Don't Miss!
- News మీనరాశిలో బుధుడు ప్రత్యక్షం: ఈ రాశులవారి కెరీర్ ప్రమాదంలో.. జాగ్రత్త!!
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్‌మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్‌తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
అనుమానాస్పదంగా బాలయ్య ఫాన్స్ తీరు! తెరపైకి మోక్షజ్ఞ పేరు.. ఏం జరుగుతోంది?
తెలుగు తెరపై నందమూరి వారసుల హంగామా ఇప్పటిది కాదు. నందమూరి తారక రామారావు మొదలుకొని అప్పటి నుంచి ఇప్పటి దాకా నందమూరి వారసులంతా తెలుగు ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నారు. అందుకే నందమూరి కుటుంబానికి అశేష అభిమాన వర్గం ఏర్పడింది. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ విదేశాల్లో నందమూరి ఫ్యాన్స్ ఉన్నారు. కాగా తాజాగా నందమూరి ఫ్యాన్స్ చేస్తున్న కొన్ని ఏర్పాట్లు పలు అనుమానాలకు తావిస్తున్నాయి. పైగా బాలయ్య కొడుకు మోక్షజ్ఞ పేరు తెరపైకి రావడం చర్చనీయాంశంగా మారింది. ఇంతకీ ఏం జరుగుతోంది? వివరాలు చూస్తే..
మోక్షజ్ఞ 25వ పుట్టిన రోజు.. ఆసక్తికర విషయాలు
నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ పేరు గత కొన్ని రోజులుగా తరుచుగా వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 6వ తేదీన ఆయన 25వ పుట్టిన రోజు జరుపుకోనుండటంతో మోక్షజ్ఞ గురించిన కొన్ని ఆసక్తికర వార్తలు పుట్టుకొచ్చాయి. దీనికి కారణం ఆయన సినీ రంగ ప్రవేశం. నిజానికి కొద్ది రోజులుగా ఈ విషయమై ఓ రేంజ్ చర్చలు నడుస్తున్నాయి. తాజాగా అవి ఇంకా ముదరడం విశేషం.
గతంలో ఎన్నడూ లేని విధంగా
నందమూరి మోక్షజ్ఞ పుట్టిన రోజు వేడుకను రెండు తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నారట నందమూరి అభిమానులు. ఇదే అంశం పలు అనుమానాలకు తావిస్తోంది. గతంలో ఇలా ఏ పుట్టిన రోజుకూ ఏర్పాట్లు చేయము నందమూరి ఫ్యాన్స్ ఈ సారి మాత్రం ఎందుకిలా? అనే కోణంలో వార్తలు గుప్పుమంటున్నాయి.
వచ్చే ఏడాది సినీ రంగ ప్రవేశం..?
నందమూరి మోక్షజ్ఞ వచ్చే ఏడాది సినీ రంగ ప్రవేశం చేయబోతున్నారు కాబట్టే ఈ సారి పుట్టిన రోజు వేడుకలను ఇలా ప్లాన్ చేశారనేది సమాచారం. మోక్షజ్ఞ సినీ రంగ ప్రవేశం గురించి గత రెండేళ్లుగా చర్చ నడుస్తూనే ఉంది. కానీ ఇప్పటిదాకా అఫీషియల్ సమాచారమేదీ బయటకు రాలేదు. ఈ నేపథ్యంలో ఈ పుట్టిన రోజు వేడుకలే ఆయన సినీ రంగ ప్రవేశానికి సూచికలు అనే టాక్ మొదలైంది.
బాలకృష్ణ రహస్య పూజలు కూడా అందుకే అంటూ
గత కొద్ది రోజులక్రితం తూర్పు గోదావరి జిల్లాలోని ఓ ఆలయంలో నందమూరి బాలకృష్ణ, ఆయన తనయుడు మోక్షజ్ఞ రహస్యంగా పూజలు నిర్వహించింది కూడా ఇందుకే అంటూ వార్తలు వెలువడుతున్నాయి. ఈ లెక్కన చూస్తే బాలయ్య అభిమానులంతా నందమూరి మోక్షజ్ఞ సినీ రంగ ప్రవేశం గురించే ఆత్రుతగా ఉన్నారని తెలుస్తోంది. చూడాలి మరి చివరకు ఏం జరుగుతుందో!.