Nandamuri Balakrishna: మరో ఇద్దరు దర్శకులను లైన్ లో పెట్టిన బాలయ్య.. అన్ స్టాపబుల్ కాంబినేషన్స్!

మాస్ హీరో నందమూరి బాలకృష్ణ ఈ సంక్రాంతికి వీర సింహారెడ్డి సినిమాతో ప్రేక్షకులు ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాపై బజ్ అయితే మాములుగా లేదు అని ప్రస్తుతం వస్తున్నా రెస్పాన్స్ చూస్తేనే అర్థమవుతుంది. కేవలం ట్రైలర్ తోనే ఊహించిన విధంగా అంచనాలు పెరిగిపోయాయి. ఇక బాలకృష్ణ ఈ సినిమా తర్వాత అదిరిపోయే కాంబినేషన్స్ తో సరికొత్త సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఇటీవల ఆయన మరో ఇద్దరు దర్శకులకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఇక మొత్తంగా బాలయ్య బాబు ఎన్ని సినిమాలను లైన్లో పెట్టాడు అనే వివరాల్లోకి వెళితే..

బాలయ్య అన్ స్టాపబుల్

బాలయ్య అన్ స్టాపబుల్

మాస్ హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్టార్ ఇమేజ్ ను అందుకున్న నందమూరి బాలకృష్ణ ఎలాంటి సినిమా చేసినా కూడా ఫ్యాన్స్ చాలా బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇక ఇటీవల కాలంలో అయితే ఆయన రేంజ్ మరింత ఎక్కువగా పెరిగిపోయింది. జై బాలయ్య ట్యాగ్ ప్రతిసారి కూడా వైరల్ అవుతొంది. అన్ స్టాపబుల్ అనేలా బాలయ్య బాబు ముందుకు కొనసాగుతున్నారు.

ఉరమాస్ తరహాలో

ఉరమాస్ తరహాలో

నందమూరి బాలకృష్ణ ఫ్యాన్స్ అందరూ కూడా ప్రస్తుతం వీర సింహారెడ్డి సినిమా కోసం ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న రాబోతోంది. ఉరమాస్ తరహాలో ఈ సినిమా ట్రైలర్ కూడా భారీ అంచనాలను పెంచేసింది. ఇక సినిమాకు సంబంధించిన ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది.

లైన్ లో స్టార్ దర్శకులు

లైన్ లో స్టార్ దర్శకులు

ప్రస్తుతం బాలయ్య బాబుతో సినిమాలు చేయడానికి చాలామంది దర్శకులు రెడీ అవుతున్నారు. సక్సెస్ ట్రాక్ లో ఉన్నవారు కూడా ఆయన డేట్స్ దొరికితే సినిమాలు చేసేందుకు ఏమాత్రం ఆలస్యం చేయడం లేదు. ఇక ఇప్పటికే అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలకృష్ణ ఒక సినిమా చేయడానికి ఒప్పుకున్న విషయం తెలిసిందే. ఆ సినిమా షూటింగ్ త్వరలోనే మొదలు కాబోతోంది.

కాంబినేషన్స్ పై క్లారిటీ

కాంబినేషన్స్ పై క్లారిటీ

బాలయ్య బాబుతో సినిమా చేయడానికి లిస్టులో ఉన్న వారి సంఖ్య రోజురోజుకు మరింత ఎక్కువవుతోంది. బోయపాటి శ్రీను తో కూడా అక్కడ అఖండ సినిమాకు సీక్వెల్ ఉంటుంది అని ఆ మధ్య క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే. అలాగే సర్కారు వారి పాట దర్శకుడు పరశురామ్ కూడా బాలయ్య బాబుతో సినిమా చేసేందుకు ఆసక్తిగా ఉన్నట్లు ఇటీవల ఒకటి క్లారిటీ అయితే వచ్చింది.

మరో ఇద్దరు దర్శకులు

మరో ఇద్దరు దర్శకులు

ఇక వీరితోపాటు దర్శకుడు బాలకృష్ణ ఇటీవల మరో ఇద్దరు దర్శకులతో సినిమాలు చేసేందుకు చర్చించినట్లు తెలుస్తోంది. తనకు ఎన్నో బాక్సాఫీస్ హిట్ సినిమాలను అందించిన మాస్ యాక్షన్ దర్శకుడు బి.గోపాల్ తో ఒక సినిమా చేయాలని అనుకుంటున్నారు. అలాగే ఇటీవల బింబిసార సినిమాతో కళ్యాణ్ రామ్ కు బిగ్ సక్సెస్ ఇచ్చిన వశిష్టతో కూడా బాలయ్య బాబు ఒక సినిమా చేయాలని ఆలోచన వచ్చినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే వీరి మధ్యలో కొన్ని కథలకు సంబంధించిన చర్చలు కూడా మొదలైనట్లు సమాచారం. మరి ఈ కాంబినేషన్స్ పై అధికారికంగా ఎప్పుడు క్లారిటీ ఇస్తారో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X