నందమూరి ఫ్యాన్స్‌లో పెరుగుతున్న టెన్షన్.. బాలయ్య అదిరిపోయే ప్లాన్ రెడీ.. ఏ విషయమంటే!

By Manoj

పేరుకు సీనియర్ హీరోనే అయినా ఎప్పటికప్పుడు కొత్తగా తనను తాను మలచుకుంటుంటారు నందమూరి బాలకృష్ణ. నూతన దర్శకులను చిత్ర సీమకు పరిచయం చేయడం.. కుర్రాళ్లకు పోటీగా స్పీడుగా సినిమాలు చేయడం ఆయనకే సాధ్యం. యాక్టింగ్‌లోనూ, డైలాగ్ డెలివరీలోనూ, డ్యాన్స్‌ల్లోనూ ఆయన సరికొత్తగా కనిపించాలని ఉవ్విళ్లూరుతుంటారు. అందుకే బాలయ్య స్టార్ హీరోగా ఎదిగారు. ఈ మధ్య సినిమా సినిమాకు కొంత గ్యాప్ మెయింటైన్ చేస్తున్న ఆయన.. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ నేపథ్యంలో నందమూరి హీరో అదిరిపోయే ప్లాన్ రెడీ చేశారని తాజాగా ఓ వార్త బయటకు వచ్చింది. ఇంతకీ ఏంటా ప్లాన్.? పూర్తి వివరాల్లోకి వెళితే...

మళ్లీ హిట్ కొట్టాలని కలిశారు

మళ్లీ హిట్ కొట్టాలని కలిశారు

తనకు ‘జై సింహా' వంటి హిట్ ఇచ్చిన కేఎస్ రవి కుమార్‌తో నందమూరి బాలకృష్ణ మరోసారి కలిశారు. వీళ్లిద్దరి కాంబినేషన్‌లో ‘రూలర్' అనే సినిమా రాబోతుంది. దీన్ని కూడా సీ కల్యాణ్ నిర్మిస్తున్నారు. మరోసారి హిట్ కొట్టాలనే లక్ష్యంతో చిత్ర యూనిట్ పని చేస్తోంది. ఇందులో బాలయ్య సరసన వేదిక, సోనాల్ చౌహాన్ నటిస్తున్నారు.

Recommended Video

#CineBox : Taapsee Pannu Confirms Mithali Raj Biopic !
ఆ రెండింటికీ మంచి రెస్పాన్స్

ఆ రెండింటికీ మంచి రెస్పాన్స్

ఇటీవల ‘రూలర్' సినిమా నుంచి ఓ టీజర్, ఓ సింగిల్ విడుదల అయ్యాయి. ఈ రెండింటికీ ఫ్యాన్స్ నుంచి భారీ స్థాయిలో రెస్పాన్స్ వస్తోంది. టీజర్ పక్కా మాస్ మసాలా కంటెంట్‌తో ఉండడంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోతున్నాయి. అలాగే, పాట కూడా సినిమాకు ప్లస్ అయ్యేలానే కనిపిస్తోంది.

వాళ్ల ప్రకటనతో ఫ్యాన్స్‌లో టెన్షన్

వాళ్ల ప్రకటనతో ఫ్యాన్స్‌లో టెన్షన్

ఈ సినిమా డిసెంబర్ 20న విడుదలవుతుందని చిత్ర యూనిట్ గతంలోనే ప్రకటించింది. అయితే, అదే రోజు సాయి ధరమ్ తేజ్ ‘ప్రతిరోజూ పండగే' కూడా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. తాజాగా వీటికి ఓ వారం ముందు ‘వెంకీ మామ'ను విడుదల చేస్తున్నట్లు ఆ చిత్ర యూనిట్ ప్రకటించింది. దీంతో నందమూరి ఫ్యాన్స్‌లో టెన్షన్ పెరిగిపోతోంది.

దానితో సంతృప్తి పడలేదా?

దానితో సంతృప్తి పడలేదా?

‘రూలర్' విడుదలకు సమయం తక్కువగానే ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని సినిమా టీజర్‌ను విడుదల చేశారు. దీనికి మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది కానీ, అది రొటీన్ కమర్షియల్ సినిమాలానే కనిపిస్తుందన్న కామెంట్లు వినిపిస్తున్నాయి. దీనికితోడు బాలయ్య రెండో లుక్ కూడా సామాన్య ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోతున్నాయని టాక్.

బాలయ్య అదిరిపోయే ప్లాన్

బాలయ్య అదిరిపోయే ప్లాన్

ఒకవైపు సినిమాకు మిగిలిన వాటి నుంచి పోటీ పెరిగిపోతుండడంతో బాలయ్య అదిరిపోయే ప్లాన్ రెడీ చేశారని తాజాగా ఓ వార్త బయటకు వచ్చింది. దీని ప్రకారం.. కొద్ది రోజుల్లో విడుదలబోయే ట్రైలర్‌లో అసలు ‘రూలర్' ఎందుకు చూడాలో చెప్పే సన్నివేశాలను జోడిస్తున్నారట. అంటే.. ఇది రొటీన్ సినిమా కాదు అని చూపే ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X