బాలకృష్ణ భలే డిసీజన్ తీసున్నాడుగా! ఇలా జరిగితే ఇక..
కుర్ర హీరోలకు ధీటుగా సీనియర్ హీరోలు తీసుకుంటున్న నిర్ణయాలు షాకిస్తున్నాయి. ఒకప్పుడు ఇమ్మడి ముమ్మడిగా సినిమాలు తీసిన వెటరన్ స్టార్స్ ఇప్పటికీ తమ ప్రతిభ చాటుతూ నేటితరం యంగ్ హీరోలతో పోటీ పడుతున్నారు. నటన పరంగా, లుక్ పరంగా కుర్ర హీరోలకు ఏ మాత్రం తీసిపోము అన్నటుగా వ్యవహరిస్తున్నారు. ఈ కోవలోనే తాజాగా నందమూరి నటసింహం బాలకృష్ణ తీసుకున్న నిర్ణయం షాకిస్తోంది.
ఓ వైపు రాజకీయాలతో మరోవైపు సినిమాలతో బిజీగా ఉంటున్న బాలకృష్ణ రోజు రోజుకూ ఎవర్ యంగ్ లుక్ లోకి మారిపోతున్నారు. గతంతో పోల్చితే ఇప్పటికీ చాలా వరకు లుక్ మార్చేసిన ఈ నందమూరి హీరో తన తదుపరి సినిమా కోసం మరిన్ని కసరత్తులు చేస్తున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం కెఎస్ రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కొత్త సినిమాలో నటిస్తున్నారు బాలకృష్ణ.

ఈ చిత్రంలో సోనాల్ చౌహాన్, వేదిక బాలయ్య బాబు సరసన హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇటీవలే బ్యాంకాక్ షెడ్యూల్ పూర్తిచేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకుంటోంది. కాగా ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన కొన్ని పోస్టర్స్ బాలయ్య బాబు లుక్ బయటపెట్టేశాయి. గతంతో పోల్చితే చాలా స్లిమ్‌గా తయారై స్టైలిష్ లుక్ లో కనిపించారు బాలకృష్ణ.
అయితే తాజాగా వినిపిస్తున్న సమాచారం మేరకు బాలయ్య బాబు మరింత స్లిమ్ కాబోతున్నారట. ఇంకా 25 కిలోల బరువు తగ్గేందుకు గాను కసరత్తులు ప్రారంభించారట బాలకృష్ణ. కెఎస్ రవికుమార్ సినిమా పూర్తి కాగానే బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఆయన రూపొందనుంది. సో బోయపాటి సలహా మేరకు మరో 25 కిలోలు తగ్గాలని నిర్ణయించుకున్నారట బాలకృష్ణ. ఇదే జరిగితే ఇక కుర్ర హీరోలు బాలయ్య పోటీ తట్టుకోవడం కష్టమే మరి!.


Click it and Unblock the Notifications











