Balayya Son మోక్షజ్ఞ మామూలోడు కాదుగా.. శ్రీలీల కోసం ఏకంగా ఎంత పెద్ద పని చేశాడంటే?
ఏంటి టైటిల్ చూసి నటసింహం బాలయ్య కొడుకు అంత పెద్ద పని ఏం చేశాడా అని అనికుంటున్నారా? అది కూడా యంగ్ సెన్సేషనల్ బ్యూటీ శ్రీలీల కోసం ఏం చేశాడనే తెలుసుకువాలని ఆసక్తి ఎక్కువైందా? దాని గురించే ఈ కథనం. అసలే ఈ మధ్య ఈ ఇద్దరికి పెళ్లి అంటూ వస్తున్న వార్తల నేపథ్యంలో ఇప్పుడు మోక్జజ్ఞ చేసిన పని అందరినీ షాక్ అండ్ సర్ప్రైజ్కు గురి చేస్తోంది. పూర్తి వివరాలను స్టోరీలోకి వెళ్లి తెలుసుకుందాం...
సాధారణంగా మనకు తెలిసినంతవరకు మోక్షజ్ఞ వెరీ సైలెంట్. డీసెంట్ అండ్ కామ్ బాయ్. బయట పెద్దగా కనపడదు. కనపడినా ఎక్కువ మాట్లాడడు. ఇతర స్టార్ కిడ్స్‌లా పార్టీస్, ఫ్రెండ్స్ అంటూ హడావుడి కూడా చేయడు. కాకపోతే ఈ మధ్యే వయసు వచ్చాక బయటకు వస్తూ కెమెరా కంటికి చిక్కుతున్నాడు. ఫ్యామిలీ ఫంక్షన్స్, తన తండ్రి షూటింగ్ సెట్స్‌లో సందడి చేస్తూ కనిపిస్తున్నాడు. సన్నగా మారుతూ తన లుక్ కూడా పూర్తిగా ఛేంజ్ చేసుకుంటున్నాడు.

పైగా ఈ మధ్య అతడు సినిమాల్లోకి రాబోతున్నాడనే ప్రచారం కూడా చాలా ఎక్కువ అయింది. అందుకే ఆ కాస్తో కూస్తో బయట కనపడుతున్నాడని అంటున్నారు. ఇప్పటికే పలువురు దర్శకుల పేర్లు కూడా వినిపిస్తున్నాయి. అనిల్ రావిపూడి, బోయపాటి, విరూపాక్ష దర్శకుడు అబ్బో చాలా పేర్లే వినిపించాయి. కానీ దీనిపై ఇంకా ఎటువంటి క్లారిటీ రాలేదు.
అయితే మనోడిలో యాక్టింగ్ టాలెంట్ ఉందో లేదో తెలీదు కానీ అతడి చుట్టూ సర్కిల్ బానే పెద్దగానే ఉందట. సాయం చేసే గుణం ఉందని అర్థమవుతోంది. ఇక భగవంత్ కేసరి సినిమా షూటింగ్ సమయంలో అయితే హీరోయిన్ శ్రీలీలతో మంచి ఫ్రెండ్షిప్ కూడా ఏర్పడిందని బయట కథనాలు కూడా వస్తున్నాయి. ఎంతలా అంటే వీరిద్దరికి పెళ్లి కూడా జరగబోతుందని అంతా మాట్లాడుకునేలా. మరి ఇందులో నిజమెంతో తెలీదు.

తాజాగా మరో విషయం బయటకు వచ్చింది. శ్రీలీలపై ఈ మధ్య సోషల్ మీడియాలో ట్రోలింగ్ కాస్త కనపడుతుందని అంటున్నారు. అయితే ఈ ట్రోలింగ్‌ను ఆపేందుకు మోక్షజ్ఞ తన ఫ్రెండ్స్ హెల్ప్ తీసుకున్నాడట. దీన్ని ఎలాగైనా ఆపే విధంగా చర్యలు తీసుకుంటున్నాడట. శ్రీలీల కూడా ఈ విషయంపై మోక్షజ్ఞకు థ్యాంక్స్ చెప్పిందని తెలిసింది. ఇక ఇది తెలుసుకుంటున్న నెటిజన్లు యవ్వారం మామూలుగా లేదే అంటూ తెగ కామెంట్స్ చేస్తున్నారు! అలాగే.. అడిగితే ఎవరైనా సాయం చేస్తారు అడగకుండానే సాయం చేసేవాడు రియల్ ఫ్రెండ్ అంటూ మరి కొంతమంది మోక్షజ్ఞను ప్రశంసిస్తున్నారు.
ఇక శ్రీలీల విషయానికొస్తే రీసెంట్గా గుంటూరు కారం చిత్రంతో ప్రేక్షకుల్ని పలకరించింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. త్వరలోనే పవన్ కల్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్‌తో పాటు మరి కొన్ని చిత్రాల్లో నటించనుంది. చూడాలి మరి ఈ చిత్రాలు ఆమెకు ఎలాంటి రిజల్ట్స్‌ను ఇస్తాయో..


Click it and Unblock the Notifications











