Balakrishna: బాబీకి బాలయ్య షాక్ అంటూ ప్రచారం.. అసలు సంగతి ఏంటంటే?

నందమూరి బాలకృష్ణ.. ఫుల్ జోష్ మీద ఉన్న సంగతి తెలిసిందే. ఆయన అనిల్ రావిపూడి దర్శకత్వంలో భగవంత్ కేసరి సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా దసరా కానుకగా రిలీజ్ కు సిద్ధంగా ఉంది. ఈ సినిమా తర్వాత బాబీ దర్శకత్వంలో ఓ మూవీ చేయాల్సి ఉంది. అయితే ఈ మూవీ గురించి ఓ షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. బాలయ్య.. ఏకంగా బాబీకి షాక్ ఇచ్చాడని ప్రచారం జరుగుతోంది. ఇక దీనిపై చిత్ర యూనిట్ స్పందించింది. అదేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

కరోనా టైం నుంచి బాలయ్యకు కలిసివస్తోందని చెప్పవచ్చు. థియేటర్లకు జనాలు వస్తారా రారా అంటూ దర్శకనిర్మాతలు సినిమాలు రిలీజ్ చేసేందుకు భయపడుతుంటే.. ఒక్క బాలయ్య మాత్రం.. అఖండ అనే సినిమాతో వచ్చి అదరగొట్టాడు. ఏకంగా వందకోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టాడు. ఇక అలా చిత్ర పరిశ్రమకు దైర్యాన్ని ఇచ్చిన బాలయ్య.. ఆ తర్వాత అన్ స్టాపపబుల్ షోతో ప్రేక్షకులకు మరింత చేరువయ్యారు. ఇక ఈ షో సక్సెస్ కావడంతో.. రెండో సీజన్ కూడా ప్లాన్ చేయగా.. అది కూడా సూపర్ హిట్టుగా నిలిచింది.

Nandamuri Balakrishna shock to director Bobby News Goes Viral

ఇక ఈ ఏడాది ప్రారంభంలో బాలయ్య.. వీరసింహారెడ్డి అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇక ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. చిరు వాల్తేరు వీరయ్యకు పోటీగా.. వీర సింహారెడ్డి కలెక్షన్లు వసూలు చేసింది. ఇక బాలయ్య హ్యాట్రిక్ పై కన్నేశాడు. అందుకే సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలయ్య భగవంత్ కేసరి అనే చేస్తున్నారు.

భగవంత్ కేసరి సినిమాలో బాలయ్య సరసన కాజల్ ఆగర్వాల్ నటిస్తుండగా.. శ్రీలీల కూతురి పాత్రలో నటిస్తుందని ప్రచారం సాగుతోంది. ఇక ఇప్పటికే రిలిజ్ చేసిన టీజర్, పోస్టర్స్ ఆకట్టుకుంటున్నాయి. ఇక ఈ మూవీ దసరా కానుకగా.. అక్టోబర్ 17న రిలీజ్ చేయనున్నారు మేకర్స్. ఇక ఈ మూవీ హిట్ అయితే బాలయ్య హ్యాట్రిక్ కొడతాడు. ఇక ఈమూవీలో బాలయ్యను మునుపెన్నడూ చూడని పాత్రలో చూడనున్నమని తెలుస్తోంది. ఇప్పటికే తెలంగాణ యాసలో బాలయ్య చెప్పిన డైలాగ్స్ అదుర్స్ అనిపించాయి.

Nandamuri Balakrishna shock to director Bobby News Goes Viral

ఈ మూవీ తర్వాత బాబీ దర్శకత్వంలో బాలయ్య ఓ సినిమా చేయనున్నట్లు ప్రకటించారు. ఆయన బర్త్ డే సందర్భంగా ఈ మూవీ లాంఛనంగా ప్రారంభం అయింది. అయితే ఈ మూవీ పిరియాడిక్ కథతో తెరకెక్కనుందని ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్ ఆధారంగా తెలుస్తోంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ స్టోరీ బాలయ్యకు నచ్చలేదని ప్రచారం జరుగుతోంది. దీనితో ఈ మూవీ క్యాన్సిల్ అయిందనే న్యూస్ వినిపిస్తోంది. ఇందులో ఎంత నిజం ఉంది అనేది అధికారిక ప్రకటన వచ్చే వరకు తెలియదు.

Nandamuri Balakrishna shock to director Bobby News Goes Viral

ఇక ప్రస్తుతం బాలయ్య తన నెక్ట్స్ మూవీ కోసం కథ వెతుకుతున్నారని ట్విట్టర్ లో వైరల్ అవుతోంది. దీంతో బాబీకి బాలయ్య షాక్ ఇచ్చాడంటూ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ ఈ సినిమాపై ఓ క్లారిటీ ఇచ్చింది. బాలయ్యకు కథ నచ్చలేదనే ప్రచారం అబద్ధమంటూ తేల్చిచెప్పింది. ఇక ఈ మూవీ షూటింగ్ వచ్చే నెలలో ప్రారంభం కానున్నట్లు స్పష్టం చేసింది. దీనితో బాలయ్య, బాబీ మూవీ ఉండనుందని అర్ధం అవుతోంది. ఇక ఈ మూవీ బాబీ దర్శకత్వంలో ఈ పిరియాడిక్ సినిమాను సితార ఎంటర్టైన్‌మెంట్స్‌ నిర్మించనుంది. నాగ వంశీ నిర్మాతగా వ్యవహరించనున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X