టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్న బాలకృష్ణ చిన్నల్లుడు.. మోక్షజ్ఞ కంటే ముందుగానే?
నందమూరి ఫ్యామిలీ నుంచి వచ్చిన స్టార్స్ కు మొదట్లోనే భారీ స్థాయిలో క్రేజ్ వచ్చింది. ఇక ఆ రూట్లో వచ్చిన వారు నందమూరి బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ అలాగే నందమూరి కళ్యాణ్ రామ్ ముగ్గురు కూడా స్టార్ హీరోలుగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇక రావలసిన మరికొందరు వారసులు కూడా త్వరలోనే ఎంట్రీ ఇవ్వబోతున్నట్లుగా తెలుస్తోంది. అయితే నందమూరి బాలకృష్ణ చిన్నల్లుడు కూడా త్వరలోనే టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టబోతున్నట్లుగా తెలుస్తోంది. అందుకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..

బాలయ్య క్రేజ్
నందమూరి బాలకృష్ణ తన తండ్రి వారసత్వాన్ని అదే తరహాలో కొనసాగిస్తూ మంచి గుర్తింపును అందుకుంటున్నారు. ముఖ్యంగా ఇటీవల కాలంలో అయితే బాలయ్య బాబు తన క్రేజ్ ను అమంతంగా పెంచేసుకుంటున్నాడు. ఆహా అన్ స్టాపబుల్ షో కూడా ఏ స్థాయిలో సక్సెస్ అయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక సినిమా తర్వాత అంతకుమించి అనే స్థాయిలో మరికొన్ని సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి.

మోక్షజ్ఞ ఎంట్రీ కోసం..
నందమూరి బాలకృష్ణ వారసుడు మోక్షజ్ఞ తేజ కూడా సినిమా ఇండస్ట్రీలోకి హీరోగా అడుగు పెడతాడు అని ఎప్పటినుంచో చెబుతున్నారు. ముఖ్యంగా బాలకృష్ణ అయితే తన దర్శకత్వంలోనే కుమారుడిని ఇండస్ట్రీకి పరిచయం చేస్తానని కూడా అన్నాడు. ఆదిత్య 369 సీక్వెల్ ఆదిత్య 999 స్క్రిప్ట్ కూడా రెడీ అవుతోంది అని కూడా ఆ మధ్య వివరణ ఇచ్చారు. దీంతో ఫ్యాన్స్ ఆ ప్రాజెక్టు ఎప్పుడు తెరపైకి వస్తుందో అని ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

గ్రాండ్ గానే ప్లాన్..
అయితే నందమూరి బాలకృష్ణ మోక్షజ్ఞ ఎంట్రీని మాత్రం గ్రాండ్ గానే ప్లాన్ చేస్తున్నట్లుగా అనిపిస్తుంది. పూర్తిస్థాయిలో పర్ఫెక్ట్ స్టోరీ సిద్ధమయ్యే వరకు కూడా అనౌన్స్ చేయకూడదు అని సిద్ధమయ్యారు. అందుకే మోక్షజ్ఞ బయట ఎక్కడ కనిపించినా కూడా కెమెరాల కంట పడటం లేదు. అతన్ని అంత ఈజీగా అయితే ఫ్యాన్స్ కు చూపించడానికి బాలయ్య బాబు కూడా ఇష్టపడడం లేదు.

బాలకృష్ణ అల్లుడు కూడా..
మోక్షజ్ఞ కంటే ముందే నందమూరి బాలకృష్ణ అల్లుడు సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టే అవకాశం ఉన్నట్లుగా ప్రస్తుతం ఒక టాక్ అయితే వైరల్ గా మారింది. ఆయన చిన్నల్లుడు ఇప్పటికే రాజకీయాల్లో కూడా కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఊహించని విధంగా మళ్ళీ అతను నటుడిగా ఇండస్ట్రీలోకి రావచ్చని టాక్ వస్తుంది. అయితే నిర్మాతగా ప్రయత్నాలు చేస్తున్నాడు అని కూడా మరొక వార్త వైరల్ గా మారింది.

అఫీషియల్ క్లారిటీ కోసం..
పలు వ్యాపారాలతో అలాగే రాజకీయంగా కూడా బిజీగానే కనిపించిన భరత్ ఇప్పుడు హఠాత్తుగా ఇండస్ట్రీలోకి అడుగు పెడతాడా లేదా అనే విషయంలో మాత్రం ఇంతవరకు అధికారికంగా ఎవరు క్లారిటీ ఇవ్వలేదు. ఇక నందమూరి బాలకృష్ణ అల్లుడి విషయంపై ఎప్పుడు క్లారిటీ ఇస్తాడా అని ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇక మోక్షజ్ఞ ఎంట్రీపై కూడా త్వరలోనే క్లారిటీ ఇచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











