NBK109: బాలయ్య ఒక్కడు కాదు ముగ్గురు.. బాబీ సినిమా నుంచి సెన్సేషనల్ లీక్
సాధారణంగా ఏ స్టార్ హీరోకి అయినా ఒక్క హిట్ రావడం ఇప్పుడు చాలా కష్టంగా మారింది. అలాంటిది వరుసగా హిట్లు మీద హిట్లు కొడుతూ ఫుల్ ఫామ్‌తో దూసుకుపోతోన్నారు సీనియర్ హీరో నటసింహా నందమూరి బాలకృష్ణ. అందుకే ఆయన ఏమాత్రం బ్రేకులు లేకుండా వరుసగా సినిమాల మీద సినిమాలు చేస్తున్నారు. ఇటీవలే ఇటీవలే 'భగవంత్ కేసరి'తో మరో హిట్ కొట్టారు.
కెరీర్‌లోనే భీకరమైన ఫామ్‌తో సత్తా చాటుతోన్న నటసింహా నందమూరి బాలకృష్ణ తన 109వ సినిమాను బాబీ అలియాస్ కేఎస్ రవీంద్ర దర్శకత్వంలో చేస్తున్న విషయం తెలిసిందే. చాలా రోజుల క్రితమే ఈ మూవీ పూజా కార్యక్రమాలు కంప్లీట్ చేశారు. ఇక, ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన రెగ్యూలర్ షూటింగ్‌ను మొదలెట్టారు. ఇందులో యాక్షన్ పార్ట్‌ను షూట్ చేశారు.

నందమూరి బాలకృష్ణ - బాబీ కలయికలో తెరకెక్కనున్న ఈ సినిమా 1980 దశకం నాటి కథతో రూపొందబోతున్నట్లు ఇప్పటికే న్యూస్ లీకైంది. అందుకు తగ్గట్లుగానే ఇటీవలే వచ్చిన పోస్టర్లు డిజైన్ చేశారు. దీంతో ఈ చిత్రంపై అంచనాలు భారీ స్థాయిలో పెరుగుతున్నాయి. దీనికి ఏమాత్రం తీసిపోని విధంగా ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న విషయం తెలిసిందే.
బాలయ్య కెరీర్‌లోనే ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న ఈ చిత్రం గురించి ఎన్నో రకాల వార్తలు వైరల్ అవుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే తాజాగా దీని గురించి మరో న్యూస్ లీకైంది. దీని ప్రకారం.. ఈ చిత్రంలో బాలయ్య మూడు విభిన్నమైన గెటప్‌లలో కనిపించబోతున్నారట. ఇవన్నీ ఎంతో వైవిధ్యంగా ఉంటాయని, గతంలో ఆయన కనపించని విధంగా డిజైన్ చేశారని టాక్.

క్రేజీ కాంబినేషన్‌లో రాబోతున్న ఈ సినిమా మూడు పిరియడ్‌ల కాలానికి సంబంధించిన కథతో వస్తుందట. అంటే 1980 నుంచి ప్రస్తుత కాలానికి మూడు విధాలుగా బాలయ్య కనిపిస్తారని తెలుస్తోంది. దీంతో ఈ చిత్రంపై ఉన్న అంచనాలు అన్నీ రెట్టింపు అయిపోయాయి.
ఇదిలా ఉండగా.. హై ఓల్టేజ్ యాక్షన్‌తో డిఫరెంట్ కాన్సెప్టుతో రాబోతున్న ఈ సినిమాను సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడియోస్ బ్యానర్లపై సాయి సౌజన్య, నాగ వంశీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇందులో త్రిష, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా.. బాబీ డియోల్ విలన్‌గా చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.


Click it and Unblock the Notifications











