది. దీన్ని బట్టి ఆయన ఎంట్రీ ఇచ్చే సమయం దగ్గరపడిందని అర్థమైంది. దాని గురించే ఈ కథనం..

గత కొన్నేళ్లుగా టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో లేదా సినీ ప్రేక్షకుల్లో రెగ్యులర్​గా మాట్లాడుకునే విషయం ఏదైనా ఉందంటే అది నటసింహం బాలయ్య కొడుకు మోక్షజ్ఞ ఎంట్రీ గురించే. ఈయన అరంగేట్రం కోసం నందమూరి అభిమానులు ఎన్నో ఏళ్ల నుంచి కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తూనే ఉన్నారు. మోక్షజ్ఞ తన తొలి సినిమాను ఏ దర్శకుడితో చేస్తారు? ఏ బ్యానర్​లో నటిస్తారు? నిర్మాత ఎవరు? అని ఎన్నో ప్రశ్నలు వారి మదిలో మెదులుతూనే ఉన్నాయి.

Nandamuri Balakrishna sensational decision on MokshagnaTeja Debut movie full Details here

ఈ క్రమంలోనే ఇదిగో వచ్చేస్తున్నాడు.. అదుగో వచ్చేస్తున్నాడు.. అంటూ ఎన్నో గాసిప్ వచ్చాయనే​ తప్ప ఇంత వరకు దీనిపై ఓ క్లారిటీ మాత్రం రాలేదు. ఆదిత్య 369 సీక్వెల్​ ఆదిత్య 999తో వస్తారని, ఆ తర్వాత పూరీ జగన్నాథ్, బోయపాటి శ్రీను, అనిల్​ రావిపూడి ఇలా ఎన్నో దర్శకుల పేర్లు పుకార్లుగా వినిపించాయి. కానీ ఒక్కటి నిజం అవ్వలేదు. అయితే మరోవైపు బాలయ్య మాత్రం వరుస సినిమాలు చేస్తూ బ్లాక్ బాస్టర్ హిట్లను ఖాతాలో వేసుకుంటున్నారు.

దీంతో అభిమానులు మోక్షజ్ఞకు అరంగేట్ర మోక్షం ఎప్పుడు వస్తుందా అని ఇంకా ఎదురు చూస్తూనే ఉన్నారు. అలానే ఆయన ఎంట్రీ ఇస్తే చాలు అది ఎలాంటి చిత్రమైనా అయినా పర్లేదు హిట్ చేసే బాధ్యత తమదే అంటున్నారు నందమూరి ఫ్యాన్స్. అయితే తాజాగా నందమూరి కాంపౌండ్ నుంచి ఓ వార్త నెట్టింట్లో లీకై బాగా చక్కర్లు కొడుతోంది. అదేంటంటే బాలయ్య ప్రస్తుతం ఓ వైపు సినిమాలతో పాటు రాజకీయాల్లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. త్వరలోనే ఎన్నికలు కూడా జరగబోతున్నాయి. ఈ ఎలక్షన్స్​లో ఆయన ఎలాగో భారీ మెజారిటీతో గెలవడం పక్క అని అంతా ఆశిస్తున్నారు.

Nandamuri Balakrishna sensational decision on MokshagnaTeja Debut movie full Details here

అయితే ఈ సారి మాత్రం గెలిచాక బాలయ్య రాజకీయాల్లో మరింత బిజీ అవుతారని టాక్ వినిపిస్తోంది. అదే సమయంలో సినిమాలపై మునపటి కన్నా కాస్త వేగం తగ్గించే అవకాశముందని టాక్​. ఈ క్రమంలోనే తన వారసుడిని మోక్షజ్ఞ ఎంట్రీ ఇచ్చేలా ప్లాన్ చేస్తున్నారని తెలిసింది. ఇందు కోసం సర్వం సిద్ధం చేసినట్లు తెలుస్తుంది. ఇప్పటికే సినీ ఇండస్ట్రీలోని పలువరితో ఈ విషయంపై మాట్లాడారట! త్వరలోనే మోక్షజ్ఞ ఎంట్రీకి సంబంధించి అఫీషియల్​గా అనౌన్స్​ చేయబోతున్నారని టాక్​ కాస్త గట్టిగానే వినిపిస్తోంది. సో దీని బట్టి మోక్షజ్ఞ ఎంట్రీ సమయం చాలా దగ్గర పడిందని అభిమానులు ఆశిస్తున్నారు. కాస్త హ్యాపీగా భావిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X