నందమూరి బాలయ్యతో మరో ప్లాన్ వేసిన అల్లు అరవింద్.. కొడుకు కోసం అలా..

నందమూరి బాలకృష్ణ ఒకవైపు సినిమాలతో పాటు మరొకవైపు ఆహా ఓటీపీ షో అన్ స్టాపబుల్ ను కూడా శరవేగంగా పూర్తి చేస్తున్నాడు. మొదటిసారి ఒక టాక్ షో ద్వారా హోస్ట్ గా మారిన బాలయ్య బాబు ఊహించిన విధంగా ఆడియన్స్ కు మరింత దగ్గరవుతున్నాడు. బాలయ్య బాబు లో ఇలాంటి యాంగిల్ కూడా ఉందా అని ఆశ్చర్యపోయే విధంగా చేస్తున్నాడు. అంతేకాకుండా బాలయ్య మిగతా హీరోలతో కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటాడు అని ఈ షో ద్వారా అర్థమవుతోంది.

మెగా హీరోలతో కూడా అతనికి ఎలాంటి క్లాష్ లేదు అనే విధంగా చేయాలి అని అల్లు అరవింద్ కూడా ప్రయత్నాలు చేస్తున్నాడు. అల్లు అరవింద్ కోరిక మేరకే బాలయ్య బాబు అన్ స్టాపబుల్ చేయడానికి ఒప్పుకున్నాడు. విరిమధ్య ఇప్పుడు ఈ షో ద్వారా మంచి సాన్నిహిత్యం కూడా పెరిగినట్లుగా తెలుస్తోంది. అయితే ఈ షోలోకి మెగా ఫ్యామిలీ నుంచి కేవలం అల్లు అర్జున్ మాత్రమే వచ్చాడు. ఇక మిగతా మెగా హీరోలు కూడా వస్తే షోకు మంచి హైప్ రావడమే కాకుండా మెగా నందమూరి హీరోల మధ్య ఎలాంటి విభేదాలు లేవు అనే విషయాన్ని కూడా చెప్పవచ్చు అని అల్లు అరవింద్ ఆలోచిస్తున్నారు.

 Nandamuri balakrishna special guest for allu shirish upcoming movie event

అంతేకాకుండా అల్లు నిర్మాత మరొక పెద్ద ప్లాన్ కూడా వేసినట్లు తెలుస్తోంది. నందమూరి బాలకృష్ణకు ఇప్పుడు మరింత క్రేజ్ పెరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఆ రూట్ లోనే తన కొడుకు సినిమాకు మంచి హైప్ క్రియేట్ అయ్యే విధంగా అల్లు అరవింద్ బాలయ్య బాబును ఉపయోగించకబోతున్నట్లు టాక్ అయితే వినిపిస్తోంది. అల్లు అరవింద్ చిన్న కుమారుడు అల్లు శిరీష్ సరైన సక్సెస్ లేక సతమతమవుతున్నాడు.

ఇక నవంబర్ 4వ తేదీన అతని నుంచి ఊర్వశివో రాక్షసివో అనే సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అయితే ఈ సినిమాకు సంబంధించిన ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు నందమూరి బాలకృష్ణను ముఖ్యఅతిథిగా రప్పించాలి అని అల్లు అరవింద్ ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. తప్పకుండా ఈసారి నందమూరి ఫ్యాన్స్ ఫోకస్ కూడా అల్లు శిరీష్ పై పడేవిధంగా ప్లాన్ చేసినట్లు టాక్. మరి ఈ టాక్ ఎంతవరకు నిజమో తెలియాలి అంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X