సొంత పిల్లలు తప్పు చేస్తే బాలయ్య ఇలా చేస్తాడా? భలే షాకింగ్‌గా ఉందే?

ఒకప్పటి హీరో నందమూరి తారక రామారావు వారసుడిగా సినీ రంగ ప్రవేశం చేసిన నందమూరి బాలకృష్ణ... అతి తక్కువ సమయంలోనే తనకంటూ ప్రత్యేకమైన అభిమానులను సంపాదించుకున్నాడు. అయితే చూడడానికి రఫ్ అండ్ టఫ్ గా కనిపించే ఆయన ముక్కు మీద కోపం ఉన్న వ్యక్తి లా కనిపిస్తాడు. అయితే తన బిడ్డల విషయంలో మాత్రం బాలకృష్ణ ఎలా ప్రవర్తిస్తాడు? అందరితో ప్రవర్తించినట్లే ప్రవర్తిస్తాడా? లేదా అనే విషయం మీద చర్చ జరుగుతోంది. ఆ వివరాల్లోకి వెళితే....

నందమూరి హీరో బాలకృష్ణ ఇప్పటికే వందకు సైగా సినిమాలు పూర్తి చేసుకుని మరిన్ని సినిమాలు చేస్తూ ముందుకు వెళుతున్నాడు. ఆయన చివరిగా నటించిన వీర సింహారెడ్డి సినిమా రూ.100 కోట్లు కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ అయింది. నందమూరి బాలకృష్ణ కెరియర్ లోనే అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాగా నిలిచింది. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో నందమూరి బాలకృష్ణ నటన కూడా సూపర్బ్ గా ఉందని నందమూరి అభిమానులు భావిస్తూ ఉంటారు.

 balakrishna

ఆ సంగతి అలా ఉంచితే ప్రస్తుతానికి ఆయన అనిల్ రావిపూడి దర్శకత్వంలో భగవంత్ కేసరి అనే ఒక సబ్జెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమాలో నందమూరి బాలకృష్ణ మును పెన్నడూ కనిపించని ఒక పాత్రలో కనిపిస్తాడని కచ్చితంగా సినిమాతో మరో బ్లాక్ బస్టర్ కొడతామని నందమూరి అభిమానులు చాలా ధైర్యంగా ఉన్నారు. ఆ సంగతి అలా ఉంచితే ఇప్పుడు నందమూరి బాలకృష్ణ కి సంబంధించి ఒక ఆసక్తికరమైన ప్రచారం అయితే జరుగుతోంది. అదేమంటే నందమూరి బాలకృష్ణ సాధారణంగా చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు. ఎవరైనా సరే చెప్పిన మాట ప్రకారమే నడుచుకోవాలని చెప్పిన సమయానికి రావాలని ఇలా కొన్ని రూల్స్ ప్రకారం ఆయన ఫాలో అవుతూ ఉంటారు. ఎవరైనా బయటి వాళ్లు తన దగ్గర తప్పుగా ప్రవర్తిస్తే వారిని దండించే బాలకృష్ణ తన కుమారుడు కుమార్తెల విషయంలో ఎలా ఉంటారు? ఒకవేళ వారు తప్పు చేస్తే వారితో ఎలా డీల్ చేస్తారనే విషయం గురించి ఇప్పుడు చర్చ జరుగుతోంది.

balakrishna

అయితే నందమూరి కుటుంబానికి చెందిన సన్నిహితులు చెబుతున్న దాని ప్రకారం నిజానికి నందమూరి మోక్షజ్ఞ తేజ కాని బ్రాహ్మణి కానీ తేజస్విని కానీ ఒకసారి తప్పు చేస్తే నందమూరి బాలకృష్ణ ముందుగా కూర్చోబెట్టి వారికి ప్రశాంతంగా వివరించి ఇలా చేయడం తప్పు అని చెబుతారట. ఆ తర్వాత రెండోసారి కూడా రిపీట్ చేస్తే అప్పుడు కూడా మళ్లీ కూర్చొని అన్ని వివరించి చెబుతారని మూడవసారి తప్పు చేస్తే మాత్రం కాస్త కటవుగానే వార్నింగ్ ఇస్తారని అంటున్నారు. అయితే నందమూరి బాలకృష్ణ సంతానం మాత్రం అక్కడిదాకా ఎప్పుడు తెచ్చుకోలేదని మొదటిసారి తండ్రి కూర్చోబెట్టి చెప్పినప్పుడే విషయం అర్థం చేసుకుని మళ్లీ మళ్లీ ఆ తప్పు రిపీట్ అవ్వకుండా చూసుకుంటారని అంటున్నారు.

మొత్తం మీద నందమూరి బాలకృష్ణ తన సంతానంతో ఎలా మెలుగుతారని విషయం తెలిసిన పలువురు ఆసక్తికరంగా స్పందిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X